Top Headlines Today: పవన్ టార్గెట్ ఫిక్స్ అయిందా ?! పోలీసుల్ని తోసుకుంటూ, తరుముకుంటూ రావాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు
Top Telugu Headlines Today 02 July 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Top 5 Headlines Today: పొంగులేటి సంచలన వ్యాఖ్యలు, వెనకడుగు వేయొద్దని పిలుపు - వస్తున్నానంటూ భావోద్వేగం!
కాంగ్రెస్ జన గర్జన సభకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటంకాలు కలగజేస్తోందని మాజీ ఎంపీ, ఖమ్మం జిల్లా కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. మదమెక్కిన బీఆర్ఎస్ పార్టీ చెకింగ్ ల పేరుతో సభకు వచ్చేవారిని అడ్డుకుంటోందని అన్నారు. లారీలు, వ్యాన్ లను జూలురు పాడు వద్ద పోలీసులు నిలిపివేశారని అన్నారు. ఆటంకాలు సృష్టిస్తున్న ప్రభుత్వం, పోలీసులపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం (జూలై 2) మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించి సభను విఫలం చేయాలని చూస్తోందని పొంగులేటి ఆరోపించారు. లక్షలాది మంది జన గర్జన సభకు రావడానికి సిద్ధంగా ఉండగా.. వారు వచ్చేందుకు ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వలేదని అన్నారు. పూర్తి వివరాలు
తొలి విడత వారాహి యాత్రతో అనుకున్నది సాధించారా ? పవన్ టార్గెట్ ఫిక్స్ అయిందా ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ జూన్ 14వ తేదీ 30వ తేదీ వరకూ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల కోసం మొదటి యాత్ర ఇదే. ఈ యాత్ర ఇలా వరుసగా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు. ఈ వారాహి యాత్రపై జనసేన ఎన్నో ఆశలు పెట్టుకుంది. దీనికి కారణం నాలుగేళ్లుగా పవన్ ..ఇంత సుదీర్ఘంగా ఎప్పుడూ ప్రజల్లో తిరగలేదు. ఇప్పుడే మొదటి సారి బయటకు వచ్చారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని భావిస్తున్న సమయంలో ఆయన పర్యటనతో ప్రజంలతా పవన్ ను ప్రత్యామ్నాయ శక్తిగా భావిస్తారని ఆశిస్తున్నారు. మరి పవన్ అనుకున్న విధంగా వారాహి యాత్రలో ఆ టెంపో కొనసాగించగలిగారా ? పవన్ కల్యాణ్ ఎక్కడ ఎప్పుడు వెళ్లినా జన స్పందనకు మాత్రం కొదవ ఉండదు. ఆయన పవర్ స్టార్. ప్రత్యేకంగా జన సమీకరణ చేయాల్సిన అవసరం జనసేన నేతలకు ఉండదు. అందుకే అన్నవరం నుంచి ప్రారంభించి భీమవరం వరకూ జన జాతర కనిపించింది. అన్ని చోట్లా ప్రత్యేకంగా కొన్ని వర్గాలతో సమావేశం అయ్యారు. పూర్తి వివరాలు
శ్రీకాకుళం జిల్లాలో అర్ధరాత్రి జేసీబీలతో హైడ్రామా! భారీగా టీడీపీ శ్రేణులు, ఉద్రిక్తత
శ్రీకాకుళం జిల్లా పలాసలో అర్ధరాత్రి హై డ్రామా నెలకొంది. మంత్రి అప్పలరాజు ఆదేశాలతో టీడీపీ పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు ఇంటికి వెళ్లే రహదారి కాల్వర్టును తొలగించడానికి అధికారులు ప్రయత్నించారు. మంత్రి అప్పలరాజు ఒత్తిడితో అధికారులు జేసీబీలతో కల్వర్టును కూల్చేందుకు సిద్ధపడ్డారు. విషయం తెలుసుకున్న టీడీపీ ఇంచార్జ్ గౌతు శిరీష, ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే బెందాలం అశోక్ స్థానిక నేతలతో కలిసి అక్కడికి వెళ్లారు. అధికారుల తీరును తప్పు పట్టారు. ఇటీవల తాలభద్రలో జరిగిన టీడీపీ సభలో టీడీపీ నేతలు మంత్రి అప్పలరాజుపై విమర్శనాస్త్రాలు సంధించారు. దీంతో సభలో తనపై విమర్శలు చేసిన టీడీపీ నేతలను మంత్రి అప్పలరాజు టార్గెట్ చేశారు. పూర్తి వివరాలు
డీజీపీకి రేవంత్ రెడ్డి ఫిర్యాదు, ఖమ్మం సభకు అడ్డంకులు ఆపాలని వినతి
జన గర్జన సభలో పాల్గొనేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఖమ్మంకు బయలుదేరారు. ముందు నేరుగా సభా ప్రాంగణానికి చేరుకుని సభాస్థలిని పరిశీలించనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి హెలీప్యాడ్ వద్దకు వెళ్లి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి స్వాగతం పలకనున్నారు. అయితే, ఖమ్మం సభకు కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పోలీసుల తీరును నిరసిస్తూ అంతకుముందు డీజీపీ అంజనీ కుమార్‌కు రేవంత్ హైదరాబాద్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ మధుయాష్కీ కూడా రేవంత్ వెంట ఉన్నారు. ఖమ్మం సభకు వచ్చే వాహనాలను, కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోకుండా ఆదేశాలివ్వాలని డీజీపీని రేవంత్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్ కోరారు. అయితే, సభకు వెళ్లే వాహనాలను అడ్డుకోకుండా ఆదేశాలిస్తామని నేతలకు డీజీపీ హామీ ఇచ్చారు. పూర్తి వివరాలు
పోలీసుల్ని తోసుకుంటూ, తరుముకుంటూ రండి, కాంగ్రెస్ కార్యకర్తలకు నేతల పిలుపు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం సభపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. 3.8 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఖర్గే ట్వీట్ చేశారు. తెలంగాణ జనగర్జన మహా సభలో ప్రజల ఆకాంక్షల కోసం రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని, 1360 కి.మీ సుదీర్ఘ పాదయాత్రను పూర్తి చేసుకున్నందుకు CLP నాయకుడు భట్టికి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజాకూటమిని బలోపేతం చేయనున్నారని చెప్పారు. ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ స్పందిస్తూ.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటేనే భయపడుతుందని అన్నారు. రాహుల్ గాంధీ వస్తున్న జన గర్జన సభకు జనం లక్షలాదిగా తరలివస్తున్న తరుణంలో సభకు జనం రాకుండా అడ్డుకోవాలని చూస్తోందని అన్నారు. పూర్తి వివరాలు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial