అన్వేషించండి

Congress Khammam Meet: పోలీసుల్ని తోసుకుంటూ, తరుముకుంటూ రండి, కాంగ్రెస్ కార్యకర్తలకు నేతల పిలుపు

రాహుల్ గాంధీ మొదటిసారి ఖమ్మం జిల్లాలోకి అడుగు పెడుతుంటే, బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేక చెక్ పోస్ట్ లు పెట్టి నేతల్ని నిర్భందిస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం సభపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. 3.8 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఖర్గే ట్వీట్ చేశారు. తెలంగాణ జనగర్జన మహా సభలో ప్రజల ఆకాంక్షల కోసం రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని, 1360 కి.మీ సుదీర్ఘ పాదయాత్రను పూర్తి చేసుకున్నందుకు CLP నాయకుడు భట్టికి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. పలువురు సీనియర్‌ నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరి ప్రజాకూటమిని బలోపేతం చేయనున్నారని చెప్పారు. 

బీజేపీ చెప్పుచేతలో బీఆర్ఎస్, అందుకే అడ్డంకులు - మధుయాష్కి
ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ స్పందిస్తూ.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అంటేనే భయపడుతుందని అన్నారు. రాహుల్ గాంధీ వస్తున్న జన గర్జన సభకు జనం లక్షలాదిగా తరలివస్తున్న తరుణంలో సభకు జనం రాకుండా అడ్డుకోవాలని చూస్తోందని అన్నారు. పోలీసులను కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ వాడుకుంటుందని విమర్శించారు. మరో 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

‘‘రాహుల్ గాంధీ ఈ దేశానికి నాయకులు ఆయన సభను అడ్డుకోవడం ఏమిటి? టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ చెప్పుచేతలో ఉండి ఇలా చేస్తుంది. ఎవరు అడ్డుకున్న జనం లక్షలాదిగా వస్తారు.. ఇలాగే నిర్బంధం కొనసాగిస్తే బిఆర్ఎస్ నాయకులను  కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుంటారు’’ అని మధుయాష్కి అన్నారు.

ప్రైవేటు సైన్యంలా పోలీసులు - సీతక్క
తెలంగాణ ఇచ్చిన పార్టీ అధినేతగా రాహుల్ గాంధీ మొదటిసారి ఖమ్మం జిల్లాలోకి అడుగు పెడుతుంటే, బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేక చెక్ పోస్ట్ లు పెట్టి నేతల్ని నిర్భందిస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. బస్సులు, ప్రైవేటు వెహికల్స్ ను రానీయకుండా చెక్ పోస్ట్ లు పెట్టి ఆపడం అత్యంత హెయమైనా చర్య అని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారం  వ్యవహారిస్తున్నారని, ఉద్యోగులను  ప్రైవేటు మీటింగ్ కు, బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో కార్యకర్తలుగా ఉపయోగించుకొంటున్నారని విమర్శించారు. 

ఈరోజు పోలీసులను ప్రైవేటు సైన్యంగా వాడుకొని మా సభను అడ్డుకోవాలని చూస్తున్నారు. దీన్ని తెలంగాణ సమాజం ఖండించాలని కోరుతున్నాం. బీఆర్ఎస్ నాయకులారా ఇది పద్ధతి కాదు చేతిలో మీ ప్రభుత్వం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఖబడ్దార్. తెలంగాణ సమాజం రానున్న రోజుల్లో కచ్చితంగా బుద్ధి చెబుతారు. ప్రజలు కట్టే పన్నులతో వచ్చే జీతంతో మీరు డ్యూటీలు చేస్తున్నారు. మీకు జీతాలు కేసీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ఇంట్లో నుంచి వచ్చింది కాదు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించండి. పోలీసులు ఒక పార్టీకి తోత్తుగా మారి మా పార్టీ మీటింగ్ ను విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తే ఊరుకునేది లేదు. పోలీసులను తోసుకుంటూ తరుముకుంటూ ముందుకు రావాలని ప్రజలకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని సీతక్క పిలుపుఇచ్చారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget