అన్వేషించండి

TS News Developments Today: కవిత ఇంటి వద్ద టెన్షన్, టెన్షన్ - బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ, నేడు ఏం జరగనుంది?

మహిళా అధికారుల సమక్షంలోనే కవిత స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ రికార్డ్ చేయనున్నారు. ఆమె అంగీకారంతో వీడియో రికార్డింగ్ చేయనున్నారు. విచారణ నేపథ్యంలో భారీగా కార్యకర్తలు వస్తారనే భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్​ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆదివారం సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. హైదరాబాద్​ బంజారాహిల్స్‌‌‌‌లోని ఆమె ఇంట్లో స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ రికార్డ్ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే  160 సీఆర్‌‌‌‌‌‌‌‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు. కవిత చెప్పిన విధంగానే నేడు స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ రికార్డ్‌‌‌‌ చేసేందుకు వస్తామని సీబీఐ అధికారులు వెల్లడించారు. ఉదయం 11 గంటలకు సీబీఐ అధికారుల స్పెషల్‌‌‌‌ టీమ్‌‌‌‌ కవిత ఇంటికి చేరుకోనుంది.

మహిళా అధికారుల సమక్షంలోనే కవిత స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ రికార్డ్ చేయనున్నారు. ఆమె అంగీకారంతో వీడియో రికార్డింగ్ చేయనున్నారు. నిందితులైన బోయిన్‌‌‌‌పల్లి అభిషేక్‌‌‌‌రావు, అరుణ్‌‌‌‌ రామచంద్ర పిళ్లై, ఇండో స్పిరిట్ ఎండీ సమీర్‌‌‌‌‌‌‌‌ మహేంద్రు స్టేట్‌‌‌‌మెంట్ల ఆధారంగా ప్రశ్నించనున్నట్లు సమాచారం. సీబీఐ విచారణ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కవిత ఇంటికి వస్తారనే సమాచారంతో పోలీసులు అక్కడి పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

కవిత ఇంటి వద్ద టెన్షన్.. టెన్షన్.. బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ.. నేడు ఏం జరగనుంది?

ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో స్టేట్‌మెంట్ తీసుకునేందుకు ఇవాళ ఉదయం 11 గంటలకు సీబీఐ అధికారుల బృందం ఆమె ఇంటికి చేరుకోనున్నారు. బంజారాహిల్స్‌లోని ఆమె ఇంటికి వెళ్లి స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమె పాత్రపై ప్రశ్నలు అడగనున్నారు. ఇప్పటికే ఏయే ప్రశ్నలు అడగాలనే దానిపై సీబీఐ అధికారులు కొన్ని పాయింట్లను సిద్దం చేసుకున్నారు.సీబీఐ అధికారులు వస్తుండటంతో కవిత ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కవితను సీబీఐ అధికారులు ఏయే ప్రశ్నలు అడుగుతారు? ఆమె ఇచ్చే సమాధానాలు ఏంటి? వివరణ ఇచ్చిన తర్వాత కవిత విషయంలో సీబీఐ నెక్ట్స్ స్టెప్ ఎలా ఉంటుంది? అనే దానిపై బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలామంది వ్యాపారవేత్తలు, రాజకీయ నేతల హస్తం ఉండటంతో.. కవిత నుంచి అన్ని అంశాలపై సీబీఐ అధికారులు వివరణ తీసుకోవడానికి గంటల కొద్ది సమయం పట్టే అవకాశముందని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు, బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నలు అడిగే అవకాశముందని తెలుస్తోంది.ఢిల్లీ లిక్కర్ స్కాంతో కవితకు ఉన్న సంబంధం, ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో లిక్కర్ పాలసీ రూపకల్పనలో కవిత పాత్ర, సౌత్ గ్రూప్‌ లావాదేవీల అంశం, ఫోన్లను ధ్వసం చేయడం లాంటి అంశాలపై సీబీఐ ప్రశ్నించనుందని సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బడ్డీ రిటైల్ సంస్థ డైరెక్టర్ అమిత్ అరోరాకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉండటంతో ఆమె నుంచి వివరణ తీసుకునేందుకు సీబీఐ ఇటీవల నోటీసులు జారీ చేసింది.

6వ తేదీన విచారణకు రావాలని తెలపగా.. ఆ రోజు తాను అందుబాటులో ఉండనని, 11,12,14,15వ తేదీలలో ఎప్పుడైనా వివరణ తీసుకునేందుకు రావొచ్చని కవిత సీబీఐకు లేఖ రాశారు. దీంతో ఇవాళ సీబీఐ అధికారులు ఆమె ఇంటికి వెళుతున్నారు.ఆప్ నేతలకు సౌత్ గ్రూప్ నుంచి రూ.100 కోట్ల ముడుపులు వెళ్లినట్లు, సౌత్ గ్రూప్‌ను కవిత, మాగుంట, శరత్ చంద్రారెడ్డి నిర్వహిస్తున్నట్లు ఈడీ పేర్కొంది. ఆప్ నేతలకు సగం వెనక్కి ఇచ్చేలా హోల్‌సేలర్లకు 12 శాతం ప్రాఫిట్ మార్జిన్ ఇచ్చారని, ఆప్ నేతల తరపున రూ.100 కోట్లు విజయ్ నాయర్ తీసుకున్నట్లు ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. వీటిపై నేడు కవితను సీబీఐ ప్రశ్నించనుంది....

అర్ధ రాత్రి షర్మిల దీక్ష భగ్నం చేసిన పోలీసులు

వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు అర్ధరాత్రి భగ్నం చేశారు. రాత్రి సుమారు ఒంటిగంట సమయంలో ఆమెను పరీక్షించిన వైద్యులు.. ఆరోగ్యం క్షీణించినట్లు ప్రకటించారు. దీంతో పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. షర్మిల దీక్ష శిబిరం వద్దకు మీడియా రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. ఈనెల 9న లోటస్‌పాండ్‌లోని తన నివాసం వద్ద షర్మిల ఆమరణదీక్షకు దిగిన విషయం తెలిసిందే.

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Embed widget