Top Headlines Today: ఏపీ, తెలంగాణలో ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ 24 ఏప్రిల్ 2023
వైఎస్‌ఆర్టీపీ అధ్యక్షురాలిని పోలీసులు అడ్డుకోవడం వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఎస్సై, కానిస్టేబుల్‌పై షర్మిల్ చేయి చేసుకోవడం పెను దుమారాన్ని రేపింది.
ఎస్సై, కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న షర్మిల
నిరుద్యోగ దీక్షకు బయల్దేరిన వైఎస్‌ఆర్టీపీ అధ్యక్షురాలిని పోలీసులు అడ్డుకోవడం వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఎస్సై, కానిస్టేబుల్‌పై షర్మిల్ చేయి చేసుకోవడం పెను దుమారాన్ని రేపింది. ఆమె చర్యపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీలో ఉన్న తమపై చేయి చేసుకున్న ఆమెపై స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో షర్మిలపై కేసు నమోదు అయింది.
వైఎస్ షర్మిల ముందుకు వెళ్లకుండా ఆమె డ్రైవర్‌ను బయటకు లాగిన పోలీసుపై షర్మిల ఆగ్రహంతో చేయి చేసుకున్నారు. వెనకే ఉండి ఆమెను నియంత్రిస్తున్న మహిళా కానిస్టేబుల్ పై కూడా చేయి చేసుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. షర్మిల చేయి చేసుకున్న ఎస్సై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమపై ఎందుకు దాడి చేస్తున్నారంటూ ప్రశ్నించారు. వెంటనే ఆమెను పోలీసు వాహనం ఎక్కించాలని కానిస్టేబుళ్లను ఆదేశించారు. అలా లోటస్ పాండ్ నుంచి షర్మిలను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇంకా చదవండి
తాడిపత్రిలో జేసీ హౌస్ అరెస్టు, తప్పించుకొని రోడ్డెక్కి నిరసన - తీవ్ర ఉద్రిక్తత!
పెన్నా నదిలో ఇసుక తరలింపుల వ్యవహారం మళ్లీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇసుక అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన నిర్వహించాలని నిర్ణయించగా, ఆయన బయటికి రాకుండా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పెద్దపప్పూరు మండలంలోని పెన్నానదిలో ఇసుక తరలింపుల పరిశీలనకు వెళ్లాలని జేసీ నిర్ణయించారు. దీంతో పోలీసులు ఆయన ఇంటిని నిర్బంధం చేశారు. బారీకేడ్లు ఉంచి ఆయన నివాసం వద్దకు పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. అడ్డు వచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలను, ఇంకొంత మంది నేతలను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా చదవండి
కొట్టాలంటే ఇంకా గట్టిగా కొట్టొచ్చు, మాకు ఆ ఉద్దేశం లేదు - విజయమ్మ
వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేయడం, పోలీసులపై చేయి చేసుకున్న దృశ్యాలు మీడియాలో పదే పదే ప్రసారం అవుతుండడంపై వైఎస్ విజయమ్మ స్పందించారు. లోటస్ పాండ్‌లోని తన నివాసంలో విజయమ్మ సోమవారం (ఏప్రిల్ 24) మీడియాతో మాట్లాడారు. ఇది అసమర్థ ప్రభుత్వం అని కొట్టిపారేశారు. ఎప్పుడు చూసినా తమ ఇంటి చుట్టూ పోలీసులు ఉంటారని, షర్మిల ఏమైనా టెర్రరిస్టా? హంతకురాలా అని ప్రశ్నించారు.
" వైఎస్ షర్మిల డ్రైవర్ ను కొట్టారు. గన్ మెన్లను లాగేశారు. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించారు. ఆ ఆవేశంలో షర్మిల, నేను చెయ్యి అలా అన్నాము. మీడియాలో పదే పదే అదే చూపిస్తున్నారు. కొట్టాలంటే ఎంత గట్టిగా అయినా కొట్టొచ్చు. ఏమైనా చేయొచ్చు. కానీ కొట్టాలనే ఉద్దేశం షర్మిలకు లేదు, నాకూ లేదు " అని విజయమ్మ అన్నారు. ఇంకా చదవండి
జీవో నెంబర్ 1పై హైకోర్టుకు వెళ్లండి- పిటిషనర్‌కు సుప్రీం ఆదేశాలు
రోడ్లు, ఇతర ప్రాంతాల్లో ర్యాలీలు నిషేదిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్‌ను ఆశ్రయించాల్సిందిగా పిటిషనర్‌కు సూచించింది. త్వరగా విచారణ ముగించి తీర్పునివ్వాలని ఏపీ హైకోర్టుకు ఆదేశించింది. జీవో నెంబర్ 1పై జనవరి 24న విచారణ ముగించిన హైకోర్టు తన తీర్పు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో మరోసారి హైకోర్టుకే వెళ్లాలని పిటిషనర్‌లను సుప్రీంకోర్టు ఆదేశించింది.
తెలుగుదేశం నేత కొల్లు రవీంద్ర దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో జీవో నెంబర్1పై విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించింది. తీర్పును వాయిదా వేసింది. తీర్పు జాప్యంపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జనవరి నుంచి తీర్పు పెండింగ్‌లో ఉన్నట్టు పిటిషనర్లు సుప్రీంకోర్టు దృష్టి తీసుకొచ్చారు. అయితే వీలైనంత త్వరగా తుదితీర్పు ఇవ్వాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది.
పెండింగ్ బిల్లులు క్లియర్ చేసిన గవర్నర్ - సుప్రీం విచారణ వేళ కీలక నిర్ణయం
గవర్నర్ తమిళిసై వద్ద ఉన్న పెండింగ్ బిల్లుపై తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ సందర్భంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. తన వద్ద పెండింగ్‌లో ఉన్న మూడు బిల్లుల్లో ఒకటి తిరస్కరించారు. మరో రెండింటిని మరోసారి పరిశీలించాలని ప్రభుత్వానికి తిరిగి పంపించారు.
గవర్నర్, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. అసెంబ్లీలోని ఉభయ సభలు ఆమోదించిన పది బిల్లులను ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు. దీని వల్ల పాలనకు ఇబ్బందిగా మారుతుందని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇది ఇప్పటికే ఓసారి విచారణకు వచ్చింది. ఇవాళ మరోసారి విచారణకు రానుంది. ఈ సందర్భంగా తన వద్ద ఉన్న పెండింగ్ బిల్స్‌ను క్లియర్ చేశారు గవర్నర్.
అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లుల్లో మూడింటిని ఆమోదించినట్టు రెండింటిని రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. మరో రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనకు పంపించినట్టు మొన్నటి విచారణకు సుప్రీంకోర్టుకు తెలిపారు. మూడే బిల్లులు గవర్నర్ పరిశీలనలో ఉన్నట్టు రాజ్‌భవన్ తరఫున న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు. ఇవాళ విచారణ జరగనున్న వేళ ఆ మూడింటినీ క్లియర్ చేశారు. అందులో డీఎంఈ సహా వైద్యవిద్యలో పాలనాపరమైన పోస్టుల రిటైర్‌మెంట్ ఏజ్ పెంపును ఉద్దేశించిన బిల్లును తిరస్కరించారు. మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానం గడువును మూడు నుంచి నాలుగేళ్లకు పొడింగిపు, కో ఆప్షన్ సభ్యుల సంఖ్య పెంపును ఉద్దేశించిన బిల్లు, కొత్తగా మరిన్ని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతిస్తూ తీసుకొచ్చిన చట్టసవరణ బిల్లుపై వివరణ కోరారు.
వైసీపీ మహా దొంగల పార్టీ, ఏపీకి బుల్డోజర్ బాబా కావాలి - సునీల్ ధియోధర్
వైసీపీ మహా దొంగల పార్టీ అంటూ బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ ధియోధర్ విమర్శలు చేశారు. ఏపీకి బుల్డోజర్ బాబా కావాలన్నారు. గుంటూరులో బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశంలో ధియోధర్ మాట్లాడుతూ.. జనసేన మిత్రపక్షమని స్పష్టం చేశారు. జనసేన నాయకులతో కలిసి ప్రజా పోరు చేయాలని సూచించారు. ఏడాది కన్నా తక్కువ కాలం మన చేతుల్లో ఉందన్న ఆయన... గత ఎన్నికల ఫలితాలు చూసి నిరుత్సాహానికి గురికావద్దన్నారు. ఏపీలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు. ఏపీ ప్రజలు మోదీని ఇష్టపడుతున్నారన్నారు. బీజేపీ నుంచి వెళ్లిపోయిన వారి గురించి మర్చిపోవాలన్న సునీల్ ధియోధర్... వచ్చిన వాళ్లని ఆహ్వానించాలన్నారు. గుంటూరు జిన్నా టవర్ పేరు మార్పు బీజేపీ అజెండాలో ఉందన్నారు. జిన్నా పట్ల జగన్ కు ఎందుకింత ప్రేమ అంటే ముస్లిం ఓట్ల కోసమే అని విమర్శించారు. ప్రజలు కట్టే పన్నులు పాస్టర్స్ కి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జగన్ దళిత వ్యతిరేకి, ఫూలే , అంబేద్కర్ వ్యతిరేకి అని మండిపడ్డారు. రిజర్వేషన్ సీట్ల నుంచి గెలిచిన వైసీపీ ప్రజా ప్రతినిధులు చర్చిలకు వెళ్తుతున్నారన్నారు.