YS Sharmila: ఎస్సై, కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న షర్మిల - తీవ్రంగా పరిగణించిన పోలీసులు
వైఎస్ షర్మిల ముందుకు వెళ్లకుండా ఆమె డ్రైవర్‌ను బయటకు లాగిన పోలీసుపై షర్మిల ఆగ్రహంతో చేయి చేసుకున్నారు. వెనకే ఉండి ఆమెను నియంత్రిస్తున్న మహిళా కానిస్టేబుల్ పై కూడా చేయి చేసుకున్నారు.
నిరుద్యోగ దీక్షకు బయల్దేరిన వైఎస్‌ఆర్టీపీ అధ్యక్షురాలిని పోలీసులు అడ్డుకోవడం వారిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఎస్సై, కానిస్టేబుల్‌పై షర్మిల్ చేయి చేసుకోవడం పెను దుమారాన్ని రేపింది. ఆమె చర్యపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీలో ఉన్న తమపై చేయి చేసుకున్న ఆమెపై స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో షర్మిలపై కేసు నమోదు అయింది.
వైఎస్ షర్మిల ముందుకు వెళ్లకుండా ఆమె డ్రైవర్‌ను బయటకు లాగిన పోలీసుపై షర్మిల ఆగ్రహంతో చేయి చేసుకున్నారు. వెనకే ఉండి ఆమెను నియంత్రిస్తున్న మహిళా కానిస్టేబుల్ పై కూడా చేయి చేసుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. షర్మిల చేయి చేసుకున్న ఎస్సై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమపై ఎందుకు దాడి చేస్తున్నారంటూ ప్రశ్నించారు. వెంటనే ఆమెను పోలీసు వాహనం ఎక్కించాలని కానిస్టేబుళ్లను ఆదేశించారు. అలా లోటస్ పాండ్ నుంచి షర్మిలను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఉదయం నుంచి షర్మిల నివాసం వద్ద హైడ్రామ నడుస్తోంది. నిరుద్యోగ దీక్షకు వెళ్తున్న ఆమెను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తను అడ్డుకున్న పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల. సొంత పనుల మీద కూడా బయటకు రాకూడదా అని ఫైర్ అయ్యారు. ప్రతి విషయానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ధ్వజమెత్తారు. కారులో ధర్నాచౌక్‌కు వెళ్తున్న ఆమె మొదట పోలీసుల ఆపే ప్రయత్నం చేశారు. పోలీసులను చూసి డ్రైవర్ కారును మెల్లగా పోనిచ్చాడు. ఎందుకు స్లో చేశావని.. ఆపొద్దు ఫాస్ట్‌గా తొక్కూ అంటూ డ్రైవర్‌కు చెప్పారు షర్మిల. అదే టైంలో ఎదురుగా ఉన్న పోలీసులకు ఏమైనా అవుతుందేమో అని వాళ్లను పక్కకు లాగండని అక్కడే ఉన్న పోలీసులకు చెప్పారు. అయినా పోలీసులు ఆ వెహికల్‌ను ముందుకు పోనివ్వలేదు. అక్కడే ఆపేశారు.
తను అడ్డుకున్న పోలీసులుపై ఫైర్ అయ్యారు షర్మిల. అసలు తనను ఆపే హక్కు మీకు ఎక్కడిదని ప్రశ్నించారు. ఎందుకు అడ్డుకుంటున్నారని ఆగ్రహహం వ్యక్తం చేశారు. పోలీసులు రిక్వస్ట్ చేస్తున్నా... షర్మిల ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసులు, ప్రభుత్వం చర్యలకు నిరసగా అక్కడే నడిరోడ్డుపై కూర్చొని ధర్నా చేశారు. ఒంటరిగా రోడ్డుపై కూర్చున్న ఆమెను పోలీసులు బలవంతంగా స్టేషన్‌కు తరలించారు.
ఈ క్రమంలోనే తను పదే పదే అడ్డుకుంటున్న ఓ మహిళా కానిస్టేబుల్‌పై సీరియస్ అయ్యారు. కానిస్టేబుల్స్ నుంచి విదిలించుకొనే క్రమంలో ఆమెపై చేయిచేసుకున్నారు. తర్వాత నడుచుకుంటూ ఫాస్ట్‌గా ముందుకెళ్లే ప్రయత్నం చేశారు.
ఇంతలో షర్మిల ఆదేశాలతో కారు తీసేందుకు తన డ్రైవర్ ప్రయత్నించారు. అక్కడే ఉన్న ఎస్సై ఆ డ్రైవర్‌ను బయటకు లాగిపడేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల... తన డ్రైవర్‌పై ఎందుకు చేయి చేసుకున్నారని ప్రశ్నించారు. అసలు తన డ్రైవర్‌పై చేయి చేసుకోవడానికి మీరు ఎవరూ అంటూ నిలదీశారు. ఈ క్రమంలోనే ఆగ్రహంతో ఎస్సైపై చేయి చేసుకున్నారు.
షర్మిల చర్యతో షాక్ తిన్న ఎస్సై కాసేపటికి తేరుకొని తిరిగి సమాధానం ఇచ్చారు. అసలు తనను కొట్టడానికి మీరెవరూ అంటూ నిలదీశారు. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. తనను ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్న పోలీసుల తీరుపై ఆగ్రహించిన షర్మిల రోడ్డుపైనే కూర్చొని ధర్నా చేశారు.
రోడ్డుపై ధర్నా చేస్తున్న షర్మిలను పోలీసులు అరెస్టు చేసి జూబ్లీ హిల్స్ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌కు తరలించిన సమయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు షర్మిల. నిరుద్యోగులకు అన్యాయంచేశారని ఆరోపించారు. ఇచ్చిన నోటిఫికేషన్లకు సరిగా పరీక్షలు కూడా పెట్టలేకపోయారని ఆరోపించారు. టీఎస్‌పీఎస్పీలో కేసీఆర్ ప్రమేయం లేకుంటే సీబీఐ ఎంక్వయిరీ వేయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుంటే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. ఆయనకు నిజంగా ధైర్యం ఉంటే పేపర్ లీకేజీలో సీబీఐ దర్యాప్తును కోరాలని డిమాండ్ చేశారు షర్మిల.