Tollywood Protest : టాలీవుడ్ లో సమ్మె సైరన్, రేపటి నుంచి షూటింగ్ లు బంద్!
Tollywood Protest : టాలీవుడ్ సినీ పరిశ్రమలో సమ్మె సైరన్ మోగనుంది. రేపటి నుంచి సమ్మెకు సినీ కార్మికులు సిద్ధమయ్యారు. కనీస వేతనాలు ఇవ్వాలని ఎంతో కాలంగా కోరుతున్నా ఫెడరేషన్ పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.
Tollywood Protest : టాలీవుడ్ లో సమ్మె సైరన్ మోగనుంది. కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సినీ కార్మికులు రేపటి నుంచి సమ్మెకు సిద్ధమయ్యారు. కరోనా కారణంగా సినీ కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత రెండేళ్లుగా పనులులేక గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దీంతో కనీస వేతనాన్ని అమలు చేయాలని కార్మికులు గత కొంతకాలంగా నిర్మాతల్ని కోరుతున్నారు. సినిమాల బడ్జెట్ లు, హీరోల రెమ్యూనిరేషన్లు పెరుగుతున్నా, తమ కనీస వేతనాలు పెరగడం లేదని సినీ కార్మికులు ఆరోపిస్తున్నార. సినీ కార్మికుల వేతన సవరణను నిర్మాతలు పట్టించుకోకపోవడం లేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వేతనాలను 30 శాతం పెంచాలని కార్మికులు కోరుతున్నారు. సమ్మెకు కార్మికులు 15 రోజుల క్రితమే నోటీసులు ఇచ్చారు. రేపటి నుంచి(జూన్ 22) కార్మికులు సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. సమ్మె నోటీసుపై ఫెడరేషన్ లో చర్చలు కొనసాగుతున్నాయి.
పెంపుపై ఫెడరేషన్ తాత్సారం
కరోనా రెండేళ్ల సంక్షోభం తర్వాత సినీపరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. అయితే తమకు మాత్రం అంతంతమాత్రమే చెల్లిస్తున్నారని, కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా సినీ కార్మికులు వేతనాలు పెంచాలని నిర్మాతల మండలిని కోరుతున్నారు. అయితే ఫెడరేషన్ కార్మికుల వేతనాల పెంపు అంశాన్ని సాగదీస్తూ వచ్చింది. ఈ తరుణంలో వేతనాలు పెంచకుండా తాత్సారం చేస్తున్నారని కార్మికులు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో రేపటి నుంచి సమ్మె చేయనున్నట్టు ఇండస్ట్రీలోని 24 కీలక విభాగాల కార్మికులు ప్రకటించారు.
Also Read : శోభితతో నాగచైతన్య డేటింగ్ - సమంత పుట్టించిన పుకారేనా?
ఫిల్మ్ ఫెడరేషన్ ముట్టడి
సినీ కార్మికులు రేపు సమ్మెతో పాటు, ఫిల్మ్ ఫెడరేషన్ ముట్టడికి 24 యూనియన్ల సభ్యులు పిలుపునిచ్చారు. తమకు వేతనాలు పెంచే వరకు షూటింగ్ లు నిలిపివేస్తున్నట్లు, వేతనాలు పెంచకుండా శ్రమదోపిడీ చేస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. వేతనాలు పెంచే వరకు సహాయ నిరాకరణ చేస్తామన్నారు. గతంలో ఇచ్చిన హామీలు ఇప్పటి వరకూ నెరవేరలేదని, ఇకపై ఆలస్యం చేయకుండా హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. కార్మికులు సహాయనిరాకరణపై సినీ పరిశ్రమ ఎలా వ్యవహరిస్తోందో వేచిచూడాలి. కార్మికులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తారా లేదో రేపు తెలియనుంది.
Also Read : శోభితతో నాగచైతన్య డేటింగ్ - సమంత పుట్టించిన పుకారేనా?
Also Read : తక్కువ అంచనా వేయకండి - బాలకృష్ణ హీరోయిన్‌కు కరోనా