Telangana Doctors Private Practice Ban : తెలంగాణ ప్రభుత్వ డాక్టర్లకు షాక్ - ఇక ప్రభుత్వాసుపత్రిలో మాత్రమే
డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీస్‌ను తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. అయితే కేవలం కొత్తగా చేరే వారికే ఈ నిబంధన వర్తిస్తుంది.
Telangana Doctors Private Practice Ban : తెలంగాణ వైద్యారోగ్య శాఖలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా నియమితులయ్యే వైద్యులకు ప్రైవేట్ ప్రాక్టీస్‌ను రద్దు చేస్తూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నాన్ టీచింగ్ విభాగం నుంచి టీచింగ్ విభాగంలోకి బదిలీ ద్వారా వచ్చేవారు సైతం ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సర్వీస్ రూల్స్‌లో ప్రభుత్వం మార్పులు చేయగా.. మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్తగా నియమితులయ్యే వారికే వర్తింపు !
వైద్య విద్య సంచాలకుడి విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే ఇప్పటికే ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారికి నిబంధన వర్తించదని పేర్కొంది. అంటే కొత్తగా ఉద్యోగాల్లో చేరే ప్రభుత్వ వైద్యులు.. ఇకపై ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు. ఈ మేరకు మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనలను సవరించింది ప్రభుత్వం. క్లినికల్, నాన్ క్లినికల్, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి కనీస అర్హతలను తాజా ఉత్తర్వుల్లో నిర్ధారించింది. అందరు స్పెషలిస్టులు, డాక్టర్లు కచ్చితంగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వద్ద రిజిస్టర్ చేసుకోవాలని స్పష్టం చేసింది.
ఈ సారి కేసీఆర్ పోటీ పార్లమెంట్‌కా ? గజ్వేల్‌కు కొత్త అభ్యర్థి ఖాయమేనా ?
వైద్య పోస్టుల భర్తీ !
రాష్ట్రంలో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంలు, పారామెడికల్ సిబ్బందిని నియమించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకోసం కసరత్తు చేపట్టింది. ఈ తరుణంలో నియామక మార్గదర్శకాల్లో ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీస్ రద్దు అంశం కీలకంగా మారింది ఇప్పుడు. రాష్ట్రంలో మొత్తం 12,755 వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవగా వాటిలో 10 వేలకుపైగా పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్ ఆర్‌బీ) భర్తీ చేయనుంది. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎం పోస్టులను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు భర్తీ చేయనుండగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను మాత్రం టీఎస్‌పీఎస్సీ భర్తీ చేయనుంది.
సీఎం నోరు మెదపరా? రేణుకా చౌదరి ఆగ్రహం - ‘ఎమ్మెల్యే రఘునందన్‌పై కేసు సమంజసమే’
సీనియర్ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చా ?
ఇప్పటికే సర్వీసులో ఉన్న వైద్యులు అనేక మందికి సొంత క్లీనిక్‌లుఉన్నాయి. అయితే వారిపై కూడా ప్రైవేట్ ప్రాక్టీస్ బ్యాన్ విధిస్తే.. ఉద్యోగాలు మానేసే ప్రమాదం ఉందన్న కారణంగా ఆగినట్లుగా తెలుస్తోంది. వారందరూ మూకుమ్మడిగా మానేస్తే వైద్యుల కొరత ఏర్పడుతుంది. ఈ కారణంగా కత్తగా సర్వీసులో చేరాలనుకునేవారికే దీన్ని వర్తింప చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణలో మరిన్ని జాబ్స్‌కి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ - ఈ శాఖల్లో ఎన్ని ఖాళీలో తెలుసా?