News
News
X

PD ACT Rajasingh : రాజాసింగ్‌కు మరో చాన్స్ - గురువారమే పీడీయాక్ట్ అడ్వయిజరీ బోర్డు భేటీ !

పీడీ యాక్ట్ అడ్వయిజరీ బోర్డు సమావేశం గురువారం జరగనుంది. ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ బోర్డు ఎదుట హాజరు కానున్నారు.

FOLLOW US: 
 
PD ACT Rajasingh :   పోలీసులు పీడీ యాక్ట్ కింద జైల్లో పెట్టిన రాజాసింగ్‌కు బయటకు వచ్చేందుకు మరో అవకాశం లభించింది.  పీడీ యాక్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం గురువారం జరగనుంది.  ఈ సమావేశంలో వీడియా కాన్ఫరెన్స్ ద్వారా  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొంటారు.  గత నెల 25వ తేదీ నుండి రాజాసింగ్ చర్లపల్లి జైలులో ఉన్నారు.   2004 నుండి రాజాసింగ్ పై సుమారు 100కి పైగా కేసులు నమోదయ్యాయి.దీంతో రాజాసింగ్ పై హైద్రాబాద్ పోలీసులు ఆయనపై పీడీయాక్ట్ ప్రయోగించి చర్లపల్లి జైలుకు గత నెల 25న తరలించారు.  ఆగస్టు 22వ తేదీన రాజాసింగ్  యూట్యూబ్ లో ఒక వీడియోను అప్ లోడ్ చేశారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున బీజేపీ నుండి రాజాసింగ్ నుండి సస్పెండ్ చేశారు. 

అడ్వయిజరీ బోర్డు అంగీకరిస్తేనే కొనసాగింపు 

సాధారణంగా పీడీ యాక్ట్‌ కేసులు అడ్వైజరీ బోర్డ్‌ పరిధిలో ఉంటాయి. ముగ్గురు రిటైర్డ్‌ జడ్జీలతో కూడిన అడ్వైజరీ బోర్డ్‌ పీడీ యాక్ట్‌ ప్రొసీజర్స్‌ను పరిశీలిస్తుంది. ఈ బోర్డులో చైర్మన్‌, సభ్యులుగా ఇద్దరు రిటైర్డ్‌ జడ్జీలు ఉంటారు. పోలీసులు అందించిన పీడీ ప్రతిపాదనలను, కేసుల వివరాలను అడ్వైజరీ బోర్డు పరిగణనలోకి తీసుకుంటుంది. పీడీ నమోదైన నెల రోజులలోపు నిందితున్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారిస్తుంది. పోలీసులు అందించిన సాక్ష్యాధారాలను పరిశీలిస్తుంది. నిందితుని నుంచి వివరాలు తీసుకుంటుంది. పోలీసులు అక్రమ కేసులు పెట్టారని గుర్తిస్తే పీడీ యాక్ట్‌ను ఎత్తివేస్తుంది. పోలీసులు అందించిన ఆధారాలు నిజమని నిర్ధారణ అయితే ఏడాదికాలం వరకు జైలులోనే నిర్భంధించాలని ఆదేశిస్తుంది. ఇప్పుడు ఈ అడ్వైజరీ బోర్డే రాజాసింగ్ కేసులోనూ విచారణ జరపబోతోంది. 

News Reels

పీడీ యాక్ట్‌ను అడ్వయిజరీ బోర్డు తిరస్కరిస్తే వెంటనే స్వేచ్చ ! 

పీడీ యాక్ట్‌పై జైలుకు వెళ్లిన వారికి కోర్టులో బెయిల్‌ వేసుకునే అవకాశాలు ఉండవు. నెల రోజుల వ్యవధిలో అడ్వైజరీ బోర్డు జరిపే మొదటి విచారణ కీలకంగా మారుతుంది. అడ్వయిజరీ బోర్డు ఇచ్చిన ఆదేశాలే జైలుకు ఫైనల్‌ ఆర్డర్స్ అవుతాయి. ఆ తరువాత పీడీ యాక్ట్‌ను సవాలు  చేస్తూ నిందితులు అడ్వకేట్‌ ద్వారా హైకోర్టులో పిటిషన్ ఫైల్‌ చేసే అకాశం ఉంటుంది. ఈ క్రమంలో హైకోర్టులో విచారణకు వచ్చిన చాలా కేసుల్లో పీడీ యాక్ట్‌ను ఎత్తివేశారు.  హైకోర్టులో అనుకూలమైన తీర్పు వస్తే తప్ప.. పీడీ యాక్ట్ కేసులో ఏడాది పాటు జైలు గోడలకే పరిమితం కావాల్సి వస్తుంది. అడ్వయిజరీ బోర్డు .. పీడీ యాక్ట్ కరెక్ట్ కాదంటే .స్వేచ్చ లభించే అవకాశం ఉంది. 

ఇప్పటికే హైకోర్టుకు వెళ్లిన రాజాసింగ్ కుటుంబసభ్యులు !

ఇప్పటికే రాజాసింగ్ కుటుంబసభ్యులు  హైకోర్టును ఆశ్రయించారు. రాజాసింగ్‌పై నమోదైన పీడీయాక్ట్‌ను ఎత్తివేసి.. బెయిల్ మంజూరు చేయాలని.. ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేట్టిన హైకోర్ట్ ధర్మాసనం.. మంగళ్‌హాట్‌ SHO కి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.  

Published at : 28 Sep 2022 03:23 PM (IST) Tags: PD act MLA Rajasingh PD Act Advisory Board

సంబంధిత కథనాలు

TSPSC Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ - వివరాలు ఇలా!

TSPSC Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ - వివరాలు ఇలా!

TS Inter Fees: ఇంట‌ర్ విద్యార్థులకు అలర్ట్, ప‌రీక్షా ఫీజు గ‌డువు పొడిగింపు! చివరితేది ఎప్పుడంటే?

TS Inter Fees:  ఇంట‌ర్ విద్యార్థులకు అలర్ట్, ప‌రీక్షా ఫీజు గ‌డువు పొడిగింపు! చివరితేది ఎప్పుడంటే?

Minister KTR : తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక సింగరేణిపై కేంద్రం కుట్రలు - మంత్రి కేటీఆర్

Minister KTR :  తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేక సింగరేణిపై కేంద్రం కుట్రలు - మంత్రి కేటీఆర్

Airport Metro : లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !

Airport Metro :  లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !

Karimnagar Crime : ఆడపిల్లలను కొనుగోలు చేసి వ్యభిచార కూపంలోకి, వ్యభిచార ముఠా గుట్టురట్టు!

Karimnagar Crime :  ఆడపిల్లలను కొనుగోలు చేసి వ్యభిచార కూపంలోకి, వ్యభిచార ముఠా గుట్టురట్టు!

టాప్ స్టోరీస్

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!

Pawan Kalyan: ఇంకో రీమేకా? మాకొద్దు బాబోయ్ - ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ!

Pawan Kalyan: ఇంకో రీమేకా? మాకొద్దు బాబోయ్ - ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ!