By: ABP Desam | Updated at : 02 Feb 2022 05:05 PM (IST)
డ్రగ్స్ కేసులో ఈడీకి ఆధారాలివ్వాలని హైకోర్టు ఆదేశం
టాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ వ్యవహారాలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చిన కేసులో ఆధారాలన్నీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌కు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈడీ దరఖాస్తు చేస్తే 15 రోజుల్లో వివరాలు ఇవ్వాలని విచారణ డ్రగ్స్ కేసులో కాల్‌డేటా రికార్డులను నెల రోజుల్లో ఈడీకి ఇవ్వాలని స్పష్టం చేసింది. తమ ఆదేశాలు అమలు చేయకపోతే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. డ్రగ్స్ యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ..దేశ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈడీ దర్యాప్తునకు సహకరించాలని హైకోర్టు సూచించింది.
డ్రగ్స్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని పీసీసీ అధ్యక్షుడు కాక ముందే రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2017లో దాఖలు చేసిన ఆ పిటిషన్ పై ఇప్పటికీ విచారణ జరుగుతోంది. డ్రగ్స్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి సహకరించడంలేదనీ.. ఇందులో కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టు రేవంత్ తరపు న్యాయవాది రచనా రెడ్డి వాదనలు వినిపించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ జేడీ కూడా కోర్టుకు అదే తెలిపారు. ఈ కేసులో పత్రాలు, వివరాలను ప్రభుత్వం ఇవ్వడంలేదన్నారు.
Also Read: చేప దాడిలో జాలరి మృతి.. విశాఖ తీరంలో విషాదం..
కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం తమ వద్ద ఉన్న సమాచారం ఈడీకి, కోర్టులకు ఇచ్చామని స్పష్టం చేసింది. డ్రగ్స్ కేసులో ఎఫ్‌ఐఆర్‌లు, దర్యాప్తు అధికారుల రికార్డులతో పాటు పూర్తి వివరాలను ఈడీకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థలకు ఈ కేసు ఇవ్వాల్సిన అవసరం లేదన్న హైకోర్టు.. రేవంత్ రెడ్డి పిల్‌పై విచారణను ముగించింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసు విషయంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ .. సినీ ప్రముఖులందరికీ క్లీన్ చిట్ ఎప్పుడో ఇచ్చింది. ఎవరిపైనా బలమైన ఆధారాలు లేవని కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. వారి వద్ద సేకరించిన శాంపిల్స్‌లో ఆనవాళ్లు కూడా లేవని కోర్టుకు నివేదిక సమర్పించారు. ఈడీ కూడా డ్రగ్స్ కొనుగోలుకు నిధులు ఎలా చెల్లించారో విచారణ జరిపింది. ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వం సహకరించలేదన్న ఆరోపణలు వచ్చాయి. చివరికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఈడీ కేసు ముగించింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పిటిషన్ విచారణ కారణంగా ఆ వివరాలన్నీ ఈడీకి ఇస్తే మళ్లీ కేసును ఈడీ విచారణ ప్రారభించే అవకాశం ఉంది.
Medical Seats: కొత్తగా పది మెడికల్ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి
నెల గడువిస్తే 24 గంటల్లో రాహుల్ గాంధీపై అనర్హత వేటు అన్యాయమే: కేంద్ర మాజీ మంత్రి
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
Dial 100 Saves Life : డయల్ 100కు కాల్ చేసి, ఆత్మహత్యాయత్నం చేసిన యువతి- చాకచక్యంగా కాపాడిన కానిస్టేబుల్
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్
Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?