అన్వేషించండి

Visakha News: చేప దాడిలో జాలరి మృతి.. విశాఖ తీరంలో విషాదం..

చేపదాడిలో జాలరి మృతి. కొమ్ముకోనాం అనే చేప దాడి చేసిన ఓ జాలరిని చంపేసింది. అందర్నీ ఆశ్చర్యపరిచే ఈ ఘటన విశాఖలో జరిగింది.

విశాఖ జిల్లా పరవాడలో తీవ్ర విషాదం చోటు చేసుంది. చేప దాడిలో ఓ జాలరి మృతి చెందాడు. ముత్యాలపాలెం నుంచి కొందరు జాలర్లు వేటకు వెళ్లారు. వీళ్ల వలకు ఓ భారీ చేప పడింది. ఇదే ఆనందంలో ఉండగానే ఓ పెద్ద చేప జాలరిపై దాడి చేసింది. చేపను బయటకు తీసే క్రమంలో జోగన్నపై  కొమ్ముకోనాం అనే చేప అటాక్ చేసింది. ఈ దాడికి ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. 
  
వలలో మంచి చేపలు పడ్డాయన్న ఆనందతో ఉన్న జాలర్లు ఈ ఘటనలో ఒక్కసారిగా విషాదంలోకి జారిపోయారు. జోగన్న మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. ఆ డెడ్‌బాడీని చూసి ఆయన ఫ్యామిలి కన్నీరుమున్నీరుగా విలపించింది. 

మృతి సంగతి తెలుసుకున్న పోలీసులు ముత్యాలపాలెం చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. చేప ఎలా ఉంటుందీ .. ఎలా దాడి చేసింది... జోగన్న ఎన్ని గంటలకు చనిపోయాడు వంటి విషయాలపై ఆరా తీశారు. 

కొమ్ముకోనాం అనే చాలా అరుదైన చేప ఈ దాడి చేసి జోగన్న ప్రాణాలను తీసింది. ఈ చేప దొరికిందంటే జాలర్లు ఆ రోజంతా పండగ చేసుకుంటారు. అలాంటి లాభాలను అందించే చేప ప్రాణాలు తీసింది. 

బంగాళాఖాతంలో దొరికే అతి అరుదైనా చేపల్లో ఒకటే ఈ కోనాం. కొమ్ము కోనాం భారీ సైజ్‌లో ఉంటుంది. సాధారణంగా దీన్ని కొన్ని ప్రాంతాల్లో వంజరం అని కూడా పిలుస్తారు. చిన్నగా ఉంటే అలా అంటారు. సైజ్‌ పెరిగితే కోనాం అంటారు. 

ఈ కోనాం చేపకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుంది. కిలో వెయ్యిరూపాయల వరకు ధర పలుకుతుంది. అందుకే ఈ చేప పడిందంటే జాలర్లు ఫుల్ హ్యాపీ. కానీ ఆ చేపే ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. 

ఈ కొమ్ము కోనాం వలకు దొరకడం అంత ఈజీ కాదు. దొరికినా కొన్నిసార్లు వలను చీల్చుకొని తప్పించుకుంటుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగిందంటున్నారు జోగన్నతో వెళ్లిన జాలర్లు. వలను పైకి లాగే టైంలో చేప జోగన్నను కొట్టి సముద్రంలో పడిపోయిందంటున్నారు. చేపకు ఉండే మూతి భాగం గట్టిగా తగిలేసరికి జోగన్న అక్కడికక్కడే పడిపోయాడని చెబుతున్నారు. 

Also Read: తూర్పుగోదావరి జిల్లాలో కలకలం... కల్లు తాగిన నలుగురు మృతి.. ఇంకొకరి పరిస్థితి విషమం

Also Read: ఈ ఊర్లో వారికి పిల్లను ఇవ్వటంలేదు, హైవేకు దగ్గర్లోనే గ్రామం.. 100 ఏళ్లుగా ఎన్నో కష్టాలు

Also Read త్వరలోనే ‘ఫిష్ ఆంధ్ర’ పథకం.. ట్రయల్ రన్‌లో జగనన్న చేపల వాహనాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

India Monsoon Delay 2026:వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 
వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 
BJP MLA Vishnukumar Raju: వైజాగ్ వదలేసి భోగాపురం సోకులు కావాలా..?ఎయిర్‌పోర్టుపై విష్ణుకుమార్ రాజు కామెంట్స్
వైజాగ్ వదలేసి భోగాపురం సోకులు కావాలా..?ఎయిర్‌పోర్టుపై విష్ణుకుమార్ రాజు కామెంట్స్
Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
IMD Weather Alert Telugu States 2026:తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Rajya Sabha Seat Congress: షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
EPFO 3.0 PF withdrawal via ATM:ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
Rains In AP and Telangana: ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు.. అక్కడ పిడుగుల వార్నింగ్
ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలుచోట్ల వర్షాలు.. అక్కడ పిడుగుల వార్నింగ్
ABP India at 2047: అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
Maruti Suzuki May Sales Record: అద‌ర‌గొట్టిన మారుతి సుజుకి.. మేలో ఆల్ టైమ్ హైయెస్ట్ మంత్లీ సేల్స్ తో సరికొత్త రికార్డ్
అద‌ర‌గొట్టిన మారుతి సుజుకి.. మేలో ఆల్ టైమ్ హైయెస్ట్ మంత్లీ సేల్స్ తో సరికొత్త రికార్డ్
Shocking FASTag Scam: ఫాస్ట్‌ట్యాగ్ స్కామ్ పై మున్నాభాయ్ యాక్టర్ అశ్విన్ ముష్రాన్ సంచలన పోస్ట్: అకౌంట్ లో రూ. 3000 ఉన్నా రూ. 200 పెనాల్టీ.. 
ఫాస్ట్‌ట్యాగ్ స్కామ్ పై మున్నాభాయ్ యాక్టర్ అశ్విన్ ముష్రాన్ సంచలన పోస్ట్: అకౌంట్ లో రూ. 3000 ఉన్నా రూ. 200 పెనాల్టీ.. 
Dhurandhar Washma Butt Chai Shop Real Location: ధురంధర్‌ సినిమా ఎఫెక్ట్‌! లడఖ్‌లో టీ కొట్టు కిటకిట! అసలు రీజన్ ఏంటంటే?
ధురంధర్‌ సినిమా ఎఫెక్ట్‌! లడఖ్‌లో టీ కొట్టు కిటకిట! అసలు రీజన్ ఏంటంటే?
India Monsoon Delay 2026:వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 
వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 
Embed widget