Sajjala : చర్యలు తీసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు.. రోడ్డెక్కడం ఆపి చర్చలకు రావాలని ఉద్యోగ నేతలకు సజ్జల సలహా !

ఉద్యమ కార్యాచరణ వాయిదా వేసుకోవాలని ఉద్యోగ నేతలకు సజ్జల సలహా ఇచ్చారు. చర్యలు తీసుకునే వరకూ తెచ్చుకోవద్దని హెచ్చరించారు.

FOLLOW US: 

ఉద్యోగసంఘాల నేతలు అడుగుతున్న మూడు డిమాండ్లకు కాలం చెల్లిందని వాటిని పరిష్కరించమని అడగడం సరి కాదని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  వ్యాఖ్యానించారు.  సమస్యల పరిష్కారానికి నేరుగా చర్చలు జరుపుదామని ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.  సమస్యలుంటే పాయింట్ల వారీగా చెప్పాలని.. వాటిని పరిష్కరిస్తామని ఉద్యోగ నేతలకు హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలు నేరుగా చర్చలకు రవాలని, ఉద్యోగుల కార్యాచరణ పక్కనపెట్టాలన్నారు. తాము ఎంత చెప్పినా సమ్మెకు వెళ్లకముందే ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారని విమర్శించారు. 

 ఉద్యోగులు గురువారం చేసేది బలప్రయోగమని... వైషమ్యాలు పెంచడం ద్వారా ఏం సాధిస్తారని ఉద్యోగులను సజ్జల ప్రశ్నించారు.  ఉద్యోగ సంఘాలు చేస్తున్న మూడు డిమాండ్లకు కాలం చెల్లిందని.., ఇప్పటికే ఉద్యోగుల అకౌంట్లల్లో వేతనాలు క్రెడిట్ అయ్యాయన్నారు. జీతాలు క్రెడిట్ చేయడం వల్ల పీఆర్సీ జీవోలు వెనక్కి తీసుకోవాలి, పాత జీతాలే ఇవ్వాలన్న రెండు డిమాండ్లు నెరవేర్చడం సాధ్యపడదన్న ఆయన.. మిగిలిన డిమాండ్ అయిన పీఆర్సీ రిపోర్టు ఇవ్వడం వల్ల లాభం లేదని స్పష్టం చేశారు. డిమాండ్ల కోసం పట్టుబట్టేబదులు ప్రధాన సమస్యలపై చర్చలకు రావాలని సజ్జల సలహా ఇచ్చారు.  

ఉద్యమ కార్యాచరణను వాయిదా వేసుకోవాలని కోరామన్నారు. ఇప్పటి వరకు నేతల నుంచి ఎలాంటి స్పందన రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఉద్యోగుల ఆందోళనలో సంఘ విద్రోహ శక్తులు చొరబడే ప్రమాదం ఉందని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. తాము చేస్తున్న ఆందోళనపై ఉద్యోగ సంఘాల నాయకులు ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని  సూచించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపినా ఆందోళన చేస్తామంటున్నారని  ఇప్పుడు వారిని కూడా తీసుకు వచ్చి, బస్సులు ఆపి బల ప్రదర్శన చేయాలని చూస్తున్నారన్నారు. ఉద్యోగ నేతలపై మండిపడ్డారు. 

ఉద్యోగులు చర్యలు తీసుకునే పరిస్థితి కి తెచ్చుకోవద్దని కోరుతున్నాని.. వారికి ఏ విధంగా చూసినా జీతాలు పెరుగుతున్నాయని స్పష్టం చేశారు.   ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.., అది తమ బాధ్యతన్నారు.  ఉద్యోగుల ఆందోళనకు పోలీసులు అనుమతి ఇచ్చే అవకాశం లేదని .. కరోనా నిబంధనలు అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. ఉద్యోగ సంఘ నేతలు మాత్రం ప్రభుత్వం తమను పదే పదే చర్చల పేరుతో మోసం చేస్తోందని అంటున్నారు. తాము ముందు నుంచీ జీవోలను ఉపసంహరించాలని అడుగుతూంటే... ఇప్పుడు వేతనాలు వేసేశామని చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య గ్యాప్ అంతకంతకూ పెరుగుతోంది. 

Published at : 02 Feb 2022 04:17 PM (IST) Tags: ANDHRA PRADESH Sajjala Ramakrishnareddy Trade Union Leaders PRC controversy Employees Movement Sajjala Warning to Employees

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: ఆత్మకూరు ఉప ఎన్నికలో మేకపాటి విక్రమ్​ రెడ్డి గెలుపు

Breaking News Live Telugu Updates: ఆత్మకూరు ఉప ఎన్నికలో మేకపాటి విక్రమ్​ రెడ్డి గెలుపు

Atmakur Bypoll Result: ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ విజయం, మెజారిటీ ఎంతంటే

Atmakur Bypoll Result: ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ విజయం, మెజారిటీ ఎంతంటే

JNTU Kakinada Ragging: కాకినాడ జేఎన్‌టీయూలో ర్యాగింగ్ కలకలం - 11 మంది విద్యార్థులు హాస్టల్, కాలేజీ నుంచి సస్పెండ్

JNTU Kakinada Ragging: కాకినాడ జేఎన్‌టీయూలో ర్యాగింగ్ కలకలం - 11 మంది విద్యార్థులు హాస్టల్, కాలేజీ నుంచి సస్పెండ్

Nara Lokesh: రూట్ మార్చిన నారా లోకేష్! ఆ శైలితో క్యాడర్‌లో ఫుల్ జోష్ - ఖుషీలో నేతలు

Nara Lokesh: రూట్ మార్చిన నారా లోకేష్! ఆ శైలితో క్యాడర్‌లో ఫుల్ జోష్ - ఖుషీలో నేతలు

Thunderstorm Safety Tips: వానాకాలం మొదలైంది, ప్రాణాలు పోతున్నాయి - పిడుగుపాటుకు గురికాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి

Thunderstorm Safety Tips: వానాకాలం మొదలైంది, ప్రాణాలు పోతున్నాయి - పిడుగుపాటుకు గురికాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి

టాప్ స్టోరీస్

India vs England 5th Test: రోహిత్‌కు కరోనా - మరి ఐదో టెస్టుకు కెప్టెన్‌ ఎవరు?

India vs England 5th Test: రోహిత్‌కు కరోనా - మరి ఐదో టెస్టుకు కెప్టెన్‌ ఎవరు?

Indian Abortion Laws: మనదేశంలో అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఎన్ని వారాల వరకు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది?

Indian Abortion Laws: మనదేశంలో అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?  ఎన్ని వారాల వరకు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది?

PM Modi Mann Ki Baat: వ్యక్తిగత స్వేచ్ఛను లాగేసుకున్న రోజులవి, మన్‌కీ బాత్‌లో ఎమర్జెన్సీపై ప్రధాని ప్రస్తావన

PM Modi Mann Ki Baat: వ్యక్తిగత స్వేచ్ఛను లాగేసుకున్న రోజులవి, మన్‌కీ బాత్‌లో ఎమర్జెన్సీపై ప్రధాని ప్రస్తావన

T Hub Pics: టీ హబ్ 2.0 రెడీ, అబ్బురపరిచే నిర్మాణ శైలి! గాల్లోనే ఎక్కువ భాగం బిల్డింగ్ - ప్రారంభం ఎప్పుడంటే

T Hub Pics: టీ హబ్ 2.0 రెడీ, అబ్బురపరిచే నిర్మాణ శైలి! గాల్లోనే ఎక్కువ భాగం బిల్డింగ్ - ప్రారంభం ఎప్పుడంటే