అన్వేషించండి

Padi Kaushik Reddy: హన్మకొండ గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత - కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై టమాటాలతో దాడి

Grama Sabha: హన్మకొండలోని కమలాపూర్ గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరగ్గా.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు టమాటాలతో దాడి చేశారు.

Tension In Hanmakonda Grama Sabha: తెలంగాణలో గత 2 రోజులుగా గ్రామసభలు కొనసాగుతుండగా పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. హనుమకొండ జిల్లా కమలాపూర్ (Kamalapur) గ్రామసభలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలేవీ అమలు చేయలేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. డబుల్ బెడ్ రూం ఇళ్ల లిస్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) అధికారులను ప్రశ్నించారు. అయితే, 'మీ హయాంలో ఏమీ చేయలేదని... మా ప్రభుత్వం అన్ని చేస్తుంది' అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోటాపోటీగా నినాదాలు చేసుకున్నరు. కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ నాయకులు కుర్చీలు విసిరేశారు. కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై టమాటాలతో దాడి చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చ చెప్పేందుకు యత్నించారు. ఎలాంటి వివాదం రేగకుండా భారీగా మోహరించారు.

అటు, మరికొన్నిచోట్ల గ్రామసభల్లో వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వ పథకాల జాబితాలో తమ పేర్లు లేవని.. కొందరు లబ్ధిదారులు, ఆయా గ్రామస్థులు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. అయితే, ఇది లబ్ధిదారుల జాబితా కాదని.. దరఖాస్తు చేసుకున్న వారి జాబితా అంటూ స్థానిక కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు, ఇతర పథకాల లబ్ధి చేకూరుస్తున్నారని ఆరోపిస్తున్నారు. అసలైన అర్హులకు లబ్ధి చేకూరడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

మరోవైపు, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామసభలో ఉద్రిక్తత నెలకొంది. జాబితాలో తమ పేర్లు లేవంటూ కొందరు లబ్ధిదారులు అధికారులను నిలదీశారు. ఈ క్రమంలో తాజా మాజీ సర్పంచ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే అక్కడున్న పోలీసులు, గ్రామస్థులు అతన్ని అడ్డుకున్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని గ్రామసభలో పథకాలు అర్హులకు రాలేదంటూ అధికారులు, పోలీసులతో గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు.

Also Read: Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కాన్వాయ్‌కు ప్రమాదం - ఒకదానికొకటి ఢీకొన్న వాహనాలు, మంత్రి సేఫ్

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Embed widget