అన్వేషించండి

Telangna Elections 2023 : కామారెడ్డి నేతల మధ్య వర్గ పోరాటం - స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన కేసీఆర్ !

KCR Speech in Kamareddy: కామారెడ్డి నేతలు వర్గపోరాటానికి దిగడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ కలిసి పని చేసి భారీ మెజార్టీ తేవాలన్నారు.

Telangna Elections 2023 kamareddy KCR  :  స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కామారెడ్డి ( Kamareddy )  నుంచి పోటీ చేస్తూంటే అక్కడి పార్టీ నేతలు కొంత మంది  కాంగ్రెస్ లో చేరడం సంచలనం సృష్టించింది.  ఇదంతా నేతల మధ్య గ్రూపు తగాదాల కారణంగానే చోటు చేసుకోవడంతో అక్కడి నేతలకు కేసీఆర్ (KCR ) క్లాస్ తీసుకున్నారు. గ్రూప్ తగాదాలు వీడాలని ఆదేశించారు. ఇగోలు పక్కన పెట్టి పార్టీ కోసం ప్రతి కార్యకర్తలతో కలిసి పని చేయాలని సూచించారు. గురువారం నామినేషన్ వేసేందుకు కామారెడ్డికి వెళ్లిన కేసీఆర్ అక్కడ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ( MLA Gampa Govardhan ) ఇంట్లో నియోజకవర్గ నేతలతో సమావేశం అయ్యారు. నియోజకవర్గ పార్టీ పరిస్థితిపై సమీక్షించారు. 

కామారెడ్డిలో బీఆర్ఎస్‌కు నేతల వరుస రాజీనామాలు                     

ఇటీవల కామారెడ్డి బీఆర్ఎస్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, వివాదాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా నేతల తీరుపై గులాబీ బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమిష్టిగా పని చేయాలని, పార్టీ గీత దాటితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. నేతలు ఇలా విభేదించుకుంటే ఎన్నికల్లో పార్టీ నుంచి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఇటువంటి పరిస్థితి తీసుకురావొద్దని సూచించారు.   ఎమ్మెల్యే గంప గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి తో పాటు ముఖ్య నేతలందరూ పాల్గొన్నారు.

నేతలంతా కలసి కట్టుగా పని చేయాలన్న కేసీఆర్ - CM KCR Speech

 కామారెడ్డిలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ కు స్థానిక నేతల మధ్య విభేదాలు ఛాలెంజింగ్ గా మారాయి. నియోజకవర్గ ముఖ్యనేతలైన తిరుమల్ రెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ భర్త చంద్రశేఖర్ రెడ్డికి వాగ్వాదం జరగగా చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో తన భార్యతో పాటు ఆయన కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఘటన మరువక ముందే మాచారెడ్డి జడ్పీటీసీ, ఎంపీపీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇందులో జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కామారెడ్డిలో పార్టీ నేతల మధ్య సమన్వయం లోపిస్తుండటం బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. దీంతో పరిస్థితి ఇలాగే కొనసాగితే డ్యామేజ్ తప్పదని భావించిన కేసీఆర్ తాజాగా స్వయంగా రంగంలోకి దిగారు. 

గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్న కేసీఆర్                                     

ఈసారి గులాబీ బాస్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో పోటీ చేయడానికి ప్రత్యేకమైన వ్యూహం ఉందని కేసీఆర్ చెబుతున్నారు. అదేమిటన్నది ఆయన ప్రకటించడం లేదుకానీ విజాయన్ని పార్టీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయనను ఓడించాలన్న లక్ష్యంతో..  టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఆయనపై కాంగ్రెస్ పోటీకి నిలబెట్టింది. 
 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Pawan Kalyan: సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
PM Vidyalaxmi: 'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
YS Jagan: ఏపీలో చీకటి రోజులు - సూపర్‌-6 లేదు, సూపర్‌-7 లేదు - వైఎస్ జగన్ విమర్శలు
ఏపీలో చీకటి రోజులు - సూపర్‌-6 లేదు, సూపర్‌-7 లేదు - వైఎస్ జగన్ విమర్శలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

US Election Results 5 Reasons for Kamala Harris Defeatజగనన్నపై కారుకూతలు కూస్తార్రా? ఇక మొదలుపెడుతున్నా!Elon Musk Key Role Donald Trump Win | ట్రంప్ విజయంలో కీలకపాత్ర ఎలన్ మస్క్ దే | ABP DesamTrump Modi Friendship US Elections 2024 లో ట్రంప్ గెలుపు మోదీకి హ్యాపీనే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu: మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
మదమెక్కి, కొవ్వెక్కి అంబోతుల్లా తయారయ్యారు - వీళ్లని వదిలి పెట్టాలా ? సోషల్ కీచకులకు చంద్రబాబు డైరక్ట్ వార్నింగ్
Pawan Kalyan: సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు
PM Vidyalaxmi: 'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
'పీఎం విద్యాలక్ష్మి'రుణాలు ఎలా పొందాలి? ఎవరు అర్హులు? వడ్డీ ఎంత?
YS Jagan: ఏపీలో చీకటి రోజులు - సూపర్‌-6 లేదు, సూపర్‌-7 లేదు - వైఎస్ జగన్ విమర్శలు
ఏపీలో చీకటి రోజులు - సూపర్‌-6 లేదు, సూపర్‌-7 లేదు - వైఎస్ జగన్ విమర్శలు
Andhra Pradesh News: మొన్న సుభాష్‌- నేడు రామ్మోహన్- ప్రజాప్రతినిధులకు చంద్రబాబు చురకలు
మొన్న సుభాష్‌- నేడు రామ్మోహన్- ప్రజాప్రతినిధులకు చంద్రబాబు చురకలు
Supreme Court : రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
Graduate MLC Elections : బ్యాలెట్ ఎన్నికలకు వైసీపీ దూరం - గ్రాడ్యూయేట్ ఎలక్షన్స్‌లో పోటీ చేయడం లేదని ప్రకటన !
బ్యాలెట్ ఎన్నికలకు వైసీపీ దూరం - గ్రాడ్యూయేట్ ఎలక్షన్స్‌లో పోటీ చేయడం లేదని ప్రకటన !
TTD:  టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
టీటీడీలో అన్యమత ఉద్యోగులపై నేడో రేపో వేటు - వారికి అక్కడెలా ఉద్యోగాలు వచ్చాయి ?
Embed widget