అన్వేషించండి

TS Rains : తెలంగాణను వదలని వరుణుడు, మరో 3 రోజుల పాటు వర్షాలు

TS Rains : తెలంగాణలోని పలు జిల్లాలో మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణం కేంద్రం ప్రకటించింది.

TS Rains : తెలంగాణను వరుణుడు వదలడంలేదు. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం ప్రకటించింది. శనివారం ఉత్తర ఇంటీరియర్‌ ఒడిశా, ఛత్తీస్‌ గఢ్‌ పరిసరాల్లో ఉన్న ఆవర్తనం ఆదివారం ఆగ్నేయ మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి దక్షిణ దిశవైపునకు వంపు తిరిగి ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఆదిలాబాద్‌, కుమురం భీమ్‌ అసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, నిర్మల్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. పలు జిల్లాలకు రెడ్‌, ఆరెంజ్‌, ఎల్లో, గ్రీన్‌ అలర్ట్స్ జారీ చేసింది.  

ఏఏ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ 

సోమవారం జగిత్యాల, మంచిర్యాల, వరంగల్‌, హన్మకొండ, మహబూబాబాద్‌, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్‌, కుమురం భీమ్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, మెదక్‌, సంగారెడ్డి, జనగాం, భువనగిరి, మేడ్చల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. జులై 26వ తేదీన 11 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, మంచిర్యాల, వరంగల్‌, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. 

నిండుకుండలా శ్రీరాంసాగర్ 

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు గత 15 రోజులుగా వరద  కొనసాగుతూనే ఉంది. వానా కాలం సీజన్ ఆరంభంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సారెస్పీకి ఈ జులై మాసంలో రికార్డుస్థాయిలో వరద వస్తోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు, ఎగువ మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో ప్రాజెక్టు నిండుకుండలా కళకళలాడుతోంది. దీంతో అధికారులు 18 గేట్ల ద్వారా వరదను దిగువకు వదులుతున్నారు.  ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 56 వేల క్యూసెక్కులు వస్తుండగా  ఔట్ ఫ్లో  50 వేల క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1087.6 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 75.14 టీఎంసీలుగా ఉంది

 

టాప్ హెడ్ లైన్స్

Cancel Free Bus Scheme: 'నా భార్య నన్ను వదిలేసి ఫ్రీ బస్సులో వెళ్లిపోయింది'.. ఆ పథకాన్ని రద్దు చేయండి - బాధితుడి ఆవేదన
'నా భార్య నన్ను వదిలేసి ఫ్రీ బస్సులో వెళ్లిపోయింది'.. ఆ పథకాన్ని రద్దు చేయండి - బాధితుడి ఆవేదన
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Jayesh Ranjan IAS to opts VRS | వరుస బదిలీలు.. జయేశ్‌ రంజన్‌ వీఆర్‌ఎస్‌ నిర్ణయం వేనుక కారణమేంటి!
Jayesh Ranjan | వరుస బదిలీలు.. జయేశ్‌ రంజన్‌ వీఆర్‌ఎస్‌ నిర్ణయం వేనుక కారణమేంటి!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget