TS Police Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త - వారంలో పోలీస్ జాబ్స్‌కు నోటిఫికేషన్, సిద్దంగా ఉండండి
Telangana Police Jobs 2022 Notification: తెలంగాణలో వారం రోజుల్లో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. అభ్యర్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు.
Telangana Police Jobs 2022 Notification Will Be Released in A Week: తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు (Telangana Minister Harish Rao) శుభవార్త చెప్పారు. వారం రోజుల్లో పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఉద్యోగార్థులు సిద్దంగా ఉండండని సూచించారు. తమ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నదని, అయితే కేంద్రంలో 15 లక్షల పైగా పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.
వయోపరిమితి సడలింపు..
అభ్యర్థుల కోరిక మేరకు 3 ఏళ్ల వయోపరిమితికి తెలంగాణ సీఎం కేసీఆర్ రిలాక్సేషన్ ఇచ్చారని మంత్రి హరీష్ తెలిపారు. కొత్త నోటిఫికేషన్ల ద్వారా 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేసిన ఘనత కేసీఆర్ సొంతమన్నారు. పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 30 శాతం కోటా (Telangana Police Jobs Notification 2022) దేశంలో మరెక్కడా లేదన్నారు హరీష్ రావు. ఒక్కొక్క శాఖలవారీగా పూర్తి స్థాయిలో త్వరలోనే నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కొన్ని శాఖలలో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు లభించాయి.
ఉద్యోగాలు ఇవ్వనందుకు యాత్ర చేస్తున్నారా ?
సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటాన్ చెరు ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ధరలు పెంచినందుకు, ఉద్యోగాలు ఇవ్వనందుకు, ప్రజల జీవితాలను ఆగం చేస్తున్నందుకు యాత్ర చేస్తున్నారా..? ఏం ముఖం పెట్టుకొని ప్రజల మధ్య తిరుగుతున్నారని ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. తెలంగాణ విద్యార్థులు ఉద్యోగాల భర్తీ గురించి ఎక్కడికక్కడ బీజీపీ నేతలని నిలదీయాలని, ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ, బండి సంజయ్, కిషన్ రెడ్డిలను ప్రశ్నించండి అంటూ ఉద్యోగార్థులకు సూచించారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నది బీజేపీ పార్టీ నేతలన్నారు.
Also Read: Telangana Jobs: నిరుద్యోగలకు గుడ్ న్యూస్, 3334 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్