Telangana State Police: బాలుడి పాటకు తెలంగాణ పోలీసులు ఫిదా - ఆసక్తికర వీడియో ట్వీట్ చేసిన రాష్ట్ర పోలీస్ శాఖ
Telangana News: ఓ బాలుడి గాన ప్రతిభ తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను ట్యాగ్ చేసిన తెలంగాణ పోలీస్ శాఖ సదరు బాలున్ని ప్రశంసిస్తూ ఆసక్తికర ట్వీట్ చేసింది.
Telanagana Police Appreciated The Boy Who Sing a Song in Shankarabaranam: 'శంకరా... నాదశరీరా పరా.. వేద విహారా హరా.. జీవేశ్వరా..' ఈ పాట వినగానే మనకు గుర్తొచ్చేది 'శంకరాభరణం' (Shankarabaranam) సినిమా. ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట వినగానే ఇప్పటికీ సంగీత ప్రియులు ఓ రకమైన మధురానుభూతిని పొందుతారు. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో 1980లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తాజాగా, ఓ బాలుడు ఈ పాటను పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ తరగతి గదిలో కొందరు విద్యార్థులు.. స్కూల్ బెంచ్ పై కేవలం కంపాక్స్ బాక్సుతోనే వినసొంపైన మ్యూజిక్ అందిస్తుండగా ఆ సదరు బాలుడు అద్భుత గాత్రంతో సుందరంగా పాటను పాడి అలరించాడు. బాలుడి టాలెంట్ కు నెటిజన్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అటు, ఈ వీడియోను తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ట్యాగ్ చేస్తూ.. చిన్నారుల ప్రతిభను ట్విట్టర్ వేదికంగా ప్రశంసించింది. 'మన దేశంలో బాలలు, యువ ప్రతిభకు కొదవలేదు. తెలుసుకోవాల్సింది మంచి చెడుల మధ్య ఉన్న సన్నని గీత మాత్రమే. అది తెలుసుకుంటే యువ భారతం ఫరిడవిల్లి ఆవిష్కరణలకు నిలయంగా మారుతుంది.' అని పేర్కొంది.
మన దేశంలో బాలల/యువ ప్రతిభకు కొదువ లేదు...
— Telangana State Police (@TelanganaCOPs) February 18, 2024
తెలుసుకోవాల్సింది మంచి - చెడు అనే దారుల మధ్య సన్నని గీత మాత్రమే! అది తెలుసుకుంటే యువ భారతం ఫరిడవిల్లి మన దేశం సరికొత్త ఆవిష్కరణలకు నిలయం అవుతుంది. pic.twitter.com/Hlmh5C3Wn7