By: ABP Desam | Updated at : 10 Dec 2021 08:46 AM (IST)
స్థానిక కోటా ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్
తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (Local Body MLC Elections)కు పోలింగ్ ప్రారంభైంది. ఉదయం 8 ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 4 వరకు కొనసాగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం 26 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. నేడు జరుగుతున్న ఈ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకుగానూ మొత్తం 37 పోలింగ్ కేంద్రాల్లో, 5,326 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి స్థానిక సంస్థల కోటాలో పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల నిర్వహణను వెబ్‌క్యాస్టింగ్ చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. నేటి సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియనుండగా.. డిసెంబర్ 14న ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమదే విజయమని అధికార టీఆర్ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు. అయితే ఒక్క కరీంనగర్ జిల్లాలో మాత్రమే టీఆర్ఎస్ నేతలలో కొంత అమోమయం నెలకొంది. మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగడం ఓట్ల చీలికకు దారి తీస్తుందని జిల్లా నేతలు భావిస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందుకుగాను 8 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు. కరీంనగర్, హుజురాబాద్ జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, మంథని, సిద్ధిపేట, హుస్నాబాద్ లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. 1324 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. టీఆర్ఎస్ నుంచి ఎల్. రమణ, టి. భానుప్రసాద్ రావు పోటీలో ఉండగా, ఇండిపెండెంట్ గా టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి రవీందర్ సింగ్ బరిలో ఉన్నారు.
Also Read: Telangana CM KCR: ప్రభుత్వం మెడలు వంచైనా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయిస్తాం.. మాజీ మంత్రి షబ్బీర్ అలీ
ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఖమ్మం కలెక్టర్ పీవీ గౌతమ్ వివరించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో 84 మంది, కొత్తగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం పోలింగ్ కేంద్రంలో 221 మంది, కల్లూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయం పోలింగ్ కేంద్రంలో 115 మంది, ఖమ్మం రెవెన్యూ డివిజన్ కార్యాలయం పోలింగ్ కేంద్రంలో 348 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 314 మంది పురుషులు, 454 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.
Also Read: తెలంగాణ రైతులకు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ.. ఏం చెప్పారంటే?
ఉద్యమకారులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కారు
Gold-Silver Prices Today: పెరిగింది కొండంత, తగ్గేది గోరంత - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
TS GENCO: జెన్‌కో ఉద్యోగాల రాతపరీక్ష హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Revanth Reddy open letter: చివరిశ్వాస వరకు అటు కొడంగల్, ఇటు మల్కాజ్ గిరి నా ఊపిరి - రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం
Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?
BRS MLA Marri Rajashekar Reddy: బీఆర్ఎస్ నేతలకు బెదిరింపు ఫోన్ కాల్స్, సీపీకి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే
/body>