KCR In Delhi: ఒడువని ధాన్యం సేకరణ ముచ్చట.. ఢిల్లీలోనే సీఎం కేసీఆర్, మంత్రులు
ధాన్యం సేకరణపై కేంద్ర మంత్రులతో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు బృందం భేటీ అయింది. దీనిపై విషయం ఎటూ తేలలేదు.
ధాన్యం సేకరణపై ఢిల్లీకి వెళ్లిన రాష్ట్ర ప్రతినిధుల బృందం.. కేంద్ర మంత్రులతో భేటీ అయింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, పలువురు ఎంపీలు, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. ధాన్యం సేకరణ విషయంపై విషయం ఎటూ తేలకుండానే సమావేశం ముగిసింది. అయితే మరోసారి భేటీ కావాలని మంత్రుల బృందం నిర్ణయించుకుంది. రెండు రోజుల తర్వాత భేటీ అవుతారా? ఎప్పుడు అవుతారనే విషయం తెలియాల్సి ఉంది.
Telangana delegation comprising of Ministers @KTRTRS, @SingireddyTRS, and @GKamalakarTRS, and Telangana MPs formally met Union Minister for @CimGOI & Consumer Affairs Sri @PiyushGoyal in New Delhi today. pic.twitter.com/j7gErYAXuB
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 23, 2021
తెలంగాణ నుంచి రెండు సీజన్లలో ధాన్యం సేకరించాలని.. అందులో భాగంగా.. 100 నుంచి 200 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని మంత్రుల బృందం కోరింది. రాష్ట్ర ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు.. ఏ సీజన్‌లో ఎంత ధాన్యం ఉంటుందనే విషయంపై స్పష్టత కావాలని కేంద్రం కోరింది. సరైన అంచనాతో వస్తే.. నిర్ణయం తీసుకునేందుకు వీలు ఉంటుందని తెలిపింది.
మెుదట కేంద్రమంత్రి గోయల్ తో సమావేశం అయిన మంత్రులు.. ఆ తర్వాత.. మరో కేంద్రమంత్రి తోమర్ తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై కేంద్రమంత్రికి వివరించారు. కొన్నింటిపై తోమర్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఈ నెల 26న మరోసారి రాష్ట్ర ప్రతినిధులు.. గోయల్ తో మరోసారి సమావేశం అవ్వనున్నారు. ఆ రోజైనా.. ధాన్యం కొనుగోలుపై తుది నిర్ణయం వస్తుందని మంత్రులు అనుకుంటున్నారు.
కేంద్ర మంత్రులతో భేటీ అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. కేంద్రమంత్రులతో జరిగిన చర్చల గురించి తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు, ఇతర రైతు సమస్యలపై ఢిల్లీ వేదికగా కేంద్రంపై యుద్ధం చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మంత్రులు, అధికారులతో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు.
Also Read: Revanth Reddy: సాయం కోసం రైతు కుటుంబాలు కన్నీళ్లు పెడుతున్నాయి.. వాళ్లే భారమయ్యారా?