Minister KTR: ములుగు జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Minister KTR: పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రూ.150 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శుంకుస్థాపన చేశారు.
Minister KTR: పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ములుగు జిల్లాలో పర్యటిస్తున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రూ.150 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి మహమూద్ అలీతో కలిసి హెలికాప్టర్ లో ములుగు ప్రభుత్వ డిగ్రీ కలాశాలకు చేరుకున్న కేటీఆర్ కు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ స్వాగతం పలికారు. డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న సమీకృత కలెక్టరేట్ బవన సముదాయానికి దాని పక్కనే రూ.38.50 కోట్లతో నిర్మించనున్న జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన సంఘం, జిల్లా పోలీసు కార్యాలయ భవనాలకు శంకుస్థాపన చేశారు. అలాగే ఇటీవలే నిర్మించిన 5 మోడల్ పోలీస్ స్టేషన్లను(ములుగు, పేరూరు, వాజేడు, మేడారం, కన్నాయిగూడెం) నేడు ప్రారంభించారు. ప్రభుత్వ కార్యాలయాల పక్కా భవనాలు, మోడల్ బస్టాండ్ సముదాయానికి, సేవాలాల్ భవనానికి సైతం శంకుస్థాన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు.
ములుగు జిల్లా కేంద్రం నుంచి రామప్ప దేవాలయానికి చేరుకొని శిల్ప సందపను తిలకించి రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. రామప్ప చెరువు కట్ట వద్దకు చేరుకొని తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సావ్లలో భాగంగా సాగునీటి ఉత్సవాలను ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రానికి చేరుకొని ములుగు గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో రూ.30 లక్షలతో నిర్మించే డిజిటల్ లైబ్రరీ, రూ.15 లక్షలతో నిర్మించే సమాచార పౌర సంబంధాల శాఖ మీటింగ్ హాల్ పనులకు శంకుస్థాపనలు చేస్తారు. జిల్లా కేంద్రంలో రూ. 2 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను కూడా ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి సాధన స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేధిక వద్దకు చేరుకుంటారు.
నిన్న దండు మల్కాపూర్ లో టాయ్ పార్కు ఏర్పాటు
రాష్ట్రంలో పరిశ్రమలకు అత్యంత పారదర్శకంగా అనుమతులు ఇస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అలాగే టీపాస్, ఐపాస్ లాంటి విధానం అమెరికాలో కూడా లేదని పేర్కొన్నారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈక్రమంలోనే తెలంగాణ టాయ్స్ పార్క్‌కు మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. మృదువైన బొమ్మలు, ఎలక్ట్రానిక్, ప్లాస్టిక్, నాన్ టాక్సిక్, సిలికాన్ బొమ్మలతో పాటు పర్యావరణ అనుకూలమైన బొమ్మల తయారీని ప్రోత్సహించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. టీఎస్ఐఐసీఎల్టీడీ ద్వారా అభివృద్ధి చేయబడిన తెలంగాణ టాయ్ పార్క్.. స్థానిక ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. వీరందరికి కొత్త ఉపాధి అవకాశాలను కల్పిస్తుందన్నారు. భారతదేశం నుంచి బొమ్మల ఎగుమతిలో తెలంగాణ పవర్ హౌజ్ గా మారింది. ఈ పార్కులో టాయ్ మ్యూజియం, కామన్ ఫెసిలిటీ సెంటర్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సదుపాయం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ మరియు చిల్డ్రన్స్ అమ్యూజ్‌మెంట్ పార్క్ సౌకర్యం కూడా ఉన్నాయని మంత్రి కేటీర్ వివరించారు. 16 మంది కాబోయే బొమ్మల తయారీ పారిశ్రామికవేత్తలకు మంత్రి కేటీఆర్ అనుమతులు ఇచ్చారు.