(Source: ECI/ABP News/ABP Majha)
Covid Updates: తెలంగాణలో కోవిడ్ విజృంభణ... కొత్తగా 3,877 కేసులు, ఇద్దరు మృతి
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 3,877 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ఇద్దరు మరణించారు.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,01,812 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీటిల్లో కొత్తగా 3,877 మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,51,099కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మరణించారని పేర్కొంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనాతో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,083కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 40,414 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి నిన్న 2,981 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 7,10,479కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు
ఏపీలో కరోనా ఉద్ధృతి తగ్గలేదు. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 40,635 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 12,561 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో 12 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,591కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 8,742 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 21,20,717 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 1,13,300 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో కరోనా కేసులు
దేశంలో కొత్తగా 2,51,209 మంది కరోనా కేసులు నమోదయ్యాయి. 627 మంది మృతి చెందారు. 3,47,443 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3,80,24,771కి చేరింది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 21,05,611గా ఉంది. రికవరీ రేటు 93.60గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 15.88గా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 17.47గా ఉంది. నిన్న ఒక్కరోజే 15,82,307 కరోనా శాంపిళ్లను పరీక్షించారు. ఇప్పటివరకు మొత్తం 72.37 కోట్ల శాంపిళ్లను పరీక్షించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. భారత్లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే 57,35,692 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,64,44,73,216కు చేరింది.
కోవిడ్ చుక్కల మందుకు డీజీసీఐ అనుమతి
కరోనా థర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌లో ఉన్న దశలో ఓ శుభవార్త వచ్చింది. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకాను (నాసల్ వ్యాక్సిన్) 'బూస్టర్ డోసు'గా వినియోగించేందుకు అవసరమైన క్లినికల్ పరీక్షల నిర్వహణకు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. క్లినికల్ పరీక్షలు దేశవ్యాప్తంగా 9 ప్రాంతాల్లో జరగనున్నాయి. దేశంలో ఒమిక్రాన్, కరోనా కేసులు భారీగా పెరుగుతోన్న వేళ బూస్టర్ డోసుపై మరోసారి చర్చ నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఈ చుక్కల మందు టీకాను (నాసల్ వ్యాక్సిన్) 'బూస్టర్ డోసు' కింద వినియోగించేందుకు సూత్రప్రాయంగా డీసీజీఏ ఇప్పటికే అనుమతి ఇచ్చింది.