Telangana High Court : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ - కేటీఆర్ పంతం నెరవేరుతుందా ?
Telangana Politics : ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ తరపున ఈ పిటిషన్లు దాఖలయ్యాయి.
Disqualification of MLAs : భారత రాష్ట్ర సమితి నుంచి ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ పూర్తయింది. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈ పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. మంగళవారం జరిగిన విచారణలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులను నిర్దిష్ట సమయంలోగా పరిషరించాలని తాము స్పీకర్‌కు గడువు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని దీనిపై మీ వైఖరి ఏమిటో చెప్పాలని అడ్వకేట్ జనరల్‌ను హైకోర్టు ప్రశ్నించింది. అయితే స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలు జారీ చేయరాదన్నదే తమ వాదన అని అడ్వకేట్ జనరల్ వాదించారు.
స్పీకర్‌కు గడువు విధించవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందన్న బీఆర్ఎస్ తరపు లాయర్
సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం వెలువరించిన ఉత్తర్వుల ప్రకారం ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై పిటిషన్లను మూడు నెలల్లోగా పరిషరించాలని బీఆర్ఎస్ తరపు లాయర్లు వాదించారు. బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని ప్రభుత్వ లాయర్ వాదించారు. కోర్టు ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామన్నారు. మణిపూర్ రాజకీయాలకు సంబంధించి ఉత్తర్వులు ఉన్నాయని బీఆర్ఎస్ తరపు లాయర్ సూచించారు. కానీ స్పీకర్ ముందున్న పిటిషన్లను విచారణ చేయాలని ఇప్పటివరకు సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని ప్రభుత్వ లాయర్ స్పష్టం చేశారు.
స్పీకర్ విధుల్లో కోర్టు జోక్యం ఉండకూడదన్నదే తమ వాదనగా చెప్పిన ప్రభుత్వ లాయర్
ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఒకరు అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కూడా చేశారని బీఆర్ఎస్ తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలు జారీ చేయవచ్చునని వాదించారు. తన వాదనను బలపరిచే పలు తీర్పులను ఆయన ఉదహరించారు. స్పీకర్ మూడు నెలల గడువులోగా పార్టీ ఫిరాయింపుల పిటిషన్‌పై విచారణ పూర్తి చేయాలని మణిపూర్ ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల విసృ్తత ధర్మాసనం తీర్పు చెప్పిందని తెలిపారు. సుదీర్గ వాదనల తర్వాత హైకోర్టు తీర్పును వాయిదా వేసిందన్నారు.
జగన్‌పై అసంతృప్తి - ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి దారెటు ?
తీర్పు రిజర్వ్
ఎన్నికలు ముగిసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో పది మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిలో దానం నాగేందర్ సికింద్రాబాద్ నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. వీరందరిపై స్పీకర్ వద్ద బీఆర్ఎస్ పార్టీ అనర్హతా పిటిషన్లు దాఖలు చేసింది. కానీ స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.