అన్వేషించండి

TSPSC Group 2 Exam postponed: తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేసిన సీఎం కేసీఆర్ - కొత్త షెడ్యూల్ ఇలా

Telangana Group 2 Reschedule: తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

Telangana Group 2 Reschedule TSPSC Group 2 Exam postponed: 
గ్రూప్ 2 అభ్యర్థులు, ప్రతిపక్షాల పోరాటం ఫలించింది. తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు ఎగ్జామ్ రీషెడ్యూల్ పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని టీఎస్‌పీఎస్సీతో సంప్రదించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. లక్షలాది మంది అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. తాజా నిర్ణయంతో ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది.  గ్రూప్ 2 ఎగ్జామ్ నవంబర్ నెలకు (TSPSC Group 2 Exam In November) రీషెడ్యూల్ చేసినట్లు సమాచారం. సీఎస్, టీఎస్ పీఎస్సీ అధికారులు చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎగ్జామ్ నిర్వహించేలా కనిపిస్తోంది. త్వరలో తేదీలను ప్రకటించనున్నారు.

భవిష్యత్తులో కమిషన్ విడుదల చేసే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌లు ఒకేసారి ఎగ్జామ్ నిర్వహించేలా కాకుండా, అభ్యర్థులు ప్రిపరేషన్ కు తగిన సమయం ఉండేలా ప్లాన్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఎస్‌పీఎస్సీతో చర్చించి గ్రూప్-2 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని సీఎస్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అలా ప్లాన్ ప్రకారం జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా అర్హులైన అందరు అభ్యర్థులు అన్ని పరీక్షలకు సన్నద్ధం కావడానికి అవకాశం ఉంటుందని కేసీఆర్ సూచించారు. 

అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన.. అంతలోనే నిర్ణయం మారింది!
తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేస్తారని అనుకున్నదే జరిగింది. అయితే కొన్ని రోజుల కిందటి వరకు గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదాపై ఊహాగానాలు ప్రచారంలో ఉండగా.. పుకార్లకు చెక్  ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెట్టింది. షెడ్యూల్‌ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష జరుగుతుందని ఆదివారం (జులై 6) అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయడం తెలిసిందే. సీఎం ప్రకటన చేశాక ఇక మార్పు ఏముంటుందని కొందరు అభ్యర్థులు భావించగా.. అటు గురుకుల సహా ఇతర పోస్టులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు గ్రూప్ 2 ప్రిపరేషన్ కు సమయం చాలలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగైదు రోజులపాటు టీఎస్ పీఎస్సీ కార్యాలయం ముట్టడికి సైతం యత్నించారు. టీఎస్‌పీఎస్సీ సైతం ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించాలని భావిస్తున్న సమయంలో అభ్యర్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేయాలని నిర్ణయించారు. టీఎస్ పీఎస్సీ అధికారులతో మాట్లాడి ఎగ్జామ్ రీషెడ్యూల్ చేయాలని సీఎస్ శాంతికుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రతిపక్షాలతో పాటు అభ్యర్థులు సైతం గగ్గోలు పెట్టడంతో ప్రభుత్వం గ్రూప్ 2 ఎగ్జామ్ ను నవంబర్ కు రీషెడ్యూల్ చేసింది.

 

టాప్ హెడ్ లైన్స్

Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Congress MLA Viral Video: చేయి పట్టుకుని, నడుము టచ్ చేసి.. విద్యార్థినితో ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తనపై దుమారం!
చేయి పట్టుకుని, నడుము టచ్ చేసి.. విద్యార్థినితో ఎమ్మెల్యే అసభ్య ప్రవర్తనపై దుమారం!
DA For Telangana Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 2 డీఏలు విడుదలకు ఉత్వర్వులు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 2 డీఏలు విడుదలకు ఉత్వర్వులు
KCR Farmhouse: ఎర్రవల్లిలో 45 ఎకరాలు మాయం.. మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసు ఇస్తారా..?
ఎర్రవల్లిలో 45 ఎకరాలు మాయం.. మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసు ఇస్తారా..?

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Embed widget