Telangana IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ ల బదిలీ...హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్... ఏసీబీ డీజీగా అంజనీ కుమార్
తెలంగాణ ప్రభుత్వం 30 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ కు పోస్టింగ్ ఇచ్చింది. అంజనీకుమార్ కు ఏసీబీ డీజీగా బదిలీ చేసింది. పలు జిల్లాల ఎస్పీలు కూడా బదిలీ అయ్యారు.
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం 30 పోలీసు అధికారుల బదిలీ అయ్యారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా సీవీ ఆనంద్ కు పోస్టింగ్ ఇచ్చింది. ఏసీబీ డీజీగా ప్రస్తుత హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ బదిలీ అయ్యారు. ఏసీబీ డైరెక్టర్ గా శిఖా గోయల్, హైదరాబాద్ జాయింట్ సీపీ (క్రైమ్స్) ఏఅర్ శ్రీనివాస్ బదిలీ అయ్యారు.
Merry Christmas. Let us kindle the light of love and compassion everywhere. None is permanent but the sweet memories remain for ever. Lots of love to each one of you. pic.twitter.com/t8HAxThiSh
— Anjani Kumar, IPS (@CPHydCity) December 24, 2021
హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీగా రంగనాథ్, నల్గొండ ఎస్పీగా రామ రాజేశ్వరి, సిద్దిపేట్ సీపీగా శ్వేత, హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీగా జోయల్ డేవిస్, మెదక్ ఎస్పీగా రోహిణి ప్రియదర్శిని బదిలీ అయ్యారు. సైబరాబాద్ డీసీపీ (క్రైమ్స్)గా కల్మేశ్వర్, సైబరాబాద్ జాయింట్ సీపీగా అవినాష్ మహంతి, హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీగా చందనా దీప్తి, హైదరాబాద్ సీసీఎస్ డీసీపీగా గజరావు భూపాల్, హైదరాబాద్ ఎస్బీఐ జాయింట్ సీపీగా విశ్వప్రసాద్, నిజామాబాద్ సీపీగా నాగరాజు, వికారాబాద్ ఎస్పీగా కోటిరెడ్డి, ఆదిలాబాద్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి, మాదాపూర్ జోన్ డీసీపీగా శిల్పవల్లి, బాలానగర్ డీసీపీగా సందీప్ గొనె, శంషాబాద్ డీసీపీగా జగదీష్ రెడ్డి, హైదరాబాద్ కార్ హెడ్ క్వాటర్ జాయింట్ సీపీగా కార్తికేయ బదిలీ అయ్యారు.
Also Read: అడుక్కోవడానికి బిచ్చగాళ్లం కాదు.. వాళ్లు వెళ్తే పైరవీలు, మేం వెళ్తే ప్రయోజనాలు.. టీఆర్ఎస్ నేతలు ఫైర్
మహబూబాబాద్ ఎస్పీగా శరత్ చంద్ర పవార్, హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-1గా ప్రకాష్ రెడ్డి, ఆసిఫాబాద్ ఎస్పీగా సురేష్ కుమార్, నిర్మల్ ఎస్పీగా ప్రవీణ్ కుమార్, నాగర్ కర్నూల్ ఎస్పీగా మనోహర్, కామారెడ్డి ఎస్పీగా శ్రీనివాస్ రెడ్డి, జనగాం డీసీపీగా సీతారామ్, జయశంకర్ భూపాలపల్లి ఎస్పీగా సురేందర్ రెడ్డి, నారాయణ్‌పేట్ ఎస్పీగా ఎన్ వెంకటేశ్వర్లును నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి