అన్వేషించండి

Telangana Krmb Letter: కృష్ణా బోర్డుకు తెలంగాణ మరో లేఖ... పిన్నపురం జలవిద్యుత్ ప్రాజెక్టు ఆపాలని వినతి

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. ఏపీ నిర్మిస్తున్న పిన్నపురం జలవిద్యుత్ ప్రాజెక్టును ఆపాలని కోరింది.

కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న పిన్నపురం జలవిద్యుత్ ప్రాజెక్టు వెంటనే ఆపాలని విజ్ఞప్తి చేస్తూ కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. కొత్త, ప్రస్తుత ప్రాజెక్టుల విస్తరణ ఆపాలని లేఖలో కోరారు. బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ఏ ప్రాజెక్టులు చేపట్టవద్దని తెలంగాణ విజ్ఞప్తి చేసింది. లేఖలోని అంశాలను కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. 

పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా ఆపాలి

కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు ఇప్పటికే తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ పలుమార్లు లేఖలు రాశారు. ​ఏపీ ప్రభుత్వం శ్రీశైలం నుంచి నీరు తరలించకుండా నిలువరించాలని కోరారు. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా నీటి తరలింపును కూడా ఆపాలన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఇప్పటికే 76.39 టీఎంసీలు తరలించారని, హంద్రీనీవా ద్వారా ఏపీ 9.28 టీఎంసీలు నీరు తరలించారని ఈఎన్‌సీ లేఖలో ప్రస్తావించారు. 1976 ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ 34 టీఎంసీలలోపే నీరు తీసుకోవాలని కోరారు. కృష్ణా బేసిన్​కు మళ్లిస్తున్న గోదావరి జలాలను లెక్కించేందుకు టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని కోరారు.

Also Read: హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలుపు నాదే... టీఆర్ఎస్ ఓటర్లను బెదిరిస్తోంది... బీజేపీ నేత ఈటల రాజేందర్ కామెంట్స్

ఏపీవి నిరాధార వాదనలు 

ఆ జలాలను రెండు రాష్ట్రాలకు పంచాలన్న ఆంధ్రప్రదేశ్ నిరాధార వాదనను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ స్పష్టం చేసింది. కృష్ణా బేసిన్​కు తెలంగాణ మళ్లిస్తున్న గోదావరి జలాలను లెక్కించేందుకు టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని, ఆ జలాలను రెండు రాష్ట్రాలకు పరిగణలోకి తీసుకోవాలని గతంలో ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి లేఖ రాసింది. దీనిపై వివరణ ఇస్తూ తెలంగాణ ఈఎన్‌సీ కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ వాదన నిరాధారమైనదని లేఖలో తెలిపారు. సహేతుకం కాని డిమాండ్​ను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 

Also Read: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉపసంఘాల సమావేశం... నేడు హైదరాబాద్ లో భేటీ... గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చ

గతంలోనూ లేఖ

కృష్ణా నీళ్లు ఇవ్వని ప్రాంతాలకే తాము గోదావరి నీళ్లు ఇస్తున్నామని గతంలో రాసిన లేఖలో తెలంగాణ ఈఎన్‌సీ కృష్ణా బోర్డుకు తెలిపారు. కృష్ణా నీళ్లు ఇవ్వని ప్రాంతాలకే గోదావరి నీళ్లు ఇస్తున్నామని వివరించారు. గోదావరి జలాల మళ్లింపుతో కృష్ణాలో నీరు మిగులుతోందని ఈఎన్‌సీ మురళీధర్‌ గుర్తుచేశారు. తెలంగాణ మళ్లిస్తున్న నీటిలో గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు భిన్నంగా ఏపీ వాటా కోరుతోందని అభ్యంతరం వ్యక్తంచేశారు. 1978లో కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం నాగార్జున సాగర్‌ పైన జలాలను వాడుకునే హక్కు తెలంగాణకు ఉందన్నారు. గతంలో ఏపీ ప్రభుత్వం రాసిన లేఖను పట్టించుకోవద్దని లేఖలో కోరారు. తెలంగాణలో గోదావరి నీటిని కృష్ణాబేసిన్‌కు తరలించే చోట టెలీమెట్రీలు ఏర్పాటు చేయడంతో పాటు గోదావరి నుంచి తరలించే జలాలను రెండు రాష్ట్రాలకు పంచాలని కేఆర్‌ఎంబీని కోరారు. 

Also Read: కృష్ణా, గోదావరి బోర్డుల ఉపసంఘాల భేటీ... ప్రాజెక్టుల వివరాలు ఇచ్చేందుకు రెండు రాష్ట్రాలు అంగీకారం

ఐదు రోజుల క్రితం ఏపీ లేఖ 

ఏపీ ప్రభుత్వం మరోసారి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు తెలంగాణపై ఫిర్యాదు చేసింది. అనుమతి లేకుండా శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఆరోపిస్తూ ఐదు రోజుల క్రితం లేఖ రాసింది. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా నీరు వృధా అవుతుందని ఏపీ ప్రభుత్వం ఆ లేఖలో ఆరోపించింది. ఇప్పటి వరకూ విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు తెలంగాణ ప్రభుత్వం 113 టీఎంసీల నీటిని వదిలారని.. ఇది మొత్తం వృధాగా సముద్రంలోకి పోయిందన్నారు. వీటిని తెలంగాణ కోటాలో చేర్చాలని ఏపీ ప్రభుత్వం లేఖలో కృష్ణా బోర్డును కోరింది.

Also Read: తెలంగాణ గీత దాటింది ..జరిమానా విధించండి.. కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget