అన్వేషించండి

Paddy Cultivation: తెలంగాణ రైతులకు అలెర్ట్... యాసంగిలో వరి వద్దు ప్రభుత్వం కొనదు... మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం

యాసంగిలో వరి సాగు చేయవద్దని, కొనుగోలు చేయమని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వానాకాలం వరిపంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు యాసంగిలో ఇతర పంటలు సాగుచేయాలన్నారు

తెలంగాణలో యాసంగిలో వరి సాగు చేయవద్దని, ప్రభుత్వం కొనుగోలు చేయదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. యాసంగిలో సాగు చేసే పంటల కొనుగోలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన స్పష్టం చేశారు. రైతుల పట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న నిబద్ధత మరెవరికీ లేదన్నారు. హైదరాబాద్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. యాసంగిలో వరిని ప్రభుత్వం కొనుగోలు చేయదని, వానాకాలం వరిపంటను మాత్రమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. యాసంగిలో తేమ కారణంగా బియ్యం కొనుగోలు చేయమని కేంద్రం చెప్పిందని అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదన్నారు. భవిష్యత్‌లో బాయిల్డ్‌ రైస్‌ కొనమని కేంద్రం స్పష్టంగా చెప్పిందన్నారు. 

వానాకాలం వరి కొనుగోలు

యాసంగిలో రైతులు వరి సాగు చేయకుండా ఇతర పంటలు వేసుకోవాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు.  విత్తన కంపెనీలతో ఒప్పందాలున్న రైతులు, మిల్లర్లతో అవగాహన ఉన్న రైతులు వరి వేసుకోవచ్చని సూచించారు. వానాకాలంలో సాగుచేసే వరిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. సాగు రంగాన్ని సీఎం కేసీఆర్‌ ప్రగతి బాటలో తీసుకెళ్తున్నారన్నారు. ఎరువుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నిరంజన్‌రెడ్డి వివరించారు.

Also Read: ఏపీలో విద్యుత్ ఒప్పందాల రాజకీయాలు ! టీడీపీ ఆరోపణలేంటి ? ప్రభుత్వ స్పందన ఏమిటి ?

" ‘‘తెలంగాణ నుంచి యాసంగి వరి వడ్లను, బాయిల్డ్ రైస్‌ను భవిష్యత్‌లో ఎఫ్‌సీఐ కొనుగోలు చేయదని కేంద్రం స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు ప్రకటిస్తున్నాం. యాసంగిలో వరి వేయవద్దు. దానికి బదులు ఇతర పంటలు సాగుచేయండి’’ "
-నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి

Also Read: నాడు ఏం చెప్పారు ? నేడు ఏం చేస్తున్నారు ? పెట్రో ధరలను తగ్గించకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం !

రాష్ట్రానికి ఎక్స్ పోర్ట్స్ అనుమతులు లేవు

విత్తన కంపెనీలతో ఒప్పందం చేసుకున్న రైతులు, రైస్ మిల్లర్లతో ఒప్పందం కుదుర్చుకున్న రైతులు వరి సాగుచేసుకోవచ్చని మంత్రి తెలిపారు. అయితే వీటిని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అనుకోవద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎగుమతుల అనుమతులు ఉండవని పేర్కొన్నారు. రైతుల వద్ద వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదని గుర్తుచేశారు. కేంద్రంలో ఉన్నవారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు వీటిని అర్ధం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని నిరంజన్‌ రెడ్డి తెలిపారు.

Also Read:  పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించకపోతే ప్రజలకే కాదు ప్రభుత్వానికీ నష్టమే..! ఎలాగో తెలుసా ?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

టాప్ హెడ్ లైన్స్

Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget