అన్వేషించండి

TS Schools Reopen: తెలంగాణలో నేటి నుంచే ప్రత్యక్ష తరగతులు.. సర్కారు ఉత్తర్వులు

తెలంగాణలో నేటి నుంచి (సెప్టెంబర్ 1) పాఠశాలలను పున:ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

తెలంగాణలో నేటి నుంచి (సెప్టెంబర్ 1) పాఠశాలలను పున:ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. హైకోర్టులో తదుపరి విచారణ వరకు గురుకులాలను మూసివేయాలని తెలిపింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా మిగతా అన్ని పాఠశాలల్లోనూ ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్ విధానంలో క్లాసులు కొనసాగించాలని ఆదేశించింది. సర్కారు తాజా నిర్ణయంతో గురుకులాలు మినహా మిగతా అన్ని పాఠశాలల్లో రేపటి నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. 
ప్రత్యక్ష బోధనపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు..
విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధనపై తెలంగాణ హైకోర్టు ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలలకు కచ్చితంగా హాజరు కావాలని విద్యార్థులను బలవంతం చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని సూచించింది. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పేర్కొంది. గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధన ప్రారంభించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది.   

విద్యా సంస్థలదే తుది నిర్ణయం.. 
రాష్ట్రంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను నిలిపివేయాలని కోరుతూ.. హైదరాబాద్‌కు చెందిన ఎం.బాలకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోవిడ్‌ సమయంలో పాఠశాలలను ప్రారంభించి పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రత్యక్ష బోధనపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ విధానంలో క్లాసుల నిర్వహణ అధికారాన్ని విద్యా సంస్థలకే పూర్తిగా ఇవ్వాలని స్పష్టం చేసింది. విద్యా సంస్థలదే తుది నిర్ణయమని పేర్కొంది. ప్రత్యక్ష బోధన నిర్వహించాలనుకునే పాఠశాలలకు వారం లోపు మార్గదర్శకాలు జారీ చేయాలని విద్యా శాఖను ఆదేశించింది. స్కూళ్లలో పాటించే కోవిడ్ మార్గదర్శకాలపై ప్రచారం చేయాలని విద్యా శాఖకు సూచించింది. 

కోవిడ్ మూడో దశ నేపథ్యంలో.. 
తెలంగాణలో కోవిడ్ తీవ్రత ఇంకా కొనసాగుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సెప్టెంబరు లేదా అక్టోబరులో మూడో దశ పొంచి ఉందన్న హెచ్చరికలు వస్తున్నాయని ప్రస్తావించింది. బడులు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయని పేర్కొంది. ఈ రెండు అంశాలను సమన్వయం చేసి చూడాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.  

Also Read: Telangana Rains: మానేరు వాగులో కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు... 29 మంది ప్రయాణికులను రక్షించిన స్థానికులు... తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షాలు

Also Read: IAS Officers Transfer: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం... 14 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ... పదోన్నతుల కనీస సర్వీసు తగ్గింపు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget