Telangana cotton farmers Problems: తేమ పేరుతో పత్తి కొనని సీసీఐ - దృష్టి పెట్టని తెలంగాణ ప్రభుత్వం - ఆదుకునేది ఎవరు?
Cotton farmers: పత్తిరైతుల సమస్యలపై ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టడం లేదు. కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Telangana Cotton MSP: తెలంగాణలో పత్తి రైతుల సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పత్తి కొనుగోలు చేయాల్సిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేక రూల్స్ పెడుతూ రైతుల్ని ఇబ్బంది పెడుతోంది. ప్రభుత్వం కూడా ఏమీ చేయలేకపోతోంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) కొత్త నిబంధనలు తెచ్చింది. తేమ శాతం 8%కు మించకూడదని అంటోంది. దీని వల్ల ప్రైవేట్ ట్రేడర్లు కొనుగోళ్లు సస్పెండ్ చేశారు. రైతులు తమ పంటను తక్కువ ధరలకు అమ్మేస్తున్నారు. క్వింటాల్‌కు రూ. 6,400 కూడా రావడం లేదు. ఇది MSP రూ. 7,521 కంటే చాలా తక్కువ. అందుకే రైతులు ధర్నాలు ప్రారంభించారు.
విజ్ఞప్తులకే పరిమితమైన తెలంగాణ ప్రభుత్వం
కాటన్ కార్పొరేషన్ ఆప్ ఇండియాతో ప్రభుత్వ చర్చలు జరుపుతోంది. అయితే విజ్ఞప్తులకే పరిమితం అవుతోంది. నిబంధనలు సడలించాలని కోరింది. కానీ కొనుగోలు విషయంలో కొత్త కొత్త నిబంధనలు పెడుతున్నారు. తేమ శాతం విషయంలోనే పెద్ద సమస్య ఉంటే.. త నిబంధనలతో ఆందోళన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎకరానికి అనుమతించే పత్తి దిగుబడిని 12 క్వింటాళ్ల నుంచి 7 క్వింటాళ్లకు తగ్గించడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నిర్ణయం రైతుల పాలిట అశనిపాతంలా మారింది, ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులపై తీవ్ర ప్రభావం చూపనుంది. రైతులు ఇప్పటికే వర్షాభావం, భారీ వర్షాల వల్ల నష్టాలు చవిచూశారు. కొనుగోలు కేంద్రాలు అక్టోబర్ 22 నుంచి మాత్రమే ప్రారంభమయ్యాయి, మొత్తం 188 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వర్షాల భయంతో చాలామంది రైతులు తక్కువ ధరకు వ్యాపారులకు అమ్మేశారు. రాష్ట్రంలో 24.12 లక్షల మంది పత్తి రైతులు ఉన్నారు, ఇందులో 70 శాతం చిన్న, సన్నకారు రైతులే
ఎకరానికి ఏడు టన్నులే దిగుబడి వస్తుందని లెక్క
ఈ సీజన్‌లో తెలంగాణ వ్యాప్తంగా 45.32 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. సగటున ఎకరానికి 11.74 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ నివేదిక తెలిపింది. మొదట్లో సీసీఐ 12 క్వింటాళ్ల చొప్పున కొనుగోళ్లు చేపట్టింది. కానీ హఠాత్తుగా 7 క్వింటాళ్లకు తగ్గించింది. తెలంగాణలో ఈ సీజన్‌లో ఎకరానికి 7 టన్నుల దిగుబడి మాత్రమే వస్తుందని అందుకే అంతే కొంటామని చెబుతున్నారు. కొత్త పరిమితి వల్ల మిగిలిన పత్తిని వ్యాపారులకు తక్కువ ధరకు అమ్మాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం చిన్న రైతులను మరింత కుంగదీస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రైతులు ప్రభుత్వం నుంచి మరిన్ని మద్దతు చర్యలు, సరైన పరిహారాలు కోరుతున్నారు.
ప్రభుత్వ సాయం కోసం చూస్తున్న రైతులు
తెలంగాణ పత్తి రైతులు, ముఖ్యంగా తెలంగాణ రైతు సంఘం, ఇతర సంఘాలు ప్రభుత్వ సాయం కోసం చూస్తున్నాయి. CCI ఏడు క్వింటాల్‌కు పరిమితి , 8% కంటే తక్కువ తడి స్థాయి, కిసాన్ యాప్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి వంటి నిబంధనలు సడలించాలని కోరుతున్నారు. రైతుల నుండి ఆంక్షలు లేకుండా పత్తి కొనుగోలు చేసి, MSP ధరలో చెల్లింపులు చేయాలని కోరుతున్నారు. తేమశాతం ఇరవై శాతం ఉన్నా కొనుగోలు చేయాలని కోరుతున్నారు. భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పత్తి పంటకు పరిహారం కోరుతున్నారు. తమ డిమాండ్లపై స్పందించాలని వారు కోరుతున్నారు.





















