అన్వేషించండి

Telangana Local Body Elections: బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, షెడ్యూల్ త్వరలో!

Local body Elections 2025 | స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ జీవో నెంబర్-9ని జారీ చేసింది. దేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రంగా నిలిచింది

Local body Elections 2025 In Telangana | తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం తన సన్నాహాలను వేగవంతం చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై జీవోను విడుదల చేయడం జరిగింది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది. రేపు (శనివారం) ఉదయం 11 గంటలకు కీలక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరుకానున్నారు. ఎన్నికల నిర్వహణ, పోలింగ్ బూత్‌ల ఏర్పాటు, ఓటర్ల జాబితా, ఎన్నికల భద్రత వంటి అంశాలపై చర్చ జరగనుంది.

హైకోర్టు ఆదేశాలతో కదిలిన అధికార గణం

తెలంగాణలోని పంచాయతీల్లో పాలక మండలి సభ్యుల గడువు 2024, జనవరి 31తో ముగిసింది. అప్పటి నుండి ప్రత్యేక అధికారుల పాలనలో పంచాయతీ కార్యక్రమాలు నడుస్తున్నాయి. అయితే దీనిపై సర్పంచ్‌లు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు జూన్ 25వ తేదీన మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని అటు ప్రభుత్వాన్ని, ఇటు ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంది. 42 శాతం రిజర్వేషన్లను ఈ పంచాయతీ ఎన్నికల్లో అమలు చేయాలని నిర్ణయించి, ఆ మేరకు జీవోను జారీ చేసింది. దీంతో ఎన్నికల సంఘానికి ఈ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అయింది.

బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచిన ప్రభుత్వం

బీసీ సంక్షేమ శాఖ గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ జీవో నెంబర్-9ని జారీ చేసింది. ఇలా దేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. గతంలో బీహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నించినా, అవి న్యాయస్థానాల ముందు నిలబడలేదు. అయితే వీటిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ సిఫారసుల ఆధారంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఖరారు చేయడం జరిగింది. దీని వల్ల సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్ వంటి పదవుల్లో బీసీలకు 42 శాతం పదవులు దక్కనున్నాయి.

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలపై షెడ్యూల్

బీసీ రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎన్నికల ప్రక్రియను అటు ప్రభుత్వం, ఇటు ఎన్నికల కమిషన్ వేగవంతం చేస్తోంది. అదే రీతిలో తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు సామాజిక న్యాయానికి అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభించాయి. గ్రామ స్థాయిల్లో బలమైన బీసీ అభ్యర్థుల వేటలో అన్ని పార్టీలు పడ్డాయి. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన రాజకీయ తప్పులు జరగకుండా జాగ్రత్త పడుతున్నాయి. సరి కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి.  అటు అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాలయిన బీజేపీ, బీఆర్ఎస్ లు  ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం రేపు నిర్వహించే అధికారుల సమావేశం తర్వాత ఒకటి, రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. ఈలోగా ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలతోనూ సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget