By: ABP Desam | Updated at : 23 Dec 2021 09:40 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ పనులను గెజిట్ నోటిఫికేషన్‌లో రెండుగా చూపడంపై తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాశారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు కూడా లేఖ ప్రతిని పంపించారు. శ్రీశైలం ఎస్ఎల్ బీసీ అంశం గురించి పేర్కొన్నారు. గెజిట్ నోటిఫికేషన్‌లో రెండు కాంపోనెంట్లుగా చూపారని తెలిపారు. 10 టీఎంసీల పనులను అదనంగా ఎలా చూస్తారని లేఖలో మురళీధర్ అన్నారు.
ఎస్ఎల్ బీసీకి సంబంధించిన విషయంపైనా.. బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పటి ప్రభుత్వం ఆయకట్టును మూడు నుంచి నాలుగు లక్షల ఎకరాలకు పెంచిందని మురళీదర్ గుర్తు చేశారు. నీటి కేటాయింపులు మాత్రం పెంచలేదనే విషయాన్ని ప్రస్తావించారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే.. రాష్ట్రం ఏర్పాడ్డాక ఆయకట్టుకు అనుగుణంగా.. నీటి కేటాయింపులను పెంచినట్టు చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం 30 నుంచి 40 టీఎంసీలకు పెంచిందని వివరించారు.
అయితే 10 టీఎంసీలకు సంబంధించిన పనులు అదనపు కాంపోనెంట్ కిందకు రాదన్నారు. 75 శాతం నీటి లభ్యత కింద ప్రాజెక్టుకు కేటాయింపుల అంశాన్ని సైతం.. కృష్ణా జలవివాదాల రెండో ట్రైబ్యునల్ ముందుకు తీసుకొచ్చినట్టు చెప్పారు. బేసిన్లోని అవసరాలకు ముందు ప్రాధాన్యం ఇవ్వాలని మొదటి ట్రైబ్యునల్ కూడా స్పష్టం చేసిందని మురళీధర్ పేర్కొన్నారు. ఇలాంటివి అన్నీ.. చూసి.. తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలని కేఆర్ఎంబీకి రాసిన లేఖలో కోరారు. గెజిట్ నోటిఫికేషన్ లోని ఒకటి, రెండు షెడ్యూళ్లలో ఉన్న ఎస్ఎల్ బీసీ రెండో కాంపోనెంట్ను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
ఇటీవలే కల్వకుర్తి ఆయకట్టుపై లేఖ
కల్వకుర్తి ఆయకట్టు విషయంలో కొత్తగా ఆయకట్టు పెంచలేదని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. ఆయకట్టు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను.. జతచేస్తూ.. కేఆర్ఎంబీకి ఈఎన్సీ మురళిధర్ లేఖ రాశారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని రెండు కాంపోనెంట్లుగా గెజిట్ నోటిఫికేషన్‌లో పొందుపరచడాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పుపట్టింది. 2 అంశాలను ఒకటిగా పొందుపరచాలని కోరుతూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాసిన లేఖలో ప్రస్తావించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కల్వకుర్తి ఆయకట్టును 2.5 లక్షల నుంచి 3.65 లక్షల ఎకరాలకు పెంచినా.. నీటి కేటాయింపులు పెంచలేదని కేఆర్ఎంబీకి తెలంగాణ చెప్పింది. అయితే కొత్త ఆయకట్టును పెంచలేదని.. పెరిగిన.. ఆయకట్టుకు సరిపడేలా మాత్రమే.. నీటి కేటాయింపులు చేసినట్టు చెప్పారు.
Hyderabad News : బీజేపీ కార్పొరేటర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి, హోటల్ నిర్వాహకుడికి నోటీసులు
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Kishan Reddy On TRS: తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి పెట్టుబడులు కేంద్రం ఘనతే- ప్రజలు గమనిస్తున్నారన్న కిషన రెడ్డి
Breaking News Live Updates: బండి సంజయ్ మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు, కేఏ పాల్ ఫైర్
Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!
Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్