అన్వేషించండి

Telangana Elections 2023 : కేసీఆర్ అవినీతిపై చర్యలు తీసుకోనందుకే పార్టీ మార్పు - బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే - విజయశాంతి కీలక వ్యాఖ్యలు

Vijayashanthi : కేసీఆర్ ను అరెస్టు చేస్తామని చెప్పి చేయలేదని అందుకే కాంగ్రెస్‌లో చేరానని విజయశాంతి ప్రకటించారు. బీజేపీ, బీఆర్ఎస్ మద్య రహస్య ఒప్పందం ఉందన్నారు.

Telangana Elections 2023 :   కేసీఆర్ అవినీతిపై అన్ని ఆధారాలు ఉన్నాయని ఆయనపై చర్యలు తీసుకుంటామని, అరెస్టు చేస్తామని చెప్పినందునే బీజేపీలో చేరానని కానీ ఇప్పుడు బీజేపీ , బీఆర్ఎస్ ఒక్కటేనని తేలిందన్నారు కాంగ్రెస్ నేత విజయశాంతి.  రెండు రోజుల కిందటి వరకూ బీజేపీలో ఉన్న ఆమె ఆమె..  రాజీనామా చేసి మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం గాంధీ భవన్  లో మీడియాతో మాట్లారు.  

కేసీఆర్ ను అరెస్టు చేస్తామని చెప్పి మాట తప్పిన  బీజేపీ 

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌  లో చేరానని పాత మిత్రులను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.  కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కారణం బీజేపీ పెద్ద తప్పు చేయడమేన్నారు.  ఉద్యమ నాయకురాలుగా , పార్లమెంట్ లో కొట్లాడిన తెలంగాణ నాయకురాలుగా ఉన్నానని..  రాష్ట్రమే  ముఖ్యమని 25 సంవత్సరాలు పనిచేశానని గుర్తు చేశారు.  కాంగ్రెస్ విడిచి బీజేపీ కి వెళ్ళడానికి కారణం.. కేసీఆర్ అవినీతిపరుడిని అరెస్టు చేసి చర్యలు తీసుకుంటామని ఉద్యమకారులకు బీజేపీ అధిష్టానం మాట ఇచ్చిందన్నారు.  కేసీఆర్ పై చర్యలు తోడుకుంటారన్న నమ్మకం తో బీజేపీ లో చేరామన్నారు.  నెలలు ,సంవత్సరాలు గడిచిన కేసీఆర్ పై చర్యలు తీసుకోలేదనన్నారు. 

అవినీతికి ఆధారాలన్నీ ఉన్నా ఎందుకు చర్యలు తీసుకోరు !  

మోడీ , అమిత్ షా , నడ్డా ని అడుగుతున్నానని ఆధారాలన్నీ ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోరని విజయశాంతి ప్రశ్నించారు.   తెలంగాణ కి ఎప్పుడు వచ్చినా  కేసీఆర్ అవినీతిపరుడు ,కుటుంబ పాలన అని విమర్శిస్తారన్నారు.  కేసీఆర్ అవినీతి పై ఆధారాలతో సహా వారి దగ్గర ఉన్నాయని.. ఏటీఎం  , కుటుంబ పాలన ,దొంగ అని వచ్చి చెప్తారని కానీ ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించార.ు  ప్రధాని మోదీకి పూర్తి మెజారిటీ ఉంది...  కేసీఆర్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.  అందుకే బీజేపీ ,బీఆరెస్ ఒకటేన్నారు.  తెర ముందు ఒకలా..తెర వెనుకాల ఒకలా మాట్లాడుతున్నారని విమర్శించారు.  ప్రజలు ,బీజేపీ కార్యకర్తలు , ఉద్యమకారులు పిచ్చోళ్ళు అయ్యారన్నారు. చివరి నిముషం వరకు యాక్షన్ తీసుకుంటారని చూశా కానీ.. ఏ చర్యలు తీసుకునే పరిస్థితి లేకపోవడంతో  పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరానన్నారు.  సంజయ్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఆయనను ఎందుకు తీసేస్తున్నారని చెప్పాను.. ఎన్నికలకు 4 నెలల ముందు అధ్యక్షుడు మారిస్తే బీజేపీ డిజస్టర్ అవుతుందని చెప్పా...  అయినా మార్చారన్నారు.  బీజేపీ లో ఒక నాయకుడిని మొక్క నాటినట్టు నాటారు.. ఆ నాయకుడే అధ్యక్షుడిని మార్చాలని పదే పదే  చెప్పారు. చివరికి మార్చారన్నారు.  బీజేపీ చేజేతులా వారి పార్టీ వారే నాశనం చేసుకున్నారని విజయశాంతి తేల్చి చెప్పారు.  బీఆర్ఎస్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు.  మెడిగడ్డ పిల్లర్లు కుంగిన ఎందుకు చర్యలు తీసుకోలేదు.. ఒప్పందం ప్రకారమే చేశారా అని ప్రశ్నించారు.  నన్ను తిట్టే హక్కు ..బీజేపీ , బీఆరెస్ లకి ఎక్కడిదన్నారు.  తాను డబ్బు కోసం , పదవుల కోసం  పార్టీలు మారే వ్యక్తిని కాదన్నారు. ఇప్పటి బీజేపీలో ఎలాంటి విలువలు లేవన్నారు.   

విజయశాంతికి కాంగ్రెస్‌లో కీలక పదవి 

బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతికి పార్టీలో కీలక పదవి దక్కింది. ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీలలోకి రాములమ్మని పార్టీ తీసుకుంది. ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌, ప్లానింగ్ కమిటీ కన్వీనర్‌గా బాధ్యతలు అప్పగించింది. మహేశ్వరం టికెట్ ఆశించిన పారిజాతకు కూడా కన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. మొత్తం 15 మంది కన్వీనర్లను ప్రకటించారు. తెలంగాణలో బీఆర్ఎస్‌‌కి కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను ఫాంహౌస్‌కే పరిమితం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌లో చేరినట్లు ఆమె పేర్కొన్నారు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
అయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తత
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Fact Check: రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి కేటీఆర్ 10 కోట్లు...! ఫార్ములా-ఈ కేసు దర్యాప్తులో ఈ విషయం తేలిందా...?
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget