Congress Party List: తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రెడీ! రేపే విడుదల, జాబితాపై సర్వత్రా ఉత్కంఠ
Telangana Congress Party: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ఆదివారం ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పార్టీలోని ముఖ్య నేతల పేర్లు దాదాపుగా మొదటి జాబితాలోనే వచ్చే అవకాశం ఉంది.
Telangana Congress Party: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సారి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తుంది. అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే స్క్రీనింగ్ మూడు సార్లు భేటీ అయ్యి క్యాండిడేట్ల పేర్ల జాబితాను కొలిక్కి తెచ్చింది. పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఏఐసీసీ ఆమోదం తర్వాత అభ్యర్థుల ప్రకటన చేయనుంది. తొలి జాబితాలను దాదాపు 70 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది. ఈ జాబితాకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీఈసీ ఆమోదం కూడా తెలిపిందని.. అయితే మంచి రోజులు ప్రారంభం అవుతున్నందున ఆదివారం (అక్టోబర్ 15న) జాబితా ప్రకటన చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. పార్టీలోని ముఖ్య నేతల పేర్లు దాదాపుగా మొదటి జాబితాలోనే వచ్చే అవకాశం ఉంది.
కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో భాగంగా శుక్రవారం జీఆర్జీ రోడ్ నెంబర్15లోని ‘వార్ రూమ్’లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ నాలుగో సారి భేటీ అయింది. మధ్యాహ్నం12 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 నిమిషాల వరకు ఈ భేటి సాగింది. ఈ భేటీలో ప్రధానంగా119 స్థానాల్లో అభ్యర్థల ఎంపికపై చర్చ జరిగినట్లు తెలిసింది. సీనియర్ నేతలు బరిలో ఉన్న స్థానాలు, ఒక అసెంబ్లీకి ఒకరు లేదా ఇద్దరు పోటీ పడుతున్న స్థానాలు, ఎలాంటి వివాదాలు లేని దాదాపు 40 నుంచి 60 స్థానాలపై మొదటి రెండు మీటింగ్ లో కమిటీ క్లారిటీకి వచ్చింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలపై స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను ఆదివారం విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. 70 మంది పేర్లతో ఫస్ట్ లిస్ట్ విడుదల చేస్తామని ప్రకటించారు. అక్టోబర్ 18న పార్టీ బస్సుయాత్ర ప్రారంభమయ్యేలోపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. సీపీఐ, సీపీఎంలతో పొత్తు చర్చలు కొనసాగుతున్నాయని.. త్వరలోనే స్పష్టత వస్తుందని భావిస్తున్నామని మురళీధరన్ స్పష్టం చేశారు. స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేస్తామమని తెలిపారు.
దీని తరువాత తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై శుక్రవారం తొలిసారి కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్(సీఈసీ) భేటీ అయింది. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో తెలంగాణతో పాటు మధ్య ప్రదేశ్ అభ్యర్థుల ఎంపికపై సీఈసీ డిస్కస్ చేసింది. ఉదయ్ పూర్ డిక్లరేషన్, సామాజిక వర్గాల విజ్ఞప్తులు, ఓయూ విద్యార్థుల డిమాండ్ల నేపథ్యంలో.. పలు అసెంబ్లీ నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఎంపిక, స్థానిక అంశాలపై ఖర్గే, రాహుల్ గాంధీ ఆరా తీసినట్లు తెలిసింది. వామపక్షాలతో పొత్తు, బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి ముగ్గురు ప్రముఖులు వచ్చే అవకాశం ఉందని, వారి కోసం ఆరు సీట్లు పక్కకు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మిగిలిన
రేపు అభ్యర్థుల జాబితా విడుదల కానుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లిస్ట్‌లో ఎవరి పేర్లు ఉంటాయి.. అధిష్టానం ఎవరికి షాక్ ఇవ్వనుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జాబితా విడుదల కానుండటంతో కాంగ్రెస్ టికెట్ ఆశావహుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. సర్వేల నివేదికలు, ఆర్థిక బలగాలు, పార్టీకి విధేయత, పార్టీ లో పనిచేసిన కాలం అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను కాంగ్రెస్ సీఈసీ ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.