By: ABP Desam | Updated at : 01 Jan 2023 09:05 AM (IST)
Edited By: jyothi
సీఎం కేసీఆర్, సీఎం జగన్
New Year Wishes: గతాన్ని సమీక్షించుకుంటూ, వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ, భవిష్యత్తును అన్వయించుకుంటూ మన జీవితాలను మరింత గుణాత్మకంగా తీర్చిదిద్దుకోవడం ద్వారానే నూతనత్వం సంతరిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. రాష్ట్ర, దేశ ప్రజలందరికీ నూతన సంవత్సరం (2023) సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నిర్దిష్ట లక్ష్యాలను రూపొందించుకుని యువత తమ ఆశయ సాధనకై ముందుకు సాగాలన్నారు. జీవితం పట్ల సరైన దృక్పథం, సంకల్ప బలం ఉంటేనే లక్ష్య సాధనలో సఫలీకృతం అవుతారని సీఎం పునరుద్ఘాటించారు. ఎన్నో అవాంతరాలు, సమస్యలు, వివక్షను ఎదుర్కుంటూ నేడు భారత దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానం అందరికీ ఆదర్శమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
నూతన సంవత్సరం 2023 ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర, దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని సీఎం సూచించారు.#HappyNewYear pic.twitter.com/IWcGeZQdR1
— Telangana CMO (@TelanganaCMO) January 1, 2023
అనతి కాలంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి రోల్ మోడల్ గా మారిందని తెలిపారు. 2023 నూతన సంవత్సరం తెలంగాణతో పాటు దేశ ప్రజల జీవితాల్లో అన్ని రంగాల్లో గుణాత్మక ప్రగతికి బాటలు వేయాలని, దేశంలో సరికొత్త ప్రజా రాజకీయాలకు, పాలనకు నాందిగా నూతన సంవత్సరం నిలవాలని సీఎం ఆకాంక్షించారు. 2023 సంవత్సరంలో సరికొత్త ఆశలు, లక్ష్యాలతో ప్రజలు మరింత సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ దేవుడిని కోరుకున్నారు. నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.
I wish everyone a happy and prosperous #NewYear.
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 31, 2022
I am thankful to everyone for the love, support and trust that you have shown in me.
I will continue working for the welfare and development of our #AndhraPradesh.
Special wishes to my @YSRCParty family.
మరోవైపు ఏపీ సీఎం జగన్ కూడా తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా తనపై చూపిన ప్రేమ, మద్దతు మరియు నమ్మకానికి ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు అని వివరించారు. ఏపీ సంక్షేమం, అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రపంచవ్యాప్త తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సర వేళ సత్సంకల్పంతో ముందుకు వెళ్దాం. అభివృద్ధి, ఆనందం, ఆరోగ్యంతో కూడిన మార్పును అందుకుందాం. మీ ఇంటిల్లిపాదికీ 2023వ సంవత్సరం ఆనందమయం కావాలని, మీ ఆశయాలను నెరవేర్చాలని మనసారా కోరుకుంటున్నాను#NewYear2023
— N Chandrababu Naidu (@ncbn) December 31, 2022
అలాగే ప్రపంచ వ్యాప్త తెలుగు వారందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సర వేళ సత్సంకల్పంతో ముందుకు వెళ్దామని అన్నారు. అభివృద్ధి, ఆనందం, ఆరోగ్యంతో కూడిన మార్పును అందుకుందామని చెప్పారు. మీ ఇంటిల్లిపాదికీ 2023వ సంవత్సరం ఆనందమయం కావాలని, మీ ఆశయాలను నెరవేర్చాలని మనసారా కోరుకుంటున్నట్లు వివరించారు.
Khammam News: హైదరాబాద్ - విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లతో దాడి, కోచ్ అద్దాలు ధ్వంసం!
Jagityal: కన్నకూతుర్లని బావిలోకి తోసేసిన తండ్రి, ఆ వెంటనే తర్వాత మరో ఘోరం!
CM KCR Nanded Tour: నేడే నాందేడ్‌లో BRS సభ, సీఎం కేసీఆర్ టూర్ పూర్తి షెడ్యూల్ ఇదీ
Weather Latest Update: నేడు ఈ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్! చాలా జిల్లాల్లో వణికించనున్న చలి
BRS Vs MIM : అసెంబ్లీ వాగ్వాదం తెలంగాణ రాజకీయాల్ని మార్చిందా ? ఎంఐఎంతో వైరం బీఆర్‌ఎస్‌కు నష్టమేనా ?
Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్
Cake Recipe: ఇడ్లీ పిండి మిగిలిపోయిందా? ఇలా టేస్టీ కేక్ తయారు చేసేయండి
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్ - 'ఖుషి' ఖుషీగా...
Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!