Harish Rao fire On Central Govt: రూ.24 వేల కోట్లు సిఫార్సు చేస్తే, 24 పైసలు కూడా ఇవ్వలే - కేంద్రంపై హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు
Harish Rao Budget Speech: మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినా 24 పైసలు కూడా ఇవ్వలేదని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
Minister Harish Rao fire On Central Governmnet: రూ.24 వేల కోట్లు సిఫార్సు చేస్తే 24 పైసలు కూడా ఇవ్వలే - కేంద్ర ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు
తెలంగాణ అసెంబ్లీలో 2022-23 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. పార్లమెంటులో తెలంగాణ గురించి చర్చకు వచ్చిన ప్రతిసారి తల్లిని చంపి బిడ్డను బతికించారని అంటున్నారు. వాస్తవానికి ఏ విషయంలోనూ తెలంగాణకు కేంద్రం సహకారం ఇవ్వడం లేదన్నారు. తెలంగాణకు రావాల్సిన ఐటీఆర్ భారీ ప్రాజెక్టును తప్పించి కేంద్రం భారీ తప్పు చేసిందన్నారు.
కేంద్ర సర్కారుకు ఎన్ని ప్రతిపాదనలు పంపినా, విన్నవించుకున్నా సహకారం కొరవడిందంటూ హరీష్ రావు మండిపడ్డారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినా 24 పైసలు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ఏ హామీలూ నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలకు అన్యాయ చేసింది అంటూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కేంద్రం తమకు సహకరించనుకున్నా పరిపాలనలో రాజీలేని వైఖరిని టీఆర్ఎస్ అవలంభించింది. కరెంట్ కోతలు, ఆకలి చావులు ఇప్పుడు లేవు అని స్పష్టం చేశారు.
ఇప్పుడు తెలంగాణ టార్చ్ బేరర్: హరీశ్ రావు
బడ్జెట్ ప్రసంగంలో భాగంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘‘ప్రజలు కేసీఆర్ నాయకత్వం పట్ల మక్కువ చూపుతున్నారు. గతంలో తెలంగాణ ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. అవమాన చరిత్ర నుంచి ఆత్మగౌరవం దిశగా దూసుకుపోతుంది. ఇప్పుడు తెలంగాణ టార్చ్ బేరర్. ఇప్పుడు తెలంగాణ వ్యవహరిస్తున్నది.. రేపు భారత్ అనుసరిస్తున్నది.’’ అని అన్నారు.
తెలంగాణ వార్షిక బడ్జెట్ 2022-23ను శాసనసభలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టారు. రూ. 2,56,958.51 కోట్లతో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై ప్రసంగించారు . రెవెన్యూ వ్యయం రూ. 1.89 లక్షల కోట్లు కాగా, క్యాపిటల్ వ్యయం రూ. 29,728 కోట్లు. రాష్ట్రం ఆవిర్భవించిన అనతికాలంలో అద్భుత ప్రగతి సాధించామని హరీశ్‌రావు తెలిపారు. సీఎం ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ ప్రగతి పథంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు.
Also Read: BJP MLAs Suspend: బీజేపీకి భారీ షాక్ ! ఈటల, రాజా సింగ్, రఘునందన్ రావులు సెషన్ మొత్తం సస్పెండ్
Also Read: Telangana Budget 2022-23 LIVE: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు స్పీచ్ హైలైట్స్