Breaking News Live Updates: తెలంగాణలో కొత్తగా 208 కోవిడ్ కేసులు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ పేజీ అప్ డేట్ అవుతోంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ పేజీ అప్ డేట్ అవుతోంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
తెలంగాణలో కొత్తగా 208 కోవిడ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 45,274 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. కొత్తగా 208 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,95,780కి చేరాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం కోవిడ్ బులిటెన్ విడుదల చేసింది. ఆదివారం కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,906కి చేరింది. కరోనా బారి నుంచి 220 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,991 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మాజీ సీఎం చంద్రబాబుపై దాడికి యత్నం.. కేంద్ర హోంశాఖకు ఎంపీ కనకమేడల ఫిర్యాదు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై దాడికి ప్రయత్నించారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ హోంశాఖకు ఫిర్యాదు చేశారు. జడ్ ప్లస్ క్యాటగిరీ ఉన్న నేతపై దాడికి ప్రయత్నించిన ఘటనలో శాంతి భద్రతల వైఫల్యం కనిపించిందని హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు కనకమేడల లేఖ రాశారు. ఎమ్మెల్యే జోగి రమేష్, ఆయన అనుచరులు మాజీ సీఎం చంద్రబాబు నివాసంపై దాడి చేశారని లేఖలో పేర్కొన్నారు. ఏపీలో పోలీసులు ఏకపక్షంగా వ్యవరిస్తున్నారని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మాజీ సీఎం నివాసంపై దాడి జరిగితే, దాడికి పాల్పడ్డ వారిని వదిలేసి.. టీడీపీ నేతలపైనే కేసులు బనాయించారని లేఖ ద్వారా తెలిపారు.





















