Breaking News Live: ఈటల రాజేందర్ పై కేసు నమోదు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 11న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 11న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
ఈటల రాజేందర్ పై కేసు నమోదు
హుజురాబాద్ లో రాజకీయాలు వేడెక్కుతున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లఘించి సభ నిర్వహించారని ఫ్లైయింగ్ స్వ్కాడ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్
తిరుమల శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ పంచకట్టుతో శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. గరుడ వాహన సేవలో పాల్గొనున్నారు.
కాసేపట్లో శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాల సమర్పణ
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్దకు చేరుకున్నా సీఎం జగన్ కు టీటీడీ అధికారులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం చేశారు. మరి కాసేపట్లో శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
హెటిరో సంస్థలపై ఐటీ సోదాలు
హెటిరో సంస్థల్లో ఐటీ సోదాలు జరిగాయి. హైదరాబాద్ లో 30 ప్లాట్లల్లో అట్టపెట్టెల్లో డబ్బు దాచారని ఐటీ అధికారులు తెలిపారు. ఆరు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు దాడులు చేసినట్లు ఆదాయపు పన్ను అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో లెక్కల్లో లేని భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
3 రోజుల పోలీస్ రిమాండ్‌కు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాను
లఖింపుర్ ఖేరి కేసులో నిందితుడుగా ఉన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాను మూడు రోజుల పోలీస్ రిమాండ్‌కు తరలించారు. కొన్ని షరతులతో రిమాండ్‌కు ఇచ్చారని అడ్వకేట్ ఎస్పీ యాదవ్ తెలిపారు.