Telangana ACB : చిన్నా పెద్దా తేడా లేదు లంచం అంటే పట్టేస్తున్నారు - తెలంగాణ ఏసీబీ దూకుడు !
Telangana News : తెలంగాణ ఏసీబీ అధికారులు దూకుడు మీద ఉన్నారు. అవినీతి ఫిర్యాదులొస్తే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు.
ACB Cases In Telangana : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏసీబీ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. లంచం తీసుకుంటున్నారు అనే ఫిర్యాదు వస్తే స్థాయితో సంబందం లేకుండా అందర్నీ పట్టుకుంటున్నారు. పై స్థాయి అధికారులు లంచాలతో వందల కోట్లు వెనకేసినా పట్టుకుంటున్నారు. ప్రజలకు సేవలు చేయాల్సిన అధికారులు అందు కోసం లంచాలను తీసుకుంటున్నా వదిలి పెట్టడం లేదు. ఎంత మొత్తం అవినీతి అని కాదు.. లంచం అనే మాట వినిపిస్తే దూకుడుగా వెళ్లి అవినీతి పరుల్ని పట్టుకుంటున్నారు.
M.Sai Bharghav, Tax Inspector of Circle 4, GHMC LBNagar was caught by #ACBOfficials for accepting the bribe amount of Rs.10,000/- to allot house number and also for assessment of property tax for Newly Constructed House.
— ACB Telangana (@TelanganaACB) May 26, 2024
నూతనంగా నిర్మించిన గృహానికి సంబంధించి ఆస్తి పన్నును… pic.twitter.com/ZXeBshPn0P
ఇంటి పన్ను అసెస్‌మెంట్ చేసి, ఇంటి నెంబర్ కేటాయించడానికి పదివేలు లంచం తీసుకుంటున్న ఎల్‌బీ నగర్ టాక్స్ ఇనస్‌పెక్టర్ ను సోమవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అంతకు ముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పాస్ బుక్ ఇవ్వడానికి రైతు దగ్గర డబ్బులు వసూలు చేసిన తహశీల్దార్ ని, నిర్మల్ లో బిల్ కలెక్టర్ ని.. ఎవరైనా సరే .. ఎంత పెద్ద మొత్తం అన్నది ఆలోచించకుండా పట్టేసుకుంటున్నారు.
ఒక వ్యక్తి యొక్క భవన నిర్మాణానికి సంబంధించి అధికమొత్తంలో పన్ను చెల్లించకుండా ఉండటం కోసం 30 వేల రూపాయలు లంచం తీసుకుంటున్న నిర్మల్ జిల్లా, భైంసా పట్టణ మున్సిపల్ కమిషనర్ - వెంకటేశ్వరరావు మరియు అదే కార్యాలయంలో పనిచేసే బిల్ కలెక్టర్ - విద్యాసాగర్ లను వలపన్ని పట్టుకున్న ఏసిబి… pic.twitter.com/ap48JndcOu
— ACB Telangana (@TelanganaACB) May 22, 2024
ఇంతకు ముందు హైచ్‌ఎండీఏ మాజీ డైరక్టర్ బాలకృష్ణ, ఏసీపీ ఉమామహేశ్వరరావు లాంటి పెద్ద స్థాయి వ్యక్తుల్ని వదిలి పెట్టలేదు.
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ @hydcitypolice సిసిఎస్, ఆర్థిక నేరాల విభాగంలో ఏసిపిగా పనిచేస్తున్న టిఎస్.ఉమామహేశ్వర్ రావు ఇల్లు, ఆయన సంబంధిత 13 చోట్లలో (హైదరాబాద్& విశాఖపట్నం) ఏసిబి అధికారులు ఏకకాలంలో దాడి చేసి దాదాపు 3.5 కోట్ల (బుక్ విలువ) విలువైన ఇళ్లస్థలాలు, విలువైన భూములు,… pic.twitter.com/c3GgRtXVKD
— ACB Telangana (@TelanganaACB) May 21, 2024
ప్రభుత్వం మారినప్పటి నుండి ఏసీబీ చాలా దూకుడుగా వ్యవహరి్సతోంది. గవర్నమెంట్ ఆఫీసుల్లో లంచాలు తీసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతోపాటు ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టిన ఆఫీసర్ల ఇండ్లపై దాడులు చేస్తున్నారు. గత సర్కార్ హయాంలో అడ్డగోలుగా ఆస్తులు సంపాదించిన పోలీస్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లకు చుక్కలు చూపిస్తున్నారు. గడిచిన ఐదున్నర నెలల్లో దాదాపుగా 60 ఏసీబీ కేసులు నమోదయినట్లుగా తెలుస్తోంది. రోజుకు ఇద్దరు, ముగ్గురు ఆఫీసర్లను ఏసీబీ వలపన్ని పట్టుకుంటున్నది.
ఎవరైనా ప్రభుత్వాధికారి లంచం అడిగితే వెంటనే ఏసీపీకి సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. రిపోర్ట్ చేయాల్సిన నంబర్ 1064. అవినీతి నిర్మూలన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏసీబీ అధికారులు గుర్తు చేస్తున్నారు.
ఎవరైనా ప్రభుత్వాధికారి లంచం అడిగితే వెంటనే రిపోర్ట్ చేయాల్సిన నంబర్ #Dial1064. అవినీతి నిర్మూలన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. #TelanganaACB #AntiCorruptionBureau #SayNoToCorruption #Responsibility pic.twitter.com/kWplmWzo7R
— ACB Telangana (@TelanganaACB) May 22, 2024