News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Tamilsai : ఎంత అవమానించినా వెనక్కి తగ్గను -గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు !

తనను ఎంత అవమానించినా తన పని తాను చేసుకుంటూ పోతానని తమిళిసై అన్నారు. ఇటీవల బీఆర్ఎస్ నేతల విమర్శలపై ఆమె స్పందించారు.

FOLLOW US: 
Share:

Tamilsai :  తనను ఎంత అవమానించినా వెనక్కి తగ్గబోనని గవర్నర్ తమిళిసై అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడారు.  గవర్నర్‌గా తెలంగాణలో తాను అడుగుపెట్టిన సమయానికి కేబినెట్‌లో ఒక్క మహిళా మంత్రి కూడా లేదని అన్నారు. తాను వచ్చాక ఇద్దరు మహిళా మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించానని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రావడంతో ఇద్దరు మహిళలకు మంత్రులుగా అవకాశం రావడం సంతోషం అని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రొటోకాల్ ఇచ్చినా, ఇవ్వకపోయినా నా పని నేను చేసుకుంటూ పోతా అని స్పష్టం చేశారు.  

తనపై పువ్వులు వేసే వారు ఉన్నారని, రాళ్లు వేసే వారు కూడా ఉన్నారని అన్నారు. అందరూ అందరికీ నచ్చాలని లేదని తెలిపారు. అయితే మంచి పనులు చేయడానికి అధికారం ఉండాలన్న గవర్నర్‌.. ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. తనపై రాళ్లు విసిరితే ఇల్లు కట్టుకుంటా.. పిన్స్‌ వేస్తే ఆ పిన్స్‌ గుచ్చుకొని వచ్చే రక్తంతో నా చరిత్ర పుస్తకం రాస్తానంటూ తమిళిసై వ్యాఖ్యానించారు. ఈ మేరకు శనివారం గవర్నర్‌ మాట్లాడుతూ.. లోక్‌సభ, శాసనసభలో 33% మహిళా రిజర్వేషన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. గత 27 ఏళ్లుగా ఈ బిల్లు గురించి మాట్లాడుతున్నారు కానీ అమలు కాలేదని పేర్కొన్నారు. ఓ మహిళా రాష్ట్రపతి ఈ బిల్లుపై సంతకం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. 

ప్రతి ఒక్కరూ ఒక కలతోనే రాజకీయాల్లోకి వస్తారని, అవకాశం వచ్చినప్పుడు పురుషులతో పోలిస్తే 20 రేట్లు ఎక్కువగా పని చేస్తే కానీ మహిళకు గుర్తింపు లభించదని తమిళిసై అన్నారు. ఒకప్పుడు తాను బీజేపీ నేతనని, ఇప్పుడు గవర్నర్‌ అని పేర్కొన్నారు. అప్పట్లో బీజేపీలో 33 శాతం రిజర్వేషన్‌ను మహిళలకు కల్పిస్తూ పార్టీ నిర్ణయించిందని, ఫలితంగా ఎంతోమంది మహిళలు పార్టీలో చేరారని ప్రస్తావించారు. రాజకీయాలపై మక్కువతోనే తను ఎంతగానో ఇష్టమైన వైద్యవృత్తిని కూడా పక్కన పెట్టాల్సి వచ్చిందన్నారు గవర్నర్‌.  రాజకీయాల్లో పురుషాధిక్యత ఎక్కువ. భారత్‌లో 15 లక్షల పంచాయతీలకు ప్రెసిడెంట్‌లుగా  మహిళలు ఉన్నారు.  నేను పురుషులకంటే మెరుగ్గానే పని చేస్తున్నానని గుర్తుచేశారు. గతంలో తాను బీజేపీ అధ్యక్షురాలిగా పని చేశానని.. తన గతం దాచేస్తే దాగేది కాదన్నారు. దాయాల్సిన అవసరం లేదన్నారు.                         

తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసైకి మధ్య సత్సంబంధాలు లేవు. ఎమ్మెల్సీలుగా తెలంగాణ కేబినెట్ సిఫారసు చేసిన ఇద్దర్ని అనర్హులని.. గవర్నర్ తిరస్కరించి  పైల్ ను వెనక్కి పంపారు . ఈ అంశంపై గవర్నర్ ను బీఆర్ఎస్ నేతలు ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఈ కారణంగానే  తమిళిసై ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. వచ్చే వారం జరగనున్నకేబినెట్ భేటీలో మళ్లీ వారి పేర్లనే గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా సిఫారసు చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.                                                               

Published at : 30 Sep 2023 02:09 PM (IST) Tags: Governor Tamilisai Telangana Politics criticism of Tamilisai

ఇవి కూడా చూడండి

Rythu Bharosa Funds: గుడ్‌న్యూస్, రైతుభరోసా విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్ - రుణమాఫీపైనా కీలక ఆదేశాలు

Rythu Bharosa Funds: గుడ్‌న్యూస్, రైతుభరోసా విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్ - రుణమాఫీపైనా కీలక ఆదేశాలు

TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం

TSPSC Chairman Resigns: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా, వెంటనే గవర్నర్ ఆమోదం

CH Malla Reddy: రేవంత్ రెడ్డికి మంత్రి మల్లారెడ్డి ఒకే ఒక రిక్వెస్ట్ - ఏంటో తెలుసా?

CH Malla Reddy: రేవంత్ రెడ్డికి మంత్రి మల్లారెడ్డి ఒకే ఒక రిక్వెస్ట్ - ఏంటో తెలుసా?

JC Prabhakar Reddy: ఆర్టీవో ఆఫీస్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన, వాళ్లు ఎదురొస్తే కాల్చేస్తామని వార్నింగ్!

JC Prabhakar Reddy: ఆర్టీవో ఆఫీస్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన, వాళ్లు ఎదురొస్తే కాల్చేస్తామని వార్నింగ్!

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే  ఏప్రిల్‌లోనే అవకాశం !

టాప్ స్టోరీస్

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు

YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు

AP News: సొంత సామాజిక వర్గం జగన్ కి ఎందుకు దూరమవుతోంది?

AP News: సొంత సామాజిక వర్గం జగన్ కి ఎందుకు దూరమవుతోంది?

Uttam Kumar Reddy to visit Medigadda: మేడిగడ్డ సందర్శించాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయం, వెంట వాళ్లు ఉండాలని అధికారులకు ఆదేశాలు

Uttam Kumar Reddy to visit Medigadda: మేడిగడ్డ సందర్శించాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయం, వెంట వాళ్లు ఉండాలని అధికారులకు ఆదేశాలు