By: ABP Desam | Updated at : 07 Feb 2022 07:25 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
సూర్యాపేటలో పేలిన ఆయిల్ ట్యాంకర్
సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొత్తబస్టాండ్ దగ్గర, డీజిల్ ఖాళీ ట్యాంకర్ ను గ్యాస్ వెల్డింగు చేస్తుండగా ఒక్కసారిగా పేలిపోవడంతో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. సూర్యపేట జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద ఓ ఆయిల్ ట్యాంకు పేలి ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆయిల్ ట్యాంకర్‌కు వెల్డింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా పెద్ద పేలుడు రావడంతో చుట్టుపక్కల వారంతా ఉలిక్కిపడ్డారు. ప్రమాదం జరిగిన ప్రదేశం రక్తసిక్తంగా మారింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఘటనాస్థలిని పరిశీలించిన ఎస్పీ
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ పేలి ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. లారీ డీజిల్ ట్యాంకర్‌కు గ్యాస్ వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతిచెందిన వారిలో సూర్యాపేట కూరగాయాల మార్కెట్ కు చెందిన వెల్డింగ్ షాపు యజమాని మంత్రి అర్జున్(36), కుడకుడ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ గట్టు అర్జున్(45)లుగా పోలీసులు గుర్తించారు. వెల్డింగ్ దుకాణం యజమానికి కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. డ్రైవర్ గట్టు అర్జున్‌కి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పట్టణ సీఐ ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ప్రమాదస్థలిని పరిశీలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు అంటున్నారు. ట్యాంకర్ ఖాళీగానే ఉన్నప్పటికీ గ్యాస్ ఫామ్ కావడం వెల్డింగ్ చేస్తున్న సమయంలో వేడికి మంటలు అంటుకొని భారీ శబ్దంతో పేలుడు సంభవించి ఉంటుందని స్థానికులు అంటున్నారు.
బేగంపేట ఎయిర్ పోర్టు వద్ద భారీగా మంటలు
హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టు సమీపంలోని రహదారి పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. స్థానికంగా దట్టమైన పొగ కమ్మేసింది. పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళన చెందారు. ఏం జరుగుతుందో తెలియక కాసేపు కంగారుపడ్డారు. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపుచేశారు. ఖాళీ ప్రదేశంలో వైర్లు, రసాయనిక పదార్థాలు ఉండటంతో మంటలు ఎక్కువగా వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అగ్ని ప్రమాదానికి కారణం ఏంటనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Top Headlines Today: విశాఖ నుంచే పోటీ చేస్తానన్న లక్ష్మీనారాయణ! తెలంగాణలో ఆలయాలకు క్యూ కట్టిన నేతలు
Telangana Elections 2023 : దేవుడి మీదే భారం - ఆలయాలకు క్యూ కట్టిన అన్ని పార్టీల నేతలు !
Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంక్‌లకు 18 రోజులు సెలవులు, 6 రోజులు సమ్మె - ఇక మీ బ్యాంక్ పని అయినట్టే!
Deadlines in December: డెడ్‌లైన్స్ ఇన్ డిసెంబర్, వీటిని సకాలంలో పూర్తి చేయకపోతే మీకే నష్టం!
Deeksha Diwas : దీక్షాదివాస్ వేడుకలకు అనుమతి- కానీ కండిషన్స్ అప్లై
EC Arrangements: పోలింగ్ డే కోసం ఈసీ భారీ ఏర్పాట్లు- ఎన్నికల సిబ్బందికి కీలక సూచనలు
Janasena Meeting: డిసెంబర్ 1 జనసేన విస్తృతస్థాయి సమావేశం - ఏం చర్చిస్తారంటే?
సముద్రంలో కుప్ప కూలిన అమెరికా మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్, జపాన్‌లోని ఓ ద్వీపం వద్ద ప్రమాదం
Uttarkashi Tunnel Rescue Operation: రూ.18 వేల జీతం కోసం సొంతూరు వదిలి, కన్నీళ్లు పెట్టిస్తున్న కార్మికుల కథలు
/body>