News
News
X

MP Uttam Kumar Reddy : సూర్యాపేట ఎస్పీకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవి ఇస్తారేమో- ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

MP Uttam Kumar Reddy : మంత్రి జగదీశ్ రెడ్డి పొగడ్తలతో ముంచెత్తిన సూర్యాపేట ఎస్పీపై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఎస్పీకి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారేమో అని ఎద్దేవా చేశారు.

FOLLOW US: 

MP Uttam Kumar Reddy : మంత్రి జగదీశ్ రెడ్డిని పొగుడుతూ జయహో అంటూ నినాదాలు చేశారు సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ పోలీసు ఉన్నతాధికారి మంత్రిని పొగడ్తలతో ముంచెత్తడంతో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ మంత్రి జగదీశ్‌ రెడ్డిని సమైక్యతా వజ్రోత్సవాల కార్యక్రమంలో పొగుడుతూ నినాదాలు చేశారు. ఎస్పీ తీరును నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తప్పుబట్టారు. ఈ ఘటనపై స్పందిస్తూ ట్విటర్‌ లో పోస్టు పెట్టారు. ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ టీఆర్ఎస్ కార్యకర్తలా వ్యవహరించారని ఆరోపించారు. మంత్రి జగదీశ్‌ రెడ్డిని బాహుబలి అంటూ నినాదాలు చేయడాన్ని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుబట్టారు. గతంలో ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌  కాళ్లు మొక్కిన  కలెక్టర్‌ను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ చేసినట్లే సూర్యాపేట ఎస్పీని కూడా ఎమ్మెల్సీ చేస్తారేమో అని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ట్వీట్ చేశారు.  

మంత్రికి జై కొట్టిన ఎస్పీ  

సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ మంత్రి జగదీష్ రెడ్డికి జై కొట్టారు. జై జగదీషన్న.. జయహో జగదీష్ అన్నా అంటూ నినాదాలు చేశారు. ఆపై మంత్రిని పొగడ్తలతో ముంచెత్తారు.  బాహుబలి సింహాసనాన్ని అధిష్ఠించినప్పుడు వచ్చే శబ్దం వల్ల గోడలకు బీటలు వచ్చింది అని అలాంటి శబ్దం ఇప్పుడు చేయాలంటూ వ్యాఖ్యానించారు. సూర్యాపేట శ్రీరాములు సెంటర్ లో ఏర్పాటు చేసిన సభలో ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. యూనిఫాంలో ఉండగానే జిల్లా ఎస్పీ రాజేందర్ ప్రసాద్ మంత్రి జగదీశ్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తడంపై  అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

జయహో జగదీశ్ రెడ్డి 

"ఆకలేస్తే కేకలేయమన్నాడు శ్రీశ్రీ. ఆకలేస్తే కేకలేయమన్నాడు శ్రీశ్రీ. మీకు ఆకలేస్తుందా. ఓకే  అయితే ఓ పని చేద్దాం.. జయహో జగదీశ్ రెడ్డి గారికి అంటాను. మీరు జయహో, జయహో అనాలి ఓకేనా.. ఏం అనాలి. జయహో జగదీష్ రెడ్డి. ఇంకా గట్టిగా. బాహుబలి సినిమా చూశారా. అందులో ప్రజలంతా అరిస్తే వచ్చిన శబ్దానికి గోడలకు బీటలు వచ్చాయి. ఇప్పుడు కూడా అలాగే రావాలి. గట్టిగా చెప్పండి. జయహో జగదీష్ రెడ్డి". - రాజేంద్ర ప్రసాద్, సూర్యాపేట ఎస్పీ

Also Read : Suryapet SP: మంత్రి జగదీశ్ రెడ్డిని బాహుబలితో పోల్చిన ఎస్పీ, సభలో జయహో అంటూ నినాదాలు

Also Read : Mancherial News : జాతీయ సమైక్యత ర్యాలీలో అపశృతి, 30 మంది విద్యార్థులకు అస్వస్థత

Published at : 16 Sep 2022 10:15 PM (IST) Tags: CONGRESS Bahubali Minister jagadeesh reddy Mp uttam kumar reddy Suryapeta news SP Rajendraprasad

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: ప్రధానిపై దాడికి పీఎఫ్ఐ కుట్ర, ఆ పార్టీని నాశనం చేయాల్సిందే: బీజేపీ

Breaking News Live Telugu Updates: ప్రధానిపై దాడికి పీఎఫ్ఐ కుట్ర, ఆ పార్టీని నాశనం చేయాల్సిందే: బీజేపీ

TSRTC Driver Suicide: అధికారుల వేధింపులు భరించలేక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

TSRTC Driver Suicide: అధికారుల వేధింపులు భరించలేక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

Uppal Stadium: స్టేడియంలో ఈ వస్తువులు బ్యాన్‌! మీరు తీసుకెళ్తే లోపలికి వెళ్లనివ్వరు - పోలీసుల హెచ్చరిక

Uppal Stadium: స్టేడియంలో ఈ వస్తువులు బ్యాన్‌! మీరు తీసుకెళ్తే లోపలికి వెళ్లనివ్వరు - పోలీసుల హెచ్చరిక

IND Vs AUS Match: Hydలో నేడు భారీ ట్రాఫిక్ ఆంక్షలు, మీరు క్రికెట్ మ్యాచ్‌కి వెళ్తున్నారా? పార్కింగ్ వివరాలివీ

IND Vs AUS Match: Hydలో నేడు భారీ ట్రాఫిక్ ఆంక్షలు, మీరు క్రికెట్ మ్యాచ్‌కి వెళ్తున్నారా? పార్కింగ్ వివరాలివీ

Vijayawada Traffic: విజయవాడ మీదుగా వెళ్తున్నారా? నగరంలోకి నో ఎంట్రీ - మళ్లింపులు ఇలా: పోలీసులు

Vijayawada Traffic: విజయవాడ మీదుగా వెళ్తున్నారా? నగరంలోకి నో ఎంట్రీ - మళ్లింపులు ఇలా: పోలీసులు

టాప్ స్టోరీస్

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

YSRCP ఎమ్మెల్యే శ్రీ‌దేవికి షాక్, సొంత పార్టీ నేత‌లే అవినీతి ఆరోప‌ణ‌లు - మొదట్నుంచీ వివాదాలే

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'