అన్వేషించండి

Telangana CM రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కొట్టివేత

Relief for Revanth Reddy in SC/ST Atrocity Case | గతంలో దాఖలైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు తీర్పును సీజేఐ ధర్మాసనం సమర్థించింది.

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నుంచి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గతంలో ఆయనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయగా, ఆ నిర్ణయాన్ని తాజాగా సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. సోమవారం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చి, జస్టిస్‌ వీఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది.

ఈ కేసు నేపథ్యం ప్రకారం.. 2016 జనవరి 12న అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రోద్బలంతో ఎ.కొండల్‌రెడ్డి, ఇ.లక్ష్మయ్య అనే వ్యక్తులు హైదరాబాద్‌ గోపనపల్లి సర్వే నం.127లోని సొసైటీ భూముల్లో ఒక గదిని జేసీబీతో ధ్వంసం చేశారని ఆరోపణలు వచ్చాయి. అందుకు అడ్డుచెప్పిన తనను కులం పేరుతో దూషించారని ఎన్‌.పెద్దిరాజు అనే వ్యక్తి గతంలోనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేశారు. ఈ కేసు ఎఫ్ఐఆర్‌ను హైకోర్టు కొట్టివేయడంతో, పెద్దిరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సోమవారం (ఫిబ్రవరి 16న) జరిగిన విచారణలో ధర్మాసనం ఈ కేసును రాజకీయ ప్రేరేపితం అంశంగా పేర్కొంది. రాజకీయ కక్షల కోసం న్యాయస్థానాలకు రావొద్దని హితవు పలికింది. రేవంత్‌రెడ్డి రెచ్చగొట్టినట్లు ఇద్దరు సాక్షులు చెప్పారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించగా, సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చి ఆ వాదనతో ఏకీభవించలేదు. ఆ సాక్షులు కేవలం విన్న మాటల ఆధారంగా చెప్పారని.. ప్రత్యక్షంగా చూశారని ఆధారాలు లేవని ధర్మాసనం పేర్కొంది. ఈ విచారణలో ప్రభుత్వం తరఫున న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు.

ఘటన జరిగిన రోజున రేవంత్‌రెడ్డి అక్కడ ఉన్నట్లు ఎవరూ చూడలేదని.. గదిని జేసీబీతో కూల్చిన వాళ్లు సైతం ఆయన చెప్పడం వల్లే వచ్చాం అని చెప్పి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని.. అలాంటి ఆధారాలు ఏమీ లేవని ధర్మాసనం పేర్కొంది. కేవలం ఛార్జిషీట్‌ దాఖలు చేసినంత మాత్రాన చర్యలు తీసుకోవాలని లేదు. సాక్ష్యాలు, ఆధారాలు సరిగ్గా ఉంటేనే విలువ ఉంటుందని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది.


రాజకీయ, వ్యక్తిగత కారణాలతో కేసులు ఫిర్యాదు చేసి కోర్టులను దుర్వినియోగ చేయాలనుకోవడం సరికాదని, పిటిషన్ అసలు ఉద్దేశం ఏంటో కోర్టులు అర్థం చేసుకుంటాయన్నారు. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ.. పిటిషన్‌ను కొట్టవేస్తూ సీజేఐ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి ఊరట లభించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget