అన్వేషించండి

Spot registration: కొన్న వెంటనే షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ - తెలంగాణలో వాహన కొనుగోలుదారులకు రిలీఫ్ !

Telangana: కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆర్టీఓ కార్యాలయాల నుంచి నేరుగా షోరూమ్‌లకే బదిలీ చేస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అవి నేటి నుంచి అమలవుతున్నాయి.

Spot registration of vehicles in Telangana:  తెలంగాణలో వాహనదారుల దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆర్టీఓ  కార్యాలయాల నుంచి నేరుగా షోరూమ్‌లకే బదిలీ చేస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ఇకపై వాహనదారులు తమ కొత్త బైక్ లేదా కారు రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం అటు సమయాన్ని, ఇటు శ్రమను ఆదా చేయడమే కాకుండా రవాణా శాఖలో పారదర్శకతను పెంచుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.               

అమలు విధానం ఎలా అంటే ?        

ఈ కొత్త విధానం ప్రకారం, వాహనం కొనుగోలు చేసిన సమయంలోనే షోరూమ్ డీలర్లు ఆన్‌లైన్ ద్వారా అవసరమైన పత్రాలను రవాణా శాఖకు సమర్పిస్తారు. షోరూమ్‌లోనే వాహనం యొక్క ఇంజిన్, ఛాసిస్ నంబర్లను అధికారులు ధృవీకరించేలా సాంకేతిక ఏర్పాట్లు చేశారు. రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయింపు కూడా అక్కడే పూర్తవుతుంది. దీనివల్ల వాహనం షోరూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడే అధికారిక నంబర్ ప్లేట్‌తో వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో టెంపరరీ రిజిస్ట్రేషన్ చేసుకుని, ఆ తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం మళ్లీ ఆర్టీఓ ఆఫీసులో స్లాట్ బుక్ చేసుకోవాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఆ తలనొప్పి ఉండదు.

చాలా కాలంగా పెండింగ్ లో ప్రతిపాదన                                  

వాస్తవానికి ఈ ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్‌లో ఉంది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానం అమలులో ఉన్నప్పటికీ, తెలంగాణలో సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరుగుతూ వచ్చింది. గతంలో ఆర్టీఓ కార్యాలయాల్లో ఏజెంట్ల బెడద, అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని భావించిన ప్రస్తుత ప్రభుత్వం, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా షోరూమ్ స్థాయిలోనే ప్రక్రియ ముగిసేలా నిబంధనలను సవరించింది.

వాహనదారుల స్పందన                             

ప్రభుత్వ నిర్ణయంపై వాహనదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారస్తులు తమ కొత్త వాహనం రిజిస్ట్రేషన్ కోసం ఒక రోజంతా సెలవు పెట్టి ఆర్టీఓ ఆఫీసులో వేచి ఉండాల్సిన అవసరం లేకపోవడం పెద్ద ఊరటనిస్తోంది.  షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ కావడం వల్ల ఆర్టీఓ కార్యాలయాల వద్ద ట్రాఫిక్ రద్దీ కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ప్రజలకు సేవలను మరింత చేరువ చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం వేసిన ఈ అడుగు రవాణా రంగంలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
HYDRA Ranganath: హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
Breaking News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Guntur Latest News: న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
న్యాయం కోసం టీడీపీ ఆఫీస్‌ వద్ద కదిరికి చెందిన ఓ కుటుంబం ఆందోళన: సీఐపై సంచలన ఆరోపణలు!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
AP Govt Employees PRC IR Demands: ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
ఏపీలో ఉద్యోగుల పీఆర్‌సీ రాజకీయం - చంద్రబాబు మార్క్ ఐఆర్ వ్యూహం.. ఆశల్లో ఉద్యోగ లోకం!
Nara Rohith Birthday: హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
హ్యాపీ బర్త్ డే ‌హజ్బెండ్... నారా రోహిత్‌కు వైఫ్ స్పెషల్ విషెష్ - క్యూట్ ఫ్యామిలీ ఫోటోస్
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
Brazil Match Kolkata: ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కోల్‌కతాలో సంద‌డి చేయ‌నున్న‌ బ్రెజిల్ టీమ్, త్వ‌ర‌లో టూర్ ఖ‌రారు!
ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కోల్‌కతాలో సంద‌డి చేయ‌నున్న‌ బ్రెజిల్ టీమ్, త్వ‌ర‌లో టూర్ ఖ‌రారు!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
మీ చిన్నారులకు విష్ణుమూర్తి పేరు పెట్టండి! అందమైన అర్థవంతమైన పేర్లు ఇక్కడున్నాయి!
Embed widget