By: ABP Desam | Updated at : 20 Nov 2023 07:16 PM (IST)
అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ, శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు
Sabarimala Trains: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల (Sabarimala) వెళ్లే అయ్యప్ప భక్తుల (Ayyappa Devotees)కు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) గుడ్‌న్యూస్ చెప్పింది. శబరిమల అయ్యప్ప స్వామి (Sabarimala Ayyappa Swamy) దర్శనానికి వెళ్లే వారి కోసం ప్రత్యేక రైళ్లు (Special Trains) ఏర్పాటు చేసింది. ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి కేరళలోని అయ్యప్ప దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివెళ్తుంటారు. వారి కోసం తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు ప్రాంతాల నుంచి మొత్తం 22 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఆయా రైళ్లు, ప్రయాణించే తేదీలు, సమయం వివరాలను సోమవారం విడుదల చేసింది.
22 Sabarimala Season Special Trains#Sabarimala @drmhyb @drmsecunderabad pic.twitter.com/HM4kA7bDvW
— South Central Railway (@SCRailwayIndia) November 20, 2023
నర్సాపుర్-కొట్టాయం, సికింద్రాబాద్- కొల్లం, కాకినాడ టౌన్ -కొట్టాయం, కొల్లం - సికింద్రాబాద్, కాచిగూడ - కొల్లంమధ్య ఈ ప్రత్యేక రైళ్లు నిర్దేశించిన రోజుల్లో రాకపోకలు కొనసాగించనున్నాయి. ఈ రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీతో పాటు స్లీపర్, సెకెండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని అధికారులు వెల్లడించారు. అయ్యప్ప భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రత్యేక రైళ్లు, ఆగే స్టేషన్లు..
కాచిగూడ - కొల్లం (07123), కొల్లం - కాచిగూడ(07124) మధ్య ప్రత్యేక రైలు నడవనుంది. ఈ రైళ్లు మల్కాజ్‌గిరి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలర్‌పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూరు, పాలక్కాడ్, త్రిసూర్, ఆలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగనస్సెరి, తిరువళ్ల, చెంగనూర్, మావెలికెర స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయి.
22 Sabarimala Season Special Trains #sabarimala #specialtrains pic.twitter.com/THfaPQLoT5
— South Central Railway (@SCRailwayIndia) November 20, 2023
సికింద్రాబాద్ - కొల్లం - సికింద్రాబాద్ (07129/07130) మధ్య ప్రత్యేక రైలును రైల్వే శాఖ ప్రకటించింది. నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలర్‌పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కడ్, త్రిసూర్, ,ఆలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగనస్సెరి, తిరువళ్ల, చెంగనూర్, మావెలికెర స్టేషన్ల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది.
సికింద్రాబాద్ - కొల్లం - సికింద్రాబాద్(07127/07128) వయా మహబూబ్ నగర్, కర్నూలు, కడప, రేణిగుంట, తిరుపతి మీదుగా రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. కాచిగూడ, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, శ్రీరామ్‌నగర్, గద్వాల్, కర్నూలు సిటీ,డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలర్‌పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూరు, పాలక్కాడ్, త్రిసూర్, ఆలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చెంగనస్సెరి, తిరువళ్ల, చెంగనూర్, మావెలికెర స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
కాకినాడ టౌన్ - కొట్టాయం - కాకినాడ (07126/07126) ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సామల్‌కోట్, అనపర్తి, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పడి, జోలర్‌పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూరు, పాలక్కాడ్, త్రిసూర్, ఆలువా, ఎర్నాకుళం టౌన్ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.
నర్సాపూర్-కొట్టాయం-నర్సాపూర్ (07119/07120) ప్రత్యేక రైళ్లు భీమవరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలర్‌పేట్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిసూర్, ఆలువా, ఎర్నాకుళం టౌన్ మీదుగా ప్రయాణిస్తాయి.
Supritha Congratulates Revanth Reddy: రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ - ప్లేట్ తిప్పేసిన సురేఖా వాణి కుమార్తె!
Kamareddy News: కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌కు షాక్ ఇచ్చిన ఎవరీ వెంకటరమణారెడ్డి?
Telangana New DGP: తెలంగాణ నూతన డీజీపీగా రవిగుప్తా నియామకం
Telangana constituency wise results: తెలంగాణ తీర్పు: ఏయే నియోజకవర్గంలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?
BRS WronG campaign stratgy : కాంగ్రెస్‌పై అతి వ్యతిరేక ప్రచారమే కొంప ముంచిందా ? ప్రచార వ్యూహాలూ బీఆర్ఎస్‌కు ప్రతికూలం అయ్యాయా ?
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్
KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్
/body>