అన్వేషించండి

Revanth Reddy: కేసీఆర్ బక్కోడు కాదు, భూ బకాసురుడు - రేవంత్ రెడ్డి సంచలనం

Siddipet News: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరీ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

తెలంగాణను కేసీఆర్ బొందలగడ్డ తెలంగాణగా మార్చారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ బక్కోడు కాదని.. భూ బకాసురుడు అని అన్నారు. ఆయన ఫామ్ హౌస్ లో పడుకునే కుంభకర్ణుడు అని ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరీ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

‘‘ఈ ప్రాంతానికి ఇవ్వాల్సిన నిధులను కేసీఆర్ సిద్దిపేటకు తరలించకుండా చెరుకు ముత్యం రెడ్డి కొట్లాడిండు. కాంగ్రెస్ హయాంలోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. దుబ్బాకకు నిధులు రాకుండా సిద్దిపేటకు తరలించుకుపోవడం మామా, అల్లుళ్లకు అలవాటైంది. కేంద్రం నిధులు తెచ్చి రఘునందన్ రావు దుబ్బాకను అభివృద్ధి చేస్తానన్నారు. మూడేళ్లలో ఇచ్చిన మాట నిలబెట్టుకోని రఘునందన్ కు మళ్లీ ఓటు అడిగే హక్కు లేదు. ఈ ప్రాంతానికి 10వేల కోట్లు తెచ్చి అభివృద్ధి చేసి ఉంటే ఆయనకు ఆ హక్కు ఉండేది. పార్టీ రాజకీయ కుమ్ములాటల్లో బిజీగా ఉండు తప్ప... ఈ ప్రాంత అభివృద్ధికోసం చేసిందేమీ లేదు.

కొత్త ప్రభాకర్ రెడ్డి పేరులోనే కొత్త ఉంది తప్ప.. ఆయన పాతచింతకాయ పచ్చడే. దొర గడీలో కాపలా ఉండే ప్రభాకర్.. ఎందుకు దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయలేదు? ఎందుకు దుబ్బాకకు నిధులు తెప్పించలేదు? ఎందుకు ఈ దుబ్బాకకు పీజీ కాలేజీ తీసుకురాలేదు? ఎందుకు ఇక్కడి ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదు. పదేళ్లుగా ఎంపీగా ఉన్న ప్రభాకర్ రెడ్డి ఈ ప్రాంతానికి చేసిందేం లేదు.. కేసీఆర్ గడీలో పెద్ద జీతగాడిలా.. బంట్రోతులా పనిచేశాడు తప్ప. 

దుబ్బాక ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయలేదు. రఘునందన్ ను, కొత్త ప్రభాకర్ రెడ్డిని చూశారు. ఇక వాళ్లను చూడాల్సిందేం లేదు. నీతికి, నిజాయితీకి మారుపేరు చెరుకు ముత్యంరెడ్డి. అలాంటి ముత్యం రెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించండి. పదేళ్లలో కేసీఆర్ కుటుంబం బంగారుమయంగా మారింది. తెలంగాణను కేసీఆర్ బొందలగడ్డ తెలంగాణగా మార్చారు. కేసీఆర్ బక్కోడు కాదు.. భూ బకాసురుడు.. ఫామ్ హౌస్ లో పడుకునే కుంభకర్ణుడు.

ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు న్యాయం జరుగుతుంది. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. కేసీఆర్ కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం కట్టించడం ఖాయం.. దోచుకుంది కక్కించడం ఖాయం’’ అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

టాప్ హెడ్ లైన్స్

Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget