News
News
X

BRS BJP Flex Fight : దర్యాప్తు సంస్థల దశకంఠుడిగా మోదీ ఫ్లెక్సీ, బీజేపీ నేతలు సీరియస్

BRS BJP Flex Fight : సికింద్రాబాద్ లో దశకంఠుని రూపంలో ఏర్పాటుచేసిన మోదీ ఫ్లెక్సీని బీజేవైఎం నేతలు చించివేశారు. బీఆర్ఎస్ నేతలు ఈ ఫ్లెక్సీ పెట్టారని ఆరోపించారు.

FOLLOW US: 
Share:

BRS BJP Flex Fight :  బీజేపీ-బీఆర్ఎస్ వార్ పీక్ స్టేజ్ కు చేరింది. దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు ఇవాళ ఈడీ విచారిస్తుంది. దీంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా, బీజేపీకి వ్యతిరేంగా ఫ్లెక్సీలు వెలిశాయి. దిల్లీలో కూడా కవితకు మద్దతుగా ఫ్లెక్సీలు పెట్టారు బీఆర్ఎస్ నేతలు. బీజేపీ కుట్రపూరితంగా కేసులు పెట్టి వేధిస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నాయి. 

బీజేవైఎం ఫైర్ 

సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద కంటోన్మెంట్ గ్రౌండ్ లో మోదీ దశకంఠని రూపంలో ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటుచేశారు గుర్తుతెలియని వ్యక్తులు. దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేవైఎం నేతలు ఆ ఫ్లెక్సీని చించివేశారు. దశకంఠుడి రూపంలో మోదీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి పది తలల కింద ఈడీ, సీబీఐ, ఐటీ, అదానీ, ఈసీ, డీఆర్ఐ, ఐబీ, ఎన్సీబీ,ఎన్ఐఏ తొమ్మిది తలలుగా మధ్యలో మోదీ ఫొటోను పెట్టారు. ఈ ఫ్లెక్సీ పైన ప్రజాస్వామ్య విధ్వంసకుడు, వంచనకు తాత అని రాశారు. ఈ ఫ్లెక్సీని బీజేవైఎం నేతలు చించివేసి బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఎస్ఎండీసీ ఛైర్మన్ క్రిషాంక్ ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  మరొసారి ఇటువంటి చర్యలకు పాల్పడితే తగిన గుణపాఠం చెబుతామని క్రిషాంక్ ను హెచ్చరించారు బీజేవైఎం నేతలు. 

దిల్లీలో బైబై మోదీ ఫ్లెక్సీలు 

లిక్కర్ స్కామ్‌ కేసులో ఢిల్లీలో విచారణ జరుగుతుండగానే భారీగా పోస్టర్లు వెలిశాయి. బైబై మోడీ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌తో కనిపించిన ఈ పోస్టర్లపై చాలా బీజేపీపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. కమలం కండువా కప్పుకుంటే చాలా కేసులు మాఫీ అంటూ వాషింగ్ పౌడర్‌ వేసి అంతక ముందు ఆ తర్వాత అనేది సూచిస్తూ పోస్టర్లు కనిపిస్తున్నాయి. 

తెలంగాణలో  ఈ మధ్య కాలంలో సరికొత్త రాజకీయం కనిపిస్తోంది. ఏదైనా మెయిన్ ఇష్యూ నడుస్తున్నప్పుడు దాన్ని సమర్థిస్తూనో వ్యతిరేకిస్తూనో గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు, ఫెక్సీలు వేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇది నగర ప్రజలను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఇలాంటి పోస్టర్లు ఢిల్లీలో కూడా ఏర్పాటు చేశారు.  ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారిస్తుంది. ఈటైంలో ఆమెకు మద్దతుగా పోస్టర్లు వెలిశాయి. అదే టైంలో బీజేపీని విమర్శిస్తూ దర్యాప్తు సంస్థల తీరును తప్పుపడుతూ ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి. దర్యాప్తు సంస్థలతో బీజేపీ రాజకీయాలు చేస్తోంది అనే విమర్శలతో ఢిల్లీ వ్యాప్తంగా భారీగా పోస్టర్లు వెలిశాయి. రాత్రికి రాత్రే ఈ పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు అతికించారు. బీఆర్ఎస్‌ మద్దతుదారులే వీటిని ఏర్పాటు చేసి ఉంటారని స్పష్టం అవుతుంది కానీ ఎవరనేది మాత్రం క్లారిటీ లేదు. 

ప్రత్యర్థులను ఎలిమినేట్ చేయడానికో, అణచివేసేందుకు మాత్రమే ఈడీ, సీబీఐ, ఐటీ లాంటి సంస్థలను బీజేపీ వాడుకుంటోందన్న ఆరోపణలతో పోస్టర్లు వేశారు. ఇందులో కవితకు మద్దతుగా కూడా కొటేషన్లు ఉన్నాయి. అదే టైంలో కేసులు ఉన్న వ్యక్తులు బీజేపీలో చేరితే ఎలాంటి కేసులు ఉండబోవన్న విషయాన్ని కూడా పోస్టర్లలో చెప్పారు. గత కొన్నేళ్లుగా బీజేపీలో చేరిన వారి పేర్లు ఫొటోలను అందులో చెబుతూ చేరక ముందు ఉన్న కేసులు చేరిన తర్వాత వాళ్ల కేసుల స్టేటస్‌ను ఈ పోస్టర్లలో వివరించారు. జ్యోతిరాదిత్య సింధియా, అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ, వెస్ట్‌ బెంగాల్‌ బీజపీ ముఖ్యనేత సువేందు అధికారి, ఏపీ ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్‌ రాణె ఇలా కేసుల్లో నిండా మునిగిన వాళ్లు కూడా రైడ్‌ జరిగిన తర్వాత బీజేపీలో చేరి కేసుల నుంచి తప్పించుకున్నారనే విమర్శ వచ్చేలా పోస్టర్లు వేశారు.   మధ్యలో రైడ్‌ అనే వాషింగ్ పౌడర్‌ వేసి వ్యంగ్యంగా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. వాళ్లంతా ముందు బురద మరకలతో ఉన్నప్పుడు రైడ్ జరుగుతుందని వెటంనే వాళ్లంతా కాషాయం దుస్తుల్లోకి మారిపోతున్నట్టు అందులో వివరించారు. కవిత ఫొటో కూడా పోస్టర్‌లో వేశారు. తెలంగాణ నుంచి కవిత రైడ్ జరగక ముందు జరిగిన తర్వాత కూడా ఎలాంటి మార్పు లేకుండా ఉన్నారని ఎలాంటి మార్పులు లేవని పేర్కొన్నారు. ట్రూ కలర్‌ నెవర్ ఫేడ్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. నిజమైన రంగు ఎప్పటికీ వెలిసిపోదని చెప్పారు. చివరకు బైబై మోడీ అంటూ హ్యాగ్‌ ట్యాగ్ జత చేశారు. 

Published at : 11 Mar 2023 04:05 PM (IST) Tags: BJP Secunderabad ED BRS CBI Flex war Modi Flex

సంబంధిత కథనాలు

KVS: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!

KVS: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ షెడ్యూలు వెల్లడి, ముఖ్యమైన తేదీలివే!

Hyderabad News: కానిస్టేబుల్ ప్రేమ పెళ్లి - వరకట్నం కోసం వేధింపులు, తాళలేక మహిళ బలవన్మరణం

Hyderabad News: కానిస్టేబుల్ ప్రేమ పెళ్లి - వరకట్నం కోసం వేధింపులు, తాళలేక మహిళ బలవన్మరణం

TSPSC Leaks What Next : ఓ వైపు లిక్కర్ కేసు - మరో వైపు పేపర్ లీకేజీ దుామరం ! కేసీఆర్ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దబోతున్నారు ?

TSPSC Leaks What Next :  ఓ వైపు లిక్కర్ కేసు - మరో వైపు పేపర్ లీకేజీ దుామరం ! కేసీఆర్ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దబోతున్నారు ?

Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిపోయిన వర్షాలు, మళ్లీ 24, 25 తేదీల్లో కురిసే ఛాన్స్!

Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిపోయిన వర్షాలు, మళ్లీ 24, 25 తేదీల్లో కురిసే ఛాన్స్!

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

టాప్ స్టోరీస్

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!

Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా