Telangana Municipal Elections: నేడు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్, పోలింగ్ తేదీ ఫిక్స్!
Schedule for Telangana Municipal Elections | తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పోరేషన్ల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది.

GHMC mayor Elections |హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. తెలంగాణలోని 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికలకు నేడు విడుదల కానుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సర్వం సిద్ధం చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా మంగళవారం ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో ఎస్‌ఈసీ కీలక సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో ఎన్నికల ప్రధాన అధికారికి భేటీ అవుతారు. నేటి సాయంత్రం పురపాలక ఎన్నికల షెడ్యూలును విడుదల చేసే అవకాశం ఉంది. ఏదైనా సమస్య, అవాంతరం లేకపోతే మున్సిపల్ ఎన్నికల షెడ్యూలు మంగళవారం విడుదల కానుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితాల ముద్రణతో పాటు ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పోలింగ్ తేదీ ఫిక్స్ చేశారా..
ఎన్నికల కోసం పోలింగు కేంద్రాలు, బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధం చేయడంతో పాటు నియమనిబంధనల మార్గదర్శకాలను కూడా ఇప్పటికే జారీ చేశారు. ఫిబ్రవరి 15 లోపు ఎన్నికల ప్రక్రియను ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఫిబ్రవరి 11వ తేదీ పోలింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు తమ నివేదికల్లో పేర్కొన్నారు. ఒకవేళ ఆ రోజు ఎన్నికలు నిర్వహిస్తే కనుక, ఫిబ్రవరి 13వ తేదీ నాటికి ఓట్ల లెక్కింపు పూర్తి చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంచనాల మేరకు ఎన్నికల షెడ్యూలు విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్రవ్యాప్తంగా గత కొన్నిరోజులుగా పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
తెలంగాణ మున్సిపల్ రిజర్వేషన్లు.. మహిళలకు సగం పీఠాలు, బీసీలకు దక్కిన స్థానాలివే
రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం అధికారికంగా ఇటీవల ఖరారు చేసింది. మొత్తం 121 మున్సిపాలిటీలు, 10 ప్రధాన నగరపాలక సంస్థలకు (కార్పొరేషన్లు) సంబంధించి మేయర్లు, చైర్‌పర్సన్ల పదవుల కేటాయింపుపై పురపాలక శాఖ స్పష్టత ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే, సామాజిక సమీకరణాల ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేశారు.
కార్పొరేషన్ మేయర్ రిజర్వేషన్లు
మొత్తం 10 కార్పొరేషన్లలో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ 50 శాతం (5 స్థానాలు) మహిళలకు కేటాయించారు.
- జీహెచ్‌ఎంసీ (GHMC): జనరల్ (మహిళ)
- మహబూబ్‌నగర్: బీసీ (మహిళ)
- కొత్తగూడెం: ఎస్టీ (జనరల్)
- రామగుండం: ఎస్సీ (జనరల్)
- కరీంనగర్: బీసీ (జనరల్)
- మంచిర్యాల: బీసీ (జనరల్)
- గ్రేటర్ వరంగల్: అన్‌రిజర్వ్‌డ్ (జనరల్)
మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లు ఇలా..
- రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 121 మున్సిపాలిటీల్లో కేటాయింపులు ఇలా
- బీసీలు: 38 మున్సిపాలిటీలు (డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల మేరకు).
- ఎస్సీలు: 17 మున్సిపాలిటీలు.
- ఎస్టీలు: 5 మున్సిపాలిటీలు.
మహిళలు: అన్ని వర్గాల్లో కలిపి మొత్తం స్థానాల్లో 50 శాతం మహిళలకే దక్కనున్నాయి.
కాల వ్యవధి పూర్తయిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు మాత్రమే ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్ షిప్ కోర్సు చేసేందుకు విదేశాల్లో ఉన్నారు.



















