TS Schools Reopen: పిల్లలు బ్యాగులకు పట్టిన దుమ్ము దులుపుతారా..? స్కూల్స్ రీ ఓపెన్ పై తల్లిదండ్రుల మాటేంటి?

దాదాపు రెండు సంవ‌త్సరాల త‌ర్వాత పూర్తిస్థాయిలో స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. సెప్టెంబ‌ర్ 1 నుంచి బ‌డులు ప్రారంభిచాల‌ని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

FOLLOW US: 

సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ మేర‌కు అన్నీ జిల్లాల డీఈఓల‌కు ఆదేశాలు వెళ్లాయి. దీంతో స్కూల్స్ రీ ఓపెనింగ్ ప‌నిలో నిమ‌గ్నమయ్యారు టీచ‌ర్లు. అన్నీ పాఠ‌శాల‌ల‌ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని స్కూల్స్ శానిటైజ‌ష‌న్ పూర్తి చేశారు. పేరుకుపోయిన దుమ్ము, దూళిని దులిపేశారు. స్కూల్స్ అన్నింటీని వాట‌ర్ తో నీట్ గా క‌డిగేశారు. గ‌త వారం ప‌దిరోజుల్ని ఇదే ప‌ని జరుగుతోంది. 

గవర్నమెంట్ స్కూల్సే కాదు.. ప్రైవేటు స్కూల్స్ కూడా తెరుచుకోనుండటంతో ప్రైవేటు స్కూల్స్ యాజ‌మాన్యాలు కూడా త‌ర‌గ‌త‌ల‌ను సిద్ధం చేస్తున్నాయి. స్కూల్స్  తెరిచేందుకు ప్రభుత్వం ఉత్సహం చూపించడంతో స్కూల్స్ యాజ‌మాన్యాలు, గ‌వ‌ర్నమెంట్ టీచ‌ర్లు కూడా బ‌డి గంట‌లు మోగించడానికి సిద్ధమయ్యారు. గ‌త సంవత్సరం ఒక నెల‌న్నరపాటు మాత్రమే  బ‌డులు తెరుచుకున్నాయి. అదీ కూడా అన్నీ త‌ర‌గ‌తులు కాదు. ఇప్పుడు మాత్రం ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి అన్నీ క్లాసుల‌కు స్కూల్స్ ఓపెన్ చేయాల‌ని నిర్ణయించారు.

అయితే ప్రస్తుతం క‌రోనా సెకండ్ వేవ్ కొంత త‌గ్గుముఖ‌ం ప‌ట్టింద‌ని అధికారులు చెబుతున్నారు. మూడో వేవ్ వ‌స్తుంద‌ని కూడా వైద్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. మ‌రీ  ఈ ప‌రిస్థితుల్లో త‌ల్లిదండ్రులు స్కూల్స్ కు పిల్లల్ని పంపిస్తారా?  లేదా? అనుమానం క‌లుగుతోంది. కొంత‌మంది పేరెంట్స్ మాత్రం రెండేళ్లుగా బ‌డికిపోక‌పోవ‌డంతో చ‌దువు మొత్తం పోయిందని.. ఉన్నది.. కూడా మ‌ర్చిపోయార‌ని ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. కానీ మెజార్టీ పెరెంట్స్ మాత్రం స్కూల్స్ పంపించేది లేద‌ని అంటున్నారు. క‌రోనా పూర్తిగా త‌గ్గిన త‌ర్వాతే బ‌డుల‌కు పంపించేది..

గ‌త ఏడాది కూడా క్లాసులకు పంపించాం..  నెలన్నరకే.. మూసేశారని చెబుతున్నారు.

అస‌లు ఈ సారి స్కూల్స్ ఓపెనింగ్ త‌ర్వాత ప్రభుత్వం ఏం చ‌ర్యలు  తీసుకుంటుంది? క‌రోనా జాగ్రత్తలు పాటిస్తారా? సెకెండ్ వేవ్ పూర్తిగా క‌నుమ‌రు అవ‌కముందే జాగ్రత్తలు గాలికొదిలేశారు. కరోనా ముందు జాగ్రత్తలు పాటించండి మెుర్రో అని మెుత్తుకుంటున్నా..అటు అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇటు జ‌నం ప‌ట్టించుకోకుండా త‌మ‌కు ఇష్టం వచ్చిన రీతిలో ఉంటున్నారు. ఇంత‌మంది పాటించ‌డంలేదు.. మ‌రి స్కూల్స్ కి వెల్లే పిల్లలు, వారి టీచ‌ర్లు, వారిని స్కూల్ కి.. ఇంటికి తీసుకెళ్లే ట్రాన్స్ పోర్టర్స్ ఎంత‌వ‌ర‌కు పాటిస్తారు? అనేది ఒక పెద్ద ప్రశ్న. 

స్కూల్స్ ర‌న్ కాక‌పోవ‌డం వ‌ల్ల ప్రభుత్వానికి భారీగా ఆదాయం గండిప‌డింది. మ‌రోవైపు  ఈ రంగం మీద ఆధార‌ప‌డిన వారు చాలా మంది ఇబ్బందులు పాలవుతున్నారు. మ‌రీ అటు ప్రభుత్వానికి ఆదాయం కోస‌మో, కొంత‌మంది ఇబ్బంది ప‌డుతున్నారు క‌దా అని స్కూల్ పిల్లల జీవితాల‌తో అడుకుంటారా? అని అనేవారు లేక‌పోలేదు. ఇప్పటికే ఆన్ లైన్ క్లాసుల్లో కొద్దొగొప్పో నేర్చుకుంటున్నార‌ని కొంత‌మంది అంటుంటే మ‌రికొంత‌మందికి ఈ ఆన్ లైన్ క్లాసులు వ‌ల్ల పిల్లలు మ‌రింత ఇబ్బంది ప‌డుతున్నారని అంటున్నారు.

ఇక  ఈ ఆన్ లైన్ క్లాసులే అంద‌క చాలా మంది చ‌దువు దూర‌మైపోతున్నారు. ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు మాత్రం పిల్లల  త‌ల్లిదండ్రుల‌నుంచి త‌మ‌దైన శైలిలో ఫీజులు వ‌సూలు చేయ‌డానికి  సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఫీజుల భారం మోప‌ద్దొని చెబుతున్నా అది పేప‌ర్లకే ప‌రిమితమ‌వుతోంది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే బ‌డులు తెరుచుకున్నాయి. నెల రోజులుగా చూసుకుంటే అక్కడ 50శాతానికి మించి అటెండెట్స్ రావ‌డంలేదు. మ‌రి తెలంగాణ‌లో అనేక బిన్నాభిప్రాయాల మ‌ద్య పిల్లల్ని పేరెంట్స్ ఏ మేర‌కు స్కూల్స్ పంపిస్తార‌నేది చూడాలి. పిల్లల్ని స్కూల్స్ పంపించే త‌ల్లిదండ్రులు మాత్రం త‌గు జాగ్రత్తలైతే తీసుకోవాలి. అటు స్కూల్ యాజ‌మాన్యాలు, సిబ్బంది కూడా కకచ్చితంగా క‌రోనా జాగ్రత్తలు పాటిస్తేనే ఉప‌యోగం లేదంటే అంద‌రూ నష్టపోవాల్సి వస్తుంది.

Also Read: BRAOU Admissions: విద్యార్థులకు గుడ్ న్యూస్.. డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు మళ్లీ పొడిగించారు..

Published at : 31 Aug 2021 06:28 AM (IST) Tags: covid TS Schools TS Schools reopen Govt on schools open corona effect on schools

సంబంధిత కథనాలు

Revanth Reddy Vs Jaggareddy : టీకాంగ్రెస్ లో ముదిరిన వివాదం, రేపు సంచలన ప్రకటన చేస్తానంటున్న జగ్గారెడ్డి

Revanth Reddy Vs Jaggareddy : టీకాంగ్రెస్ లో ముదిరిన వివాదం, రేపు సంచలన ప్రకటన చేస్తానంటున్న జగ్గారెడ్డి

BJP Mission South: భాజపాకు సౌత్ ఫోబియా పోయినట్టేనా? మిషన్ సౌత్ ఇండియా ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

BJP Mission South: భాజపాకు సౌత్ ఫోబియా పోయినట్టేనా? మిషన్ సౌత్ ఇండియా ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

Jeevan Reddy: మోదీని సేల్స్‌మేన్ అనడంలో తప్పేంటి? అందుకే కేసీఆర్ అలా అన్నారు - జీవన్ రెడ్డి

Jeevan Reddy: మోదీని సేల్స్‌మేన్ అనడంలో తప్పేంటి? అందుకే కేసీఆర్ అలా అన్నారు - జీవన్ రెడ్డి

Amit Shah: తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో అధికారంలోకొస్తాం: అమిత్‌షా, భాగ్యనగర్ డిక్లరేషన్ పేరుతో తీర్మానం

Amit Shah: తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో అధికారంలోకొస్తాం: అమిత్‌షా, భాగ్యనగర్ డిక్లరేషన్ పేరుతో తీర్మానం

Karimnagar News : జమ్మికుంట ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థిని అనుమానాస్పద మృతి, ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు

Karimnagar News : జమ్మికుంట ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థిని అనుమానాస్పద మృతి, ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు

టాప్ స్టోరీస్

Actress Arrested: పోలీస్ ఆఫీసర్ ని కరిచిన నటి - పూణేలో అరెస్ట్

Actress Arrested: పోలీస్ ఆఫీసర్ ని కరిచిన నటి - పూణేలో అరెస్ట్

Pawan Kalyan: జనవాణి జనసేన భరోసాకు విశేష స్పందన - పవన్ కళ్యాణ్‌కు సీఎం జగన్‌పైనే తొలి ఫిర్యాదు !

Pawan Kalyan: జనవాణి జనసేన భరోసాకు విశేష స్పందన - పవన్ కళ్యాణ్‌కు సీఎం జగన్‌పైనే తొలి ఫిర్యాదు !

CM Jagan Pics: ముగిసిన సీఎం జగన్ ప్యారిస్ పర్యటన, ప్రత్యేక విమానంలో అమరావతికి

CM Jagan Pics: ముగిసిన సీఎం జగన్ ప్యారిస్ పర్యటన, ప్రత్యేక విమానంలో అమరావతికి

Ram Charan: రామ్ చరణ్ ను తీసుకోకుండా ఉండాల్సింది - స్టార్ రైటర్ కామెంట్స్!

Ram Charan: రామ్ చరణ్ ను తీసుకోకుండా ఉండాల్సింది - స్టార్ రైటర్ కామెంట్స్!