అన్వేషించండి
దసరా సెలవులు రేపట్నుంచే, 26న బడులు పునఃప్రారంభం
తెలంగాణలో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు నేటితో ముగియనున్నాయి.

దసరా సెలవులు రేపట్నుంచే, 26న బడులు పునఃప్రారంభం
Source : Freepik
తెలంగాణలో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు సమ్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు నేటితో ముగియనున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈ నెల 13వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆ పరీక్షల ఫలితాలు సెలవుల అనంతరం వెల్లడించనున్నారు. 13 రోజుల సెలవుల అనంతరం అక్టోబరు 26న బడులు పునఃప్రారంభమవుతాయి. మరో వైపు ఫార్మెటివ్ అసెస్‌మెంట్-1, 2 పరీక్షల మార్కులను చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. అన్ని జూనియర్ కళాశాలలకు ఈ నెల 19వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్





















