అన్వేషించండి

No Schemes: ఆ పంట పండించే వారికి పథకాలు కట్: కలెక్టర్ రాహుల్ రాజ్

Adilabad District News: ఆదిలాబాద్ జిల్లాలో యువత, ప్రజలు మత్తు పదార్థాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహూల్ రాజ్ అధికారులకు సూచించారు.

Adilabad District Collector: ఆదిలాబాద్ జిల్లాలో యువత, ప్రజలు మత్తు పదార్థాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహూల్ రాజ్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో మత్తు పదార్థాలైన గంజాయి పండించకుండా, వాడకుండా, డ్రగ్స్ వినియోగించకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలైన గంజాయి పండించిన వారిపై కేసులు నమోదు చేస్తూ, ప్రభుత్వ పథకాలైన రైతుబంధు లాంటివి రాకుండా చర్యలు తీసుకొనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కళాశాలలో, పాఠశాలల్లో ప్రత్యేకంగా అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి చైతన్యాన్ని కలిగించాలని తెలిపారు. 
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలు, రైతులు, దళారుల మాటలు నమ్మి మోసపోయి గంజాయి పండించినట్లయితే వచ్చే అనర్థాలపై అవగాహనా కల్పిస్తామన్నారు. జిల్లా పోలీసు శాఖ, వ్యవసాయ శాఖ సమన్వయంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఇదివరకే మత్తు పదార్థాలకు బానిసైన యువత, ప్రజలు ఎవరైనా ఉంటే వారికి.. డి అడిక్షన్ సెంటర్ ద్వారా నయం చేసే అవకాశం ఉన్నందున వాటిని వినియోగించుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గంజాయి స్మగ్లర్ల పై త్వరలోనే పీడి యాక్ట్ కేసులు నమోదు చేయబోతున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గంజాయి విక్రయదారులను, పండించే వారిని నియంత్రిస్తున్నట్లు తెలియజేశారు. గంజాయి అలవాటుపడ్డ వ్యక్తుల తల్లిదండ్రులకు సైతం కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో గంజాయి రహిత సమాజాన్ని సాధించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పోస్టర్లను జిల్లా ఉన్నతాధికారులకు సమక్షంలో ఆవిష్కరించారు.

గత ఆరు నెలలలో జిల్లా వ్యాప్తంగా గంజాయి పండిస్తున్న 38 వ్యక్తులను అరెస్టు చేయడం జరిగిందని, వీరిపై 20 కేసులను నమోదు చేస్తూ 133 కిలోల గంజాయి ని స్వాధీనం చేసుకోగ, 275 గంజాయి మొక్కలను సైతం స్వాధీనం చేసుకొని ధ్వంసం చేసినట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా గంజాయి సాగు చేస్తున్నట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
Pawan Kalyan: వరద బాధితులకు పవన్ అభిమాని రూ.600 విరాళం, స్పందించిన డిప్యూటీ సీఎం
వరద బాధితులకు పవన్ అభిమాని రూ.600 విరాళం, స్పందించిన డిప్యూటీ సీఎం
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
Pawan Kalyan: వరద బాధితులకు పవన్ అభిమాని రూ.600 విరాళం, స్పందించిన డిప్యూటీ సీఎం
వరద బాధితులకు పవన్ అభిమాని రూ.600 విరాళం, స్పందించిన డిప్యూటీ సీఎం
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
Embed widget