Sai Chand Death: సాయిచంద్ మృతదేహానికి ప్రముఖల నివాళులు, కన్నీటి పర్యంతమైన సీఎం కేసీఆర్
Sai Chand Death: ప్రముఖ సింగర్, తెలంగాణ గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ సాయి చంద్ మృతితో బీఆర్ఎస్ పార్టీ నేతల్లో తీవ్ర విషాదం నెలకొంది. సీఎం కేసీఆర్ సహా మంత్రులంతా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Sai Chand Death: అకాల మరణం చెందిన, తెలంగాణ ఉద్యమ ప్రజా గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ మృతితో బీఆర్ఎస్ పార్టీ నేతల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈక్రమంలోనే సీఎం కేసీఆర్ సాయి చంద్.. పార్థివ దేహానికి ఘన నివాళులు అర్పించారు. గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్.. ఆయన భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. సాయిచంద్ ను చూడగానే ముఖ్యమంత్రి కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల వద్దకు చేరుకొని ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా..." సార్ సాయిని పిలువండి. లెమ్మనండి..మీరు పిలిస్తే లేచివస్తాడు..సార్.." అంటూ సాయింద్ భార్య రజినీ హృదయ విదారకంగా రోదించారు. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. దగ్గరకు వచ్చి రోధిస్తున్న సాయిచంద్ తండ్రిని సీఎం అక్కున చేర్చుకొని ఓదార్చారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.
అకాల మరణం చెందిన, తెలంగాణ ఉద్యమ ప్రజా గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ గారు ఘన నివాళులు అర్పించారు.
— BRS Party (@BRSparty) June 29, 2023
గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్.. సాయిచంద్ భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. సాయిచంద్ ను… pic.twitter.com/Jx2pDegKU9
ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీలు గోరేటి వెంకన్న, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి తదితర ప్రజాప్రతినిధులు పార్టీ నేతలు సీఎం కేసీఆర్ గారి వెంట వచ్చి నివాళులర్పించారు.
హఠాన్మరణం చెందిన ఉద్యమ గాయకుడు, కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ పార్థివదేహానికి సీఎం కేసీఆర్ పుష్పాంజలి ఘటించారు. గుర్రంగూడలోని ఆయన నివాసానికి వెళ్లి వారి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. సాయిచంద్ భౌతికకాయాన్ని చూసి సీఎం కేసీఆర్ భావోద్వేగానికి… pic.twitter.com/oasSLDdMOF
— BRS Party (@BRSparty) June 29, 2023
బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా కారుకొండలోని తన ఫాం హౌస్ కు వెళ్లారు. అయితే అర్ధరాత్రి వేళ సాయి చంద్ కు గుండెపోటు రాగా... చికిత్స నిమిత్తం నాగర్ కర్నూల్ లోని ఓ దవాఖానకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కన్నుమూశారు. దీంతో ఆయన భౌతిక కాయాన్ని రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో ఉన్న ఆయన స్వగృహానికి తీసుకెళ్లారు.
సాయిచంద్ కు అశ్రు నివాళి
— BRS Party (@BRSparty) June 29, 2023
తెలంగాణ ఉద్యమ గాయకుడు, ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ భౌతికకాయానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRBRS pic.twitter.com/ZuIew4Arl4
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రులు pic.twitter.com/nz3p7qPPic
— BRS TechCell (@BRSTechCell) June 29, 2023