అన్వేషించండి

Hyd to Sabarimala Buses: అయ్యప్ప భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ - శబరిమలకు ప్రత్యేక బస్ సర్వీసులు

Hyderabad to Sabarimala Buses: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.

Hyderabad to Sabarimala Special Buses: అయ్యప్ప భక్తులకు టీఎస్ఆర్టీసీ (TSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ (Hyderabad) నుంచి అయ్యప్ప దర్శనానికి శబరిమల (Sabirimala) వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్ సర్వీస్ (Special Bus service To Sabarimala) ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 5 (శుక్రవారం) నుంచి ఈ సర్వీసు ప్రారంభం కానుందని.. అయ్యప్ప భక్తులు ఎలాంటి ఆందోళన చెందకుండా యాత్ర సాగించవచ్చని తెలిపింది. ఇటీవల అయ్యప్ప భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి టైం, టికెట్ ధరలను ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి శబరిమల వెళ్లేందుకు ఓ ప్రయాణికుడికి రూ.13,600 ధరగా నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ప్యాకేజీలో భాగంగా అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 5న 'లహరి' బస్సు ఎంజీబీఎస్ (MGBS) నుంచి బయలుదేరుతుందని వివరించారు.

యాత్ర షెడ్యూల్ ఇదే

  • బస్సు తొలి రోజు (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు ఎంజీబీఎస్ (MGBS) నుంచి బయలుదేరుతుంది.
  • 2వ రోజు రాత్రి 7:30 గంటలకు కాణిపాకం చేరుకుంటుంది. అక్కడ వినాయకుని దర్శనం అనంతరం అదే రోజు రాత్రి 10:30 గంటలకు తిరిగి బయలుదేరుతుంది.
  • 3వ రోజు ఉదయం 6:30 గంటలకు గురువాయూర్ చేరుకుంటారు. అక్కడ దర్శనాల అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు బయలుదేరుతుంది.
  • 4వ రోజు రాత్రి 11:20 గంటలకు ఎరుమేలి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 8:10 గంటలకు ప్రారంభమవుతారు. 9:20 గంటలకు పంబకు చేరుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 01:30 గంటలకు బయలుదేరుతుంది.
  • 5వ రోజు ఉదయం 5:20 గంటలకు తిరువనంతపురం చేరుకుని.. తిరిగి 9:20 గంటలకు స్టార్ట్ అవుతుంది. అదే రోజు సాయంత్రం 5:30 గంటలకు మధురై చేరుకుని తిరిగి 11:20 గంటలకు బయలుదేరుతుంది.
  • 6వ రోజు ఉదయం 7:30 గంటలకు అరుణాచలం చేరుకుని.. అక్కడి నుంచి 3:30 గంటలకు తిరిగి బయలుదేరుతుంది. అదే రోజు సాయంత్రం 6:10 గంటలకు కంచికి చేరుకుని, మరుసటి రోజు తెల్లవారుజామున 2:10 గంటలకు అకక్డి నుంచి బయలుదేరుతుంది.
  • 7వ రోజు ఉదయం 11:10 గంటలకు మహానంది చేరుకుంటుంది. అక్కడి నుంచి రాత్రి 11:30 గంటలకు బయలుదేరి బస్సు నేరుగా ఎంజీబీఎస్ చేరుకుంటుందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

మరోవైపు, సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి 4,484 ప్రత్యేక బస్సులను నడిపేలా టీఎస్ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకూ హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 626 బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్లకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. భాగ్యనగరం నుంచి ఏపీకి రద్దీ దృష్ట్యా 1,450 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు.

అద్దె బస్సులు యథాతథం
Hyd to Sabarimala Buses: అయ్యప్ప భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ - శబరిమలకు ప్రత్యేక బస్ సర్వీసులు

అటు, అద్దె బస్సుల యజమానులతోనూ ఆర్టీసీ యాజమాన్యం చర్చలు సఫలమయ్యాయి. తమ సమస్యలు పరిష్కరించకుంటే శుక్రవారం నుంచి సమ్మెకు వెళ్తామని అద్దె బస్సుల యజమానులు ప్రకటించడంతో సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ గురువారం వారితో సమావేశమయ్యారు. ఈ భేటీలో అద్దె బస్సుల యజమానుల సమస్యలను విన్న సజ్జనార్ వారం రోజుల్లో వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇందు కోసం ఓ కమిటీని వేస్తామని చెప్పారు. 2, 3 రోజుల్లో వీటికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామని సజ్జనార్ తెలిపారు. కాగా, 5 ప్రధాన సమస్యలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లినట్లు అద్దె బస్సుల యజమానులు తెలిపారు. ఈ నెల 10లోగా సమస్యలు పరిష్కరిస్తామని ఎండీ హామీ ఇచ్చారని చెప్పారు. దీంతో శుక్రవారం నుంచి తలపెట్టిన సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.

Also Read: Telangana News: అద్దె బస్సుల యజమానులతో ఆర్టీసీ చర్చలు సఫలం - రేపటి నుంచి యథావిధిగా బస్సులు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Embed widget